Author Archives: భూమిక

సారా అబూబక్కర్ – శాశ్వత కీర్తి

రాజేశ్వరి దివాకర్ల కన్నడంలోని సుప్రసిద్ధ ముస్లిం రచయిత్రి శ్రీమతి సారా అబూబక్కర్. ఈమె కథలు, నవల, వ్యాసం, అనువాదం ఇత్యాది అనేక రచనలను కావించారు. వీరికి ఈ నడుమ నంజనగూడు తిరుమలాంబ గారి పేరిట శాశ్వతి మహిళా అధ్యయన కేంద్రం వారిచ్చిన పురస్కారం లభించింది. శ్రీమతి నంజన గూడు తిరుమలాంబ కన్నడంలోని మొట్టమొదటి లేఖకి, సంపాదకురాలు, … Continue reading

Share
Posted in అనువాదాలు | Leave a comment

గ్రామీణ అభివృద్ధి – ఉపాధి హామీ చట్టం

డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కె. సుభాషిణి, కాకతీయ విశ్వవిద్యాలయం నిర్మాణ కార్యక్రమంలో గాంధీజీకి అపారమైన విశ్వాసం ఉండేది. భారతదేశంలో నూటికి ఎనభై మంది గ్రామాలలో నివసి స్తున్నారు. అందువల్ల గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని, నగరవాసులు గ్రామీణ ప్రజలను దోచుకోరాదని ఆయన అభిప్రాయం. మానవాళి, మనుగడకు దోహదంచేసే రంగాలలో వ్యవసాయరంగం ఒకటి. 91 శాతం ఆహారం మనకు … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అదొక చతుర్శాల భవంతి – రోదన కూడ వ్యక్తీకరించలేని స్త్రీ

వై. విజయలక్ష్మి మా అత్తగారు వారి హయాంలో 40, 50 సం||ల క్రింది విషయాలు, సంఘటనలు చెబుతుంటే మనుషుల్లో ఇలాంటివారు కూడా ఉంటారా! అని అనిపించేది. అదొక చతుర్శాల భవంతి. సనాతనమైన హైందవ సంస్కృతికి ఆచారాలకు ప్రతీక ఆ ఇల్లు. ఉదయం మగవారు లేచి కాలకృత్యాలు తీర్చుకోగానే వారికంటే ముందే లేచి అన్ని పనులు చకచకా … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

భూమిక పాఠకులకు శుభవార్త

ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు ఎన్నో విడుదలవుతుంటాయి. ఇంతకు ముందు వాటిని కొనుక్కోవడానికి అందరం పుస్తకాల షాపులకి వెళ్ళేవాళ్ళం. మనకి కావలసిన పుస్తకాలను కొనుక్కునే వాళ్ళం. పుస్తకాల షాపులకెళ్ళడం, ఓ చక్కటి అనుభవం. గంటల తరబడి కాళ్ళు పీకుతున్నా ఒక్కో పుస్తకాన్ని ఎంతో ప్రేమగా తడుముతూ, పేజీలు తిరగేస్తూ పరవశించిన వాళ్ళమే అందరం. క్రమంగా చాలావరకు … Continue reading

Share
Posted in ప్రకటనలు | Leave a comment

ప్రతిస్పందన

జూన్‌ సంచికలో కల్పనా శర్మ మీద రాసిన సంపాదకీయం చాలా బావుంది. హిందూ పేపర్‌లో ఆమె కాలమ్‌ నేను రెగ్యులర్‌గా చదువుతాను. ఇక ముందు ఆ కాలమ్‌ వుండదంటే (తను రిటైర్‌ అవుతోంది కాబట్టి) బాధగా వుంది. ఆమె గురించి సంపాదకీయం రాసినందుకు అభినందనలు.

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

ప్రసారమాధ్యమాల్లో స్త్రీ, పురుషులు సమానమేనా?

– డాక్టర్‌ జె. భాగ్యలక్ష్మి ఈ ప్రశ్న కొత్తదేమీ కాదు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ లేవనెత్తటం జరుగుతోంది. చాలావరకు పురుషులే నిర్వహిస్తూ వచ్చిన వృత్తుల్లో స్త్రీలు ప్రవేశించటంతో, అందులోని వివక్ష, భేదభావాలు, ప్రతికూల వాతావరణం, అభిప్రాయాలు వీరి వృత్తి నిర్వహణ మరింత కష్టతరం చేస్తూ వచ్చాయి. కానీ ఈ సమస్యలు … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తారాబాయి చాల్‌ – గది నంబర్‌ 135

– సుధా ఆరోరా అనువాదం: ఆర్‌.శాంతా సుందరి (హిందీ మూలం) ఆమెకు పిల్లలు లేరు. ముప్ఫై ఎనిమిదేళ్ల ఆమె భర్త చనిపోయి ఇవాల్టికి పధ్నాలుగో రోజు. స్నానంచేసి, నీళ్లతో నానిన పెట్టికోట్‌ని పిండుకుని దాంతోనే తన ఒళ్లు తుడుచుకుంటూ ఉండగా, హఠాత్తుగా ఆమె కళ్లు అద్దంలోకి చూశాయి. అద్దం మీది దుమ్ముని ఆమె తడివేళ్లతో తుడిచేసింది.

Share
Posted in అనువాదాలు | 1 Comment

తీరం చేరని కెరటం

– తమ్మెర రాధిక జానకమ్మ జానమ్మ కాబోతోంది. పెండ్లి సూపులైనయి. పిలగాడు నల్లగ బక్కపలచగ ఓ మోస్తరుగా వున్నాడు. ప్యాంటు చొక్కా మీదంగ ఎర్ర తువ్వాల ఏస్కోని వచ్చిండు. పొల్లగాడే! జానకి మేనత్త చిద్రగాళ పైలమ్మ తెచ్చిందీ సంబంధం. ”పిలగాడు ఒక్కడు. ముగ్గురు ఆడిబిల్లలు… పెండ్లీలు గాలె. తల్లి వున్నది.

Share
Posted in కధానికలు | Leave a comment

”చీరనెరజాణ”

– పోడూరి కృష్ణకుమారి కళ్యాణమండపం గేటు దగ్గర నిలబడి పూలతో ఏర్పాటైన ఆర్చి, దానిమీద అందంగా తీర్చిన వధూవరుల పేర్లు చూస్తూ ఓ నిమిషం అలాగే నిలబడింది లత. కళాత్మకంగా తీర్చిదిద్దబడి, ఆహూతులతో కళకళలాడి పోతున్న ఆ హాలు అందాలు, సందడి చూసేందుకు రెండు కళ్ళు చాలవనిపించింది.

Share
Posted in గల్పికలు | 1 Comment

దళిత సాహిత్యానికి దళిత తల్లే నిర్మాత

– కత్తి పద్మారావు దళితులు అంటే అస్పృశ్యతకు గురైన జాతులు అని అర్థం. అస్పృశ్యతకు గురిచేసిన వారు భారతీయులు. అస్పృశ్యతకు గురైన వారు ఆదిభారతీయులు. అస్పృశ్యత అనే శబ్దం సంస్కృత శబ్దం. అస్పృశ్యులంటే స్పృశించబడనివారు అని అర్థం. ఈ భావం బ్రాహ్మణ కుటుంబ జన్యం అని అంబేద్కర్‌ చెప్పాడు. స్పృశ్యతా భావం పరిపూర్ణంగా ఉన్నవారే అస్పృశ్యులుగా … Continue reading

Share
Posted in వ్యాసాలు | 1 Comment

గ్రామీణ దళిత మహిళ – జీవన స్థితిగతులు

– సంకినేని వెంకటయ్య, చిట్యాల వినోద (రీసెర్చ్‌ స్కాలర్స్‌) ప్రపంచంలోనే మహోజ్వలమైన చరిత్ర ఉన్న పవిత్ర గ్రామీణ భారత దేశంలో సంస్కృతి పరంగా స్త్రీని దేవతామూర్తిగా పిలుస్తారు. దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. ప్రస్తుతం పితృస్వామిక కుటుంబాలుగా చలామణి అవుతున్న భారత గ్రామీణ వ్యవస్థలో గతంలో మాతృస్వామిక కుటుంబాలు ఉండేవి. అనగా … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆవృతం

– శారదా మురళి చిన్నప్పటినుంచీ వినయ్‌కి ఆడవాళ్ళంటే చాలా జాలి. ఆడవాళ్ళ బ్రతుకు చాలా దుర్భరమనీ, వాళ్ళకీ ఏ మాత్రం ఆత్మగౌరవం లేకుండా చేయటమే కుటుంబ వ్యవస్థ ధ్యేయమనీ అతను నమ్మేవాడు. తన తల్లినీ, నానమ్మనీ, ఇంకా అత్తయ్యల్నీ, పిన్నమల్నీ చూసి అతనా అభిప్రాయాని కొచ్చాడు.

Share
Posted in కథలు | 1 Comment

అద్భుతానందాన్ని కల్గించిన హిమాలయాల ట్రెక్కింగు

– బీడుపల్లి భాగ్య ఆకులో ఆకునై పూవులో పూవునై ఈ అడివి దాగిపోనా….. అని కృష్ణశాస్త్రి గీతం అడవి మాధుర్యాన్ని, సౌందర్యాన్ని గుర్తుచేస్తుంది. అంతగొప్పగా హిమాలయాలు ఆ పరిసరాలు మనల్ని ఎంతో పరవశింపచేస్తాయి. ఈ మురికి, ఇరుకు జీవితాల నుండి విముక్తి చేయగలిగే మహాశక్తి హిమాలయాలకు వుందని చెప్పటం అతిశయోక్తికాదు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 1 Comment

ఆర్తనాదం

– డి. గాయత్రి ఆర్తనాదం ఆర్తనాదం ఎవరిదీ గొంతు ఎక్కడిదీ అరుపు కర్ణ కఠోరంగా…

Share
Posted in కవితలు | Leave a comment

”ఎదురీత”

– పాతూరి అన్నపూర్ణ కాలానికి కొత్త రెక్కలు మొలిచాయి నా అడుగుల దారీ మారింది! సమస్యలను అధిగమించేందుకు ఆలోచనల పదునూ పెరిగింది!

Share
Posted in కవితలు | Leave a comment

ఈ ఉత్తరం – శ్వేతగీతం

– ఎన్‌. అరుణ నీకో తెల్లకాగితాన్ని పోస్టు చేస్తాను. అక్షరాలు మలినమౌతున్నాయి వాక్యవిన్యాసాల్లో భావాలు పులుముడైపోతున్నాయి

Share
Posted in కవితలు | Leave a comment