-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
ఒక వృత్తిగా గ్రామీణాభివృద్ధి
రాజ్యంసిన్హా (గ్రామాలు అన్ని రకాలుగాను విధ్వంసం వేపు అడుగులేస్తున్న ఈనాటి ప్రపంచీకరణ నేపధ్యంలో 1985 రాజ్యంసిన్హా రాసిన ఈ వ్యాసం ప్రచురించడం ఒక అవసరంగా భావించాం. ఈ వ్యాసాన్ని అందించిన వి. హనుమంతరావుగారికి ధన్యవాదాలు.)
Posted in వ్యాసాలు
Leave a comment
గృహహింస సామాజిక నేరం
డా. మానేపల్లి గృహహింస అంటే ఒక కుటుంబంలో భర్త భార్యను గానీ, లేదా అవిభక్త/ఉమ్మడి కుటుంబంలో అత్తమామలూ, ఆడపడుచూ – పై ఇంటినుంచి కోడలుగా వచ్చిన ఇల్లాలిని పెట్టే హింసగాని, కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు, లేక బావలు, మరుదులు పెట్టే హింసగాని – అని అర్థం చెప్పుకోవచ్చు. అది అన్ని ఇళ్ళల్లో అన్ని కులాల్లో అన్ని … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
మాఘ సూర్యకాంతి
బండారి సుజాత కథా పరిచయం : ఉత్తమ పురుషలో నడిచే ఈ కథలో కథనం చేసే స్త్రీకి పెద్ద కూతురు కమల, రెండవ కూతురు శ్యామల కాక ఇద్దరు మగ పిల్లలు.
Posted in వ్యాసాలు
Leave a comment
మట్టిలో కలిసిపోతున్న మన అణిముత్యాలు
పుష్ప, డిగ్రీ 3వ సం||, కోఠి ఉమెన్స్స్ కాలేజీ వేరేవాళ్ళ ప్రోత్సాహం కొంత, నేను ఏదైనా సాధించగలను అనే ధీమా, 100% కష్టపడి చదివితే మన భూమిక లాంటి స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవా అనే ఆశ కొంత, అన్నీ కల్సి నన్ను చదువుకొని పై దిశగా ఆలోచించడానికి కారణం అవుతున్నాయి.
Posted in వ్యాసాలు
Leave a comment
భూమిక పాఠకులకు, అభిమానులకు విజ్ఞప్తి
భూమిక పాఠకులకు, అభిమానులకు నమస్కారం. భూమిక అజేయ ప్రయాణం ప్రారంభించి దాదాపు పదిహేను సంవత్సరాలు కావస్తోంది. త్రైమాస పత్రికగా మొదలై, ద్వైమాస పత్రికగా కొనసాగి ప్రస్తుతం మాసపత్రికగా నిలదొక్కుకున్నది. అన్వేషి అండదండలతో తొలి అడుగు వేసినా, అచిర కాలంలోనే స్వయంసిద్ధగా ఎదిగింది. ఒక ప్రత్యామ్నాయ స్త్రీవాద పత్రికగా తన లక్ష్యాలు, ఉద్దేశ్యాల విషయంలో ఎలాంటి రాజీ … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
డా. సమతారోష్ని సత్యవతిగార్లకు మీరు జూన్ సంచికలో రవాణాశాఖమంత్రిగారికి రాసిన ఉత్తరం చదివాను. అందులో రాసిన విషయం మంత్రి గారికిగాని ఆర్టిసి వారికి గాని అతి మాములు విషయం. వారినించి ఏలాంటి సమాధానం రాదు. ఒక వేళ వచ్చినా ఆ డిపో మేనేజరుకు ఎంక్వయిరీ చేయమని వస్తుంది. డిపో మేనేజర్ ఆ రోజు బస్సులో ఉన్న … Continue reading
Posted in ఎడిటర్‌కి లేఖలు
Leave a comment
సమూల పరివర్తన ద్వారానే స్త్రీవిముక్తి సాధ్యం
(డా|| ఉమ చక్రవర్తితో డా|| రమేశ్ ఉపాధ్యాయ జరిపిన ఇంటర్వ్యూ అనువాదం- జె. ఎల్. రెడ్డి (హిందీనుండి) ‘Social Dimensions of Early Budhism’, ‘Rewriting History : The Life and Times of Pandita Ramabai’, ‘Gender and Caste through a Feminist ‘Everyday Lives and Everyday Histories : … Continue reading
Posted in ఇంటర్‌వ్యూలు
1 Comment
నీలోన్నా క్రమోన్మీలన వ్యక్తిత్వ వికాసం “అమ్మ”
– వి. ప్రతిమ అలెక్స్య్ మక్సీమొవిచ్ పీష్కోవ్…… మాక్సింగోర్కీ కలం పేరుతో నిరుప మానమయిన రచనలు చేసి ప్రపంచ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా… కార్మిక కర్షక వర్గాలకు, సామాన్య ప్రజలకు ప్రాతఃస్మరణీయుడుగా నిలిచి పోయాడు… ఆనాటి రష్యన్ సమాజంలోని దుష్టత్వానికి అణిచివేతలకు, పీడనకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన కలం యోధుడు గోర్కీ… గోర్కీ అయిదో ఏట … Continue reading
Posted in ప్రత్యేక వ్యాసాలు
1 Comment
పట్టపగటి చీకటి
– ఓల్గా పరిశుభ్రమైన నీటి మడుగులో చిక్కగా చేరుతున్న కల్మశం, కుంచించుకుపోతున్న నీళ్ళు – విస్తరిస్తున్న మురికి చేస్తున్న విజయహాసం. మడుగు చుట్టూ చేరిన వారందరూ ఆ మురికిని చూసి సంతోషిస్తున్నారు. ఇష్టంగా ఒంటికి రాసుకుంటున్నారు. తనకూ రాయబోతున్నారు.
Posted in కథలు
5 Comments
తొవ్వ
జయప్రకాష్ మాటేటి గాలికి కిటికీలు టపటప కొట్టు కుంటాంటె దెబ్బకు తెలివికొచ్చింది. టైం ఎంతైందో అనుకుంటనే ఉన్న. దూరంగ పదకొండు గంట్ల సీటీ ఇనొచ్చింది. వానకు ట్రాన్స్ఫార్మర్ పేలి కరంట్ పోయింది. దీపం పెట్టుకొని సంటోన్ని కాల్లమీద ఏసుకొని ఊపుతుంటె ఎప్పుడు కన్నంటుకున్నదో తెలువలే.
Posted in కథలు
Leave a comment
“ది గార్డెడ్ టంగు”
కె. ఆర్. మీరా అనువాదం: ఓల్గా “నేను నా రాజకీయ తీర్పులను, స్పష్టంగా, గట్టిగా బలమైన రీతిలో వ్యక్తీకరించటానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాను – నేను చెప్పే విషయాలు సత్యమైనవి కావన్నట్లు, నేనేదో కపటంగా ఉన్నట్లూ అనిపిస్తుంటుంది. ఎందుకంటే జీవితం గురించి నా ఆలోచనలను ఒకే గొంతులోంచి వచ్చే సంగీతానికి, ఒకే దృక్పథానికీ కుంచించలేను.
Posted in వ్యాసాలు
Leave a comment
జయప్రద నానీలు
డా|| పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి భర్త మంచితనం ఖరీదెంత? కట్టుకున్న ఇల్లాలి సహనమంత. వృద్ధాప్యాన్ని వేగంగా కొనుక్కుంటున్నాం గర్భాశయాన్ని పీకిపారేసి.
Posted in కవితలు
Leave a comment
మహిళా విన్యాసం
డా|| వాసా ప్రభావతి హరిత చందనమై అరిగిపోతూ చల్లగా పరిమళిస్తూ! కన్నబిడ్డలనే కాదు ఆత్మీయతానురాగాలకు ఆలంబనమైన నీ గొంతు ఏ స్వాప్నికులకైనా మేలుకొలుపే! ఏ కోకిలగానానికైన ఆదర్శమే! ఈ భౌతికలోకంలో నీ కాయకష్టాన్ని ఏ హృదయ త్రాసులు తూచలేవు?
Posted in కవితలు
Leave a comment
ద్వంద్వనీతి
కృతి (కె. కృష్ణకుమారి) బీటలు వారిన నేల గుండెను ఆర్తిగా హత్తుకున్న చినుకు చుక్కలా నీ మాటలోని మానవీయ స్పర్శ ఆత్మీయంగా నన్ను అల్లుకుంటే వెలుగుదారులు పరిచినట్లయ్యింది
Posted in కవితలు
Leave a comment
మరి మనిషేంటి…!?
సరికొండ నరసింహ రాజు రాలిన ఆకుల గూర్చి చింతంచదు చెట్టు రేపటి చిగురుకై రేయింబవళ్ళు శ్రమిస్తుంది! మరలి పోయిన అలకై నీరసించదు సందం! పోటెత్తే అలలతో పొంగి పొంగి పొర్లుతుంది!
Posted in కవితలు
Leave a comment
నాతి చెరామి
వేలూరి సుధారాణి నాలుగేళ్ళనుంచి ప్రేమిస్తున్నానన్నాడని నాలుగు లక్షలు కట్నం ఇచ్చి కట్టుకున్నాను వాడ్ని పెళ్ళికి ముందు “సీతాకోకచిలుక “ అన్నవాడు ఏడాది గడిచేసరికి “గొంగళి” పురుగు అన్నాడు
Posted in కవితలు
2 Comments
