-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
June 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
సూర్యుణ్ణి మింగేసిన మబ్బులు -రమాదేవి చేలూరు
చెంగలువలు విరిసే నీటి మడుగుల కావల, పడుచుపిల్ల పరికిణీలా వెదురు పొదలున్నాయి. వాటిని దాటుకొని పోతే, ఆడపిల్ల వంకీల జుట్టులా చిన్న గుట్టలున్నాయి. వాటిని ఎక్కి దిగితే నుదుటిమీద బొట్టులా ఒద్దికైన పల్లెటూరుంది. అది సంజమ్మ ఊరు.
Posted in కధానికలు
Leave a comment
‘తెలుగు సినిమా’ చెంప ఛెళ్ళుమనిపించిన ‘‘పలాస’’ – చైతన్య పింగళి
ఒక బాలా, ఒక పా.రంజిత్, ఒక వెట్రిమారన్ స్థానిక కథలకి ఇచ్చిన ప్రాధాన్యత కరుణ కుమార్ ఒక సినిమాతో తెలుగులోకి తీసుకురాగలిగారంటే చాలా గొప్ప విషయం. జీవితంలో కష్టాలను ‘సినిమా కష్టాలతో’ పోల్చుతారు. సినిమా తీయడానికి కూడా అంతకు మించిన కష్టాలు ఉంటాయి.
Posted in సినిమా సమీక్ష
Leave a comment
మనసుని తాకే పిల్లల సినిమాలు : అనిల్ బత్తుల -స్వాతి కుమారి
మంచి పిల్లల సినిమాకి ముఖ్యమైన లక్షణాలు ` పిల్లల దృష్టి కోణంలో ప్రపంచాన్ని చూడగలగటం. చిన్నపిల్లల ప్రపంచం చాలా పెద్దది. వాళ్ళ ఆలోచనలకు హద్దులు, ఊహలకి పొలిమేరలు ఉండవు. ఫౌంటెన్ లాగా చిమ్మే
Posted in పుస్తక పరిచయం
Leave a comment
వీరయ్య చెప్పిన మరో విషాద గాథ -ఆర్.ఎస్.వెంకటేశ్వరన్
ఆఫ్రికా సాంప్రదాయం ప్రకారం బిడ్డ పుట్టగానే మొదటి సారిగా బిడ్డ చెవిలో మాత్రమే తన పేరు మెల్లగా చెప్పాలి ఆ తర్వాతే సమాజానికి తెలియజేయాలి. తనెవరో తనకే ముందు తెలియాలన్న పురాతన ఆఫ్రికా సాంప్రదాయాన్ని వారు ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నారు.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ఏకాంత ప్రయాణాలు -కొండవీటి సత్యవతి
నబనీత దేవసేన ప్రముఖ బెంగాలీ రచయిత. కలకత్తాలోని జాదవ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్. ఆమె బెంగాలీ భాషలో రాసిన చాలా రచనలు ఇంగ్లీష్‌లోకి అనువాదమయ్యాయి. నవలలు, కథలు, కవిత్వం, నాటకాలు, ట్రావెలాడ్స్ వంటి ఎన్నో ప్రక్రియల్లో ఆవిడ రచనలు చేశారు. ఆమెను నేను రెండుసార్లు కలిశాను. చాలా సరదాగా, సంబరంగా ఉంటారావిడ.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
రంధి నవలలో స్త్రీ చైతన్య దృక్పథం -డా॥ మంగమార మునిలక్ష్మి
‘‘రంధి’’ నవలను ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు రచించారు. ఇందులో ప్రధాన కథ ఊరికి పల్లెకు మధ్య జరిగే అంతర్యుద్ధం. అంటే అగ్రవర్ణాల వారికి, దళితులకు మధ్య జరిగే గొడవ. కథంతా గుంటూరు వేజెండ్ల గ్రామ నేపథ్యంలో జరిగే సంఘటనలు, అగ్రకులాల ఆధిపత్య పోరులో నలిగిపోయే దళితులు, దళిత స్త్రీ అస్థిత్వ సమస్య ప్రధాన సందర్భం. … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
కుడుంబశ్రీ : కోవిడ్`19 లాక్‌డౌన్ సమయంలో మహిళా స్వయం సహాయక బృందాల పాత్ర -కందగట్ల శ్రవణ్ కుమార్
భారతదేశంలో లాక్‌డౌన్ సమస్య తీవ్రతను తగ్గించడంలో వీలైనంత తక్కువ సమయంలో ఉత్తమ పరిష్కారాలు చూపించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇక్కడి ప్రభుత్వ యంత్రాంగాలకు మహిళలు అందించిన చేయూత గొప్ప సామాజిక ప్రభావాన్ని చూపాయి. కోవిడ్`19 లాంటి విపత్తును ఎదుర్కోవడం కేవలం ప్రభుత్వాలకు మాత్రమే సాధ్యం కాదు.
Posted in వ్యాసం
Leave a comment
కరోనా కట్టడిలో మోడీ వైఫల్యం -ఎ.నర్సింహారెడ్డి
దేశంలో కొవిడ్ వైరస్ రెండో దశలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. దవాఖానాలు ఫుల్, స్మశానాలు ఫుల్, ఊపిరాడటం లేదు. నేడు కరోనా గాఢ పరిష్వంగంలో ఎప్పుడు ఎవరు వాలిపోతారో, ఎక్కడ ఎవరు రాలిపోతారో తెలియని హృదయ విదారకరమైన పరిస్థితి. ఇంత దారుణ పరిస్థితులు… దేశం ముందెన్నడూ చూడని భయానక పరిస్థితిని చూస్తోంది.
Posted in వ్యాసం
Leave a comment
అలనాటి రచయిత్రి కోమలాదేవితో కాసేపు -వి. శాంతిప్రబోధ
ప్రేమ కథలు, నవలలు రాజ్యమేలుతున్న కాలంలో అందుకు భిన్నంగా రచనలు చేసిన రచయిత్రి గుర్తున్నారా…! ఆవిడ ఎవరని ఆలోచిస్తున్నారా.. ఆవిడేనండి అలనాటి రచయిత్రి కోమలాదేవి.
Posted in వ్యాసం
Leave a comment
అక్కడ దళితులను ఆపిన శక్తి ఏది? -ప్రసాద్ చరసాల
ఇక్కడ రెండు ఫోటోలు జత పరుస్తున్నాను చూడండి. ఇవి రెండూ మా ఊరికి సంబంధించిన గూగుల్ మ్యాప్ చిత్రాలు. ఒకటి ప్రస్తుతం మా ఊరి సామాజిక, నైసర్గిక స్వరూపాన్ని చూపిస్తే మరొకటి ఊరి చుట్టుపక్కల భూములను చూపిస్తుంది.
Posted in వ్యాసం
Leave a comment
నాకు చీరంటే…! – నాంపల్లి సుజాత
నక్షత్రాలను పొదుముకొని మెరిసిపోయే ఆకాశమే… నాకు చీరంటే సప్తవర్ణాల సోయగాలతో నను చుట్టుకున్న ఇంద్రధనుస్సే…చీరంటే
Posted in కవితలు
Leave a comment
పిల్లల భూమిక
Posted in పిల్లల భూమిక
Leave a comment
కరోనా మృత్యుఘోష ` పట్టని ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణులు – కొండవీటి సత్యవతి
కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోలం, విధ్వంసం గమనిస్తుంటే, పిట్టల్లా రాలిపోతున్న మనుషుల్ని చూస్తుంటే, గుండెల్లోంచి పొంగుకొస్తోన్న దుఃఖం గొంతులో సుడులు తిరుగుతుంటే ఓదార్పు కోసం ఏ దిక్కు చూడాలి, ఎవరి భుజాన్ని అడగాలి, ఎవరి గుండెమీద వాలి భోరున ఏడవాలి? సంవత్సర కాలంగా జరుగుతున్న దారుణ పరిణామాలు, మనిషికి మనిషి కాకుండా పోతున్న వైనాలు … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
