Category Archives: వ్యాసం

సామాజిక బాధ్యతను మరింతగా పెంచిన టూర్‌

– గీత ఆదిలాబాద్‌ అడవుల్లోకి ప్రయాణం ఎప్పటినుండో అనుకుంటున్నా కుదిరింది ఇప్పటికి. ఇదివరకే అందరం కలిసి చేసిన వైజాగ్‌, కర్నూలు ప్రయాణాలు గుర్తుకు వచ్చి ఆదిలాబాద్‌ అడవుల్లోకి ఉరకలెత్తింది మనసు. ఈసారి కొత్తగా నాతోపాటు అక్కలిద్దరు, చెల్లి, నా ఫ్రెండ్‌ ఇందిర తనతో పాటు ఉష అందరూ మేము కూడా అన్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆదిలాబాద్‌ అడవుల్లో… గోండు గూడేలలో…

– వి. శాంతిప్రభోద నేను పుట్టింది వరంగల్‌ జిల్లాలో అయినా పెరిగిందంతా ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల సమీపంలోని బుద్దిపల్లిలో. మా పెద్దమ్మలు, మామయ్యవాళ్ళ ఊరు దండేపల్లి మండలంలోని తానిమడుగు వెళ్ళినప్పుడల్లా గోండులు, నాయకపోడ్‌, లంబాడా గిరిజనులను చూస్తూనే ఎదిగాను.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఇదొక ఎడ్యుకేషనల్‌ టూర్‌

 – లత (మున్ని) సత్య & గ్రూప్‌తో ఆదిలాబాద్‌ టూర్‌కి వస్తావా అని గీతక్క అడగ్గానే కర్నూల్‌ ట్రిప్‌ గుర్తొచ్చింది. ప్రకృతి ఒడిలోకి ప్రయాణం. అందుకే వెంటనే వస్తానన్నాను. ప్రయాణపు మొదటి మజిలీ అమృతలత గారి సొంత గృహం.

Share
Posted in వ్యాసం | Leave a comment

జనారణ్యంలోంచి హరితారణ్యంలోకి…. –

నెల్లుట్ల రమాదేవి జనవరి ఇరవై రాత్రి ఏడూ – ఎనిమిది మధ్య సమయం విజయ్‌ హైస్కూల్‌ నిజామాబాద్‌ ఆవరణలో మేం చూసేది భూమిక ఆధ్వర్యంలో వస్తున్న మిత్రుల కోసం ఆరాటం ఎంతకీ రాని బస్సుకోసం

Share
Posted in వ్యాసం | Leave a comment

మధురానుభూతి

– రచ్చ సుమతి జనవరి మూడవ వారంలో ‘భూమిక’ రచయిత్రులతో నేను చేసిన రెండు జిల్లాల పర్యటన నన్ను నా మూలాల వరకు తీసుకెళ్ళింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

అలరించిన ఆదిలాబాద్‌ యాత్ర

– ఇందిర నేను నర్సంపేట ఆంధ్రాబ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్‌ (2006) అయినప్పుడు గీతతో పరిచయం. తను, నేను అక్కడ రూమ్‌మేట్స్‌ తరువాత మంచి స్నేహితులుగా మారాం.

Share
Posted in వ్యాసం | Leave a comment

సాహసవిహార యాత్ర-

పంతం సుజాత మళ్ళీ మరోసారి భూమిక రచయిత్రుల బృందం ‘సాహస విహార యాత్ర’కి బయలుదేరాం. సత్యవతి గారు ఏర్పాటుచేసిన ఏ.సి బస్సులో సాయంత్రం నాలుగు గంటలకి అందరూ బయలుదేరాం. చాలాకాలం తర్వాత కలుసుకున్న ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటూ నిజామాబాద్‌ చేరుకున్నాం. అప్పటికే ‘అమృతలత’ గారు పంపిన మనుషులు మాకోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళు దారిచూపిస్తుంటే మా బస్సు … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

సుడిగాలి పర్యటన అనుభూతి

 – టి. అమూల్య మా ప్రయాణం భూమిక ఆఫీసు నుండి సాయంత్రం 4.15 కు మొదలైంది. నిజామాబాద్‌లోని విజయ పబ్లిక్‌ స్కూల్‌ విపియస్‌ వెళ్ళేసరికి అమృతమేడం గారు తన సహచర బృందంతో మా అందరిని పేరు పేరున పరిచయం చేసుకొన్నారు. అమృతగా రి బృందం అందరిని ఆహ్వానించారు. ఎంతో ప్రేమతో మా అందరిని ఆహ్వానించారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

అడవుల్లో రచయిత్రుల ఝరి

 – సరిత, మహిళా సమత తేది : 22.1.2014న ఆదిలాబాద్‌ జిల్లాకి హైదరాబాద్‌ భూమిక నుండి 25 మంది రచయితల బృందం మరియు స్టేట్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ ప్రశాంతి గారు, ఇంత మంది రచయిత్రులు మా జిల్లాకు రావటమనేది మా యొక్క అదృష్టంగా భావించాను. అందరు పెద్దవారు గొప్పమేధావులు వారికున్న విలువైన సమయాన్ని మా కొరకు … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

మధురమైన అనుభవం

 – కల్పన. పి తెలంగాణ జిల్లాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు భూమిక రచయిత్రలతో కలసి వెళ్ళిన వైజాగ్‌ ట్రిప్‌ ఎప్పటికీ మరచిపోలేను. అలానే ఈసారి వెళ్ళిన ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలలో పర్యటించడం.

Share
Posted in వ్యాసం | Leave a comment

మరచిపోలేని యాత్ర

– సరిత, భూమిక నేను భూమికలో జాయిన్‌ అయ్యి 1 1/2 సంవత్సరాలయ్యింది. అప్పటి నుండి ఏదైనా ఫైల్స్‌ తీసేటప్పుడు ఫోటోలు కనపడటం, ఇవి రచయిత్రుల క్యాంప్‌ ఫోటోలు, అబ్బ భలే ఎంజాయ్‌ చేసాం అని ప్రసన్న, లక్ష్మి, కల్పనలు అనడం, సత్యవతి గారి ”తుపాకీ మొనపై వెన్నల” పుస్తకం కోసం ఫోటోలు వెతికేటప్పుడు మేడం … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు

(భూమిక నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి పొందిన వ్యాసం) – పి.వి. లక్ష్మణరావు ”పితారక్షతి కౌమార్తే భర్తా రక్షతి యౌవనే, సుతా రక్షతి వార్ధక్యే నస్త్రీ స్వాతంత్య్రమర్హతి” అని వ్యాసుడు జయసంహితలో చెప్పాడు. స్త్రీకి బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమారుడు ఆలంబనగా ఉండాలి.

Share
Posted in వ్యాసం | Leave a comment

భూమిక వార్షిక పోటీలలో ప్రథమ బహుమతి పొందిన వ్యాసం

 ”మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు” -భావరాజు పద్మిని స్త్రీ హృదయం పువ్వుకన్నా కోమలమైనది. ఒక అందమైన పువ్వును చూసినప్పుడు, కాసేపు ఆ సౌందర్యానికి ముగ్దులై చూస్తూ ఆనందించేవారు కొందరు. ఇందులో గొప్ప మానవత ఉంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలుగు సినిమా స్వర్ణయుగంలో మెరిసిన సువర్ణ సుందరి – మహానటి అంజలీదేవి

– ఇంద్రగంటి జానకీబాల నటనైనా, నాట్యమైనా, గానమైనా, కవిత్వమైనా, ఏ కళైనా, కళాకారుని (కళాకారిణి) స్వభావంలోంచి, పుట్టుకతో వచ్చిన వాసన వల్లే సమకూరుతుంది. అలా అబ్బిన కళకి కృషివల్ల మెరుగులు దిద్దుకుని మెలకువలు నేర్చుకుని కొందరు సాటిలేని మేటి కళాకారులుగా తమని తాము తీర్చిదిద్దుకుంటారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఉన్నత విద్యా సంస్థల్లో స్త్రీలపై లైంగిక దాడులు (స్థితిగతులు)

సర్వం శక్తి మయం. శక్తి స్త్రీ స్వరూపం. ఈ అనంత విశ్వానికి మహిళనే మూలాధారం. ప్రాచీన కాలం అనగా భారత ఇతిహాసాలలో మహిళలకు విశిష్ట స్థానం ఉంది. భారతీయ మహిళ గర్భంలో పిండ దశ నుండే అడుగడుగునా గండాలు, సామాజిక అవాంతరాలను ధైర్యంగా ఎదుర్కొంటూ రాణిస్తున్న ధైర్యవంతురాలు.

Share
Posted in వ్యాసం | Leave a comment

బడుగు జీవుల వెతలు

– శీలా సుభద్రాదేవి డి. సుజాతాదేవి పేరు వింటే సాహిత్య రంగంలో కొందరు ‘ఆమె బాల సాహిత్య రచయిత్రి కదా’ అంటారు. మరికొందరు ”గేయాలు రాస్తుంది” అంటారు. తమ రచనలు తప్ప ఇతరుల రచనలు చదివే అలవాటు లేనివాళ్ళు ”ఎవరామె ఏమిటి రాసింది? ”ఎప్పడూ పేరు విన్నట్లు లేదే?” అని కూడా అంటారు.

Share
Posted in వ్యాసం | Leave a comment