పుస్తక సమీక్షలు

స్వేచ్ఛాగీతిక-షాజహానా ‘నఖాబ్‌’ కవిత

భూమిక జూన్ 2008

ముంగర జాషువ 

స్త్రీ ఒక అలంకార వస్తువు
పురుషుని ఆస్తిపాస్తులలో ఒక భాగం
పిల్లల్ని కనే యంత్రం
స్వేచ్ఛ ఇవ్వగూడని మానవమృగం
లైంగికావసరాలను తీర్చే సాధనం స్త్రీ.
 
- ఇటువంటి భావజాలంలో మగ్గిపోతున్న పురుష సమాజానికి మరీ ముఖ్యంగా ముస్లిం సమాజానికి ‘నఖాబ్‌’ కవిత ఒక అక్షరాస్త్రం.
 పురుష దురహంకారానికి కనువిప్పు కలిగించే కాంతిరేఖలు, షాజహానా కవితలు.  అటువంటి కొన్ని కవితలను పరామర్శించడమే యీ వ్యాసోద్దేశ్యము.

పూర్తిగా చదవండి »

నీల పాదాల స్పర్శ అలల్ని సైతం పులకింపచేస్తుంది.

భూమిక ఏప్రిల్ 2008

కె. సత్యవతి

‘’మా అమ్మ నీల ముచ్చట్లూ, జ్ఞాపకాలూ, వంటలూ..'’

 పుస్తకం చిన్నదే.

నీలమ్మ గురించి ఉన్నది 22 పేజీలే.
 మిగతా పేజీలన్నీ వంటలే. రమామేల్కొటే గురించి పరిచయం అక్కర్లేదు. తన మాటల్లో కొంత,

పూర్తిగా చదవండి »

స్త్రీల కష్టాల ‘మోపు’ నెత్తికెత్తుకున్న సుబ్బమ్మ

భూమిక మార్చ్ 2008

వి. ప్రతిమ

ఎవరన్నారట స్త్రీవాదం ఆగిపోయిందని?

 … స్త్రీల మీద పెత్త నాలు, ఆధిక్యత, పీడన … స్త్రీల అసహాయత, ఆత్మహత్యల, హత్యల కొనసాగుతున్నంత కాలం స్త్రీవాద సాహిత్యానికి మరణముండదు … పోరాటం ఆగదు.

పూర్తిగా చదవండి »

‘అమ్మ ఒక మనిషి’ గా గుర్తు చేస్తున్న ఎన్‌.అరుణ కవిత్వం

భూమిక మార్చ్ 2008

డా. సి. భవానీదేవి

‘మౌనమూ మాట్లాడుతుంది’ అంటూ నిశ్శబ్ద చైతన్యంతో కవితా రంగప్రవేశం చేసిన ఎన్‌. అరుణ పాటల చెట్టు, గుప్పెడు గింజలు కవితా సంపుటుల తర్వాత ‘అమ్మ ఒక మనిషి’ అంటూ తనదైన విలక్షణ స్వరాన్ని స్త్రీ పరంగా ప్రకటించారు.

పూర్తిగా చదవండి »

ఎ థౌజండ్స్‌ స్ల్పండిడ్‌ సన్స్

భూమిక ఫిబ్రవరి 2008

డా.జి భారతి
(గత సంచిక తరువాయి భాగం)

ఆ తరవాత కాబూల్లో అల్లకల్లోలం మరింత అవుతుంది. రషీద్‌ వారంపాటు షాపుకి కూడా వెళ్ళడు.

పూర్తిగా చదవండి »

మహిళలు - వర్గరాజకీయాలు : ఒక పరిశీలన

భూమిక ఫిబ్రవరి 2008

డా. మానే్పల్లి

అంతర్జాతీయంగా 1975ను - మహిళా సంవత్సరంగా పరిగణించారు. తరువాత 1975-85 మహిళా దశాబ్దం అన్నారు.

1980ల్లో తెలుగు దినపత్రికలన్నీ ఒక పూర్తి మహిళా పేజీతో ప్రకటించేవి. మూడేళ్లు దాటేసరికి ఆ పేజీలన్నీ వంటలు వార్పులు, కుట్లు-అల్లికలు,

పూర్తిగా చదవండి »

ఎ థౌజండ్‌ స్ల్పెండిడ్‌ సన్స్‌

భూమిక జనవరి 2008

డా|| జి. భారతి (గత సంచిక తరువాయి)

మధ్యకాలంలో తారిక్‌ తండ్రికి హార్టు ఎటాక్‌లు వచ్చి చాలా బలహీనపడిపోయాడు. మంచంలోంచి లేవలేని పరిస్థితి.

పూర్తిగా చదవండి »

ఎ థౌజండ్‌ స్ల్పెండిడ్‌ సన్స్‌

భూమిక డిసంబర్ 2007

డా. జి.భారతి

ఒక దేశపు సాంఘిక, రాజకీయ పరిస్థితులను తెలుసుకోవాలన్నా, ఆ దేశంలో జీవించే ప్రజల జీవితాలను గురించి తెలుసుకోవాలన్నా నవల చక్కని మాధ్యమంగా అనిపిస్తుంది.

పూర్తిగా చదవండి »

డి.వి. చట్టంపై వచ్చిన సమగ్ర పుస్తకం ‘ఆలంబన’

కొండవీటి సత్యవతి డిసంబర్ 2007

కొండవీటి సత్యవతి

కుటుంబహింస? పవిత్రమైన కుటుంబంలో హింస? రెండు దశాబ్దాల క్రితం వరకు మనం ఈ ప్రశ్నార్థకాలను విన్నాం.

పూర్తిగా చదవండి »

‘’అంతర్గత భావోద్వేగాల కెరటం గీత కవిత్వం'’

శిలాలోలిత డిసంబర్ 2007

శిలాలోలిత

‘కళ్ళల్లో కళ, వ్యక్తీకరణలో అందం, అక్షరాల్లో కాంతి, జీవితంలో ఔన్నత్యం - నిరాడంబరత నుంచే వస్తాయి.'’
- వాల్ట్‌ విట్‌మన్‌ అన్నట్లుగానే నిరాడంబరతలోని సౌందర్యమే గీత కవిత్వం.

పూర్తిగా చదవండి »

వాసిరెడ్డి సీతాదేవి - మరీచిక నవల

భూమిక అక్టోబర్ 2007

శిలాలోలిత
వాసిరెడ్డి సీతాదేవి రచించిన ‘మరీచిక’ నవలపై కె.బి. స్నేహప్రభ ‘వాసిరెడ్డి సీతాదేవి మరీచిక సావజిక మనోవిశ్లేషణ’ పేరిట యం.ఫిల్ కోసం ఉస్మానియ యూనివర్సిటీలో పరిశోధన చేశారు.

పూర్తిగా చదవండి »

మొలకెత్తుతున్న అక్షరం

భూమిక అక్టోబర్ 2007

డా|| సి. భవానీ దేవి

వర్తమాన కవితా రంగంలోకి పలువురు ప్రవర్థమాన కవులు వేళ్ళూనుకుంటున్న తరుణంలో ఈ యువకవి సమాజ విధ్వంసక ముఖచిత్రాన్ని ఆర్తిగా ఆవేదనగా బాధ్యతగా కలం కుంచెతో చిత్రిస్తున్నాడు.

పూర్తిగా చదవండి »

ఇస్లాం పితృస్వామ్యంపై ముస్లిం మహిళాలోకం ఢంకారావం

భూమిక సెప్టెంబర్ 2007

షాజహానా - నఖాబ్
యం. రత్నమాల

నల్లటి బురఖాల్లోపల కదులుతున్న అగ్నిపర్వతాలు ముస్లిం స్త్రీలు. బురఖా, నఖాబ్కి కంటిచూపు కోసం కళ్ళ ప్రాంతంలో వలలాంటి అతుకుదారాల సందుల్లోంచి ఎగజిమ్ముతున్న తీక్షణ వీక్షణ లావా షాజహానా కవితాసంపుటి నఖాబ్ -
పితృస్వామ్యం ఏకాండి శిలారూపం కాదు (ఏకశిలాసదృసం-మొనోలితిక్) పితృస్వామ్యానికి, కుల, మత, ప్రాంత, వర్గ ప్రత్యేక స్వభావమూ ఉంటుంది.

పూర్తిగా చదవండి »

అస్థిత్వ వేదనాశకలాల నిషిద్ధాక్షరి

భూమిక సెప్టెంబర్ 2007

శీలా సుభద్రాదేవి

అంతకుముందు అక్కడక్కడ కొందరు మాత్రమే గొంతు ఎక్కుపెట్టినా చలించని స్థితిలో నుంచి ఎనభై దశకం తర్వాత సాహిత్యరంగాన్ని ఒక్క కుదుపుకుదిపి ఒక స్పష్టమైన రూపుదాల్చిన ఉద్యమాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది స్త్రీవాదం. దీనిపట్ల ఆకర్షితులై కావచ్చు, గుర్తింపుకోసం కావచ్చు, అప్పట్లో వర్ధమాన కవులు, కవయిత్రులే కాక ప్రసిద్ధులైనవాళ్ళు సైతం తమవంతు ప్రోత్సాహాన్ని ఉద్యమానికి అందిస్తూ కవిత్వం వెలువరించారు. కొంతమంది నిజాయితీగా తమ స్పందనల్ని, తమ మనసుల్ని, అణచివేతల్ని, మథనల్ని ఆవిష్కరిస్తూ, తమ హక్కుల్ని, తమ అస్థిత్వాన్నీ కోరుకొంటూ కవిత్వీకరించారు. అటువంటి వారిలో మందరపు హైమవతి ఒకరు.
ఈమె కవిత్వంలో అస్పష్టత ఉండదు. చెప్పదలచుకొన్నది పదునైన పదాలతో సూటిగా చెప్తారు.

పూర్తిగా చదవండి »

“నాలోని స్తీ” కవితా సమీక్ష

భూమిక జూన్ 2007

- ఆర్‌.శాంతసుందరి

ఎలా చెప్పనమ్మా
మనిద్దరికీ ఇక అక్కడ చోటే లేదని!
మనసులో గాని ఇంట్లోగాని
మన జ్ఞాపకాలేవీ లేవనీ!
పూర్తిగా చదవండి »

రెండు దశాబ్దాల స్తీల్ర పయ్రాణం

వి. ప్రతిమ ఫిబ్రవరి 2007

స్త్రీలంటే శరీరాలు, స్త్రీలంటే పని… స్త్రీలంటే కన్నీళ్ళు, కష్టాలు… స్త్రీలంటే శృంగార సాహిత్య రూపాలు మాత్రమే అయిన సామాజిక సందర్భం నుండి స్త్రీలకి శరీరమూ, హృదయమూ, మెదడూ వున్నాయనీ, వాటికి సరయిన వ్యాయామం యివ్వాలనీ గుర్తించి, పితృస్వామ్య సంస్కృతి స్త్రీల జీవితాల చుట్టూ అల్లిన మాయాజాలమును బద్దలు కొట్టి స్త్రీవాద భావజాలం తెలుగు పౌర సమాజంలో విస్తరించడానికీ, వేరుచుకొనడానికీ చేసిన పోరాటం, ఆ క్రమంలో సాహిత్యంలో వివిధ కోణాలనుండి బహుముఖీనంగా… పూర్తిగా చదవండి »

- Next »