Author Archives: భూమిక

హెచ్ఐవి/ ఎయిడ్స్- మహిళలపై కుటుంబ హింస

గోరుచుట్టులా బాధపెడుతున్న కుటుంబహింసతో సతమతమవుతున్న మహిళలకు హెచ్ఐవి సోకడం నిజంగా రోకటిపోటే. సాధారణంగా మహిళలకున్న సమస్యలకు తోడు హెచ్ఐవి/ ఎయిడ్స్ వల్ల కుటుంబహింస మరింతగా పెరుగుతున్నది. ‘పెళ్ళి’కి ముందే హెచ్ఐవి వుందని తెలిసి కూడా అవతలి అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడే క్రూరులున్న సమాజంలో చాలామంది మహిళలు వారి భర్తల ద్వారా హెచ్ఐవి/ ఎయిడ్స్ బారిన పడుతున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

యువతరానికి అందుబాటులో పరిజ్ఞానం

సంస్కృతిపరంగా చూస్తే యువతరం ప్రపంచం మొత్తంమీద ప్రమాదస్థితిలో వున్నారు, అందులో భారతదేశ శాతం మరీ ఎక్కువ. ఎందువల్లనంటే భారతదేశంలో సెక్సు అనేది మాట్లాడకూడని విషయం, అదీకాక యువతరానికి సమాచారం అందుబాట్లో లేకపోవడం. వారి మనసుల్లో మెదిలే చాలా ప్రశ్నల్ని చర్చించే వేదిక లేకపోవడం, వారు తమ నిత్యజీవితాల్లో ఎదుర్కొనే సంకోచాలు, అపోహలు, వారి తల్లితండ్రులతో కాని, … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రజలకు ఎపిఎస్ఎసిఎస్ ‘ధైర్యం’

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందరికీ ఆదర్శమయ్యే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో అక్టోబర్ 31 వ తేదీన నిర్వహించిన హెచ్ఐవీ పరీక్ష శిబిరంలో వాళ్ళు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ‘ బి బోల్డ్’ … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పేరుపాలెం బీచ్ టు పేరంటపల్లి సాహితీ యాత్ర

‘పరవశంలో ముంచిన పాపికొండల యాత్ర’ పేరుతో నేను రాసిన వ్యాసానికి వచ్చిన ప్రతిస్పందన ఫలితమే రెండోయాత్ర. నేననుభవించిన అద్భుత ఆనందాన్ని, ఉల్లాసాన్ని నా మిత్ర రచయిత్రులందరికీ పంచాలనే తపనే నన్నీ సాహసం చేయించింది. లేకపోతే ‘భూమిక’లాంటి బుల్లి సంస్థ ముప్ఫై మందితో మూడురోజుల పర్యటనను ఆర్గనైజ్ చెయ్యగలగడం సాధ్యమయ్యేది కాదు.

Share
Posted in సంపాదకీయం | 1 Comment