-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసాలు
సమకాలీన సాహిత్యంలో విశిష్ట కవయిత్రి షాజహానా -డా.కోయి కోటేశ్వరరావు
తెలుగు కవులు వెంకమ్మలను, బుచ్చమ్మలను పట్టుకొని ఎంతకాలం వేళాడతారని, దేశ సౌభాగ్యమునకు మూలకారణమైన కాపు స్త్రీల కష్టములను ఎప్పుడు గ్రహిస్తారని సురవరం ప్రతాపరెడ్డి ఆరోపించాడు. ప్రాబల్య వర్గాల, మధ్యతరగతికి చెందిన స్త్రీల చుట్టూ స్త్రీవాద సాహిత్యం ప్రదక్షిణలు చేస్తోందని దళిత కవయిత్రులు ప్రశ్నించారు.
Posted in వ్యాసాలు
Leave a comment
ఆధిపత్య భావజాల స్థావరాలను బద్దలు కొట్టాల్సిందే – అశోక్ కుంబము
కవి అన్నట్లు ఆయనేమీ బాంబులు పంచలేదు. శత్రువు మీదికి గురిచూసి తుపాకి పేల్చలేదు. అతను చేసిందల్లా ఆధిపత్య భావజాలాన్ని ధ్వంసం చేసే కొత్త రాజకీయ, సాంస్కృతిక భావాలను, విలువలను నిర్మాణం చేశాడు. మార్క్సిజం వెలుగులో చరిత్రకు కొత్త భాష్యం చెప్పాడు. అంతటితో ఆగక ఆ చరిత్ర నిర్మాణంలో
Posted in వ్యాసాలు
Leave a comment
గ్రామీణ భారతదేశంలోని క్వీర్ ప్రజల రోజువారీ జీవితాలు – PARI లైబ్రరీ
ప్రైడ్ నెలలో, ూARI లైబ్రరీ పెద్ద మెట్రోలకు, నగరాలకు దూరంగా నివసిస్తోన్న క్వీర్ కమ్యూనిటీ వారి జీవితాలను, డేటాను వెలుగులోకి తెస్తోంది, వారి గొంతులను వినిపిస్తోంది. వారి వ్యక్తిగత, వృత్తిగత జీవితాలలో ఎదుర్కొంటోన్న సామాజిక బహిష్కరణను గురించి తెలియజేస్తోంది.
Posted in వ్యాసాలు
Leave a comment
జాతి వైతాళికుడు గద్దర్ – డా॥ కత్తి పద్మారావు
జనం గుండెల నుంచి ప్రభవించిన సజీవ వాగ్గేయకారుడు గద్దర్. కవిత్వాన్ని పాటలో రంగరించి తత్వాన్ని బోధించిన మానవతా మూర్తి. గద్దర్ పాటల్లో కరుణరసం ప్రవహిస్తుంది. తల్లి హృదయం ధ్వనిస్తుంది. ఆయన పాటల్లో పల్లె జీవన సంస్కృతీ వికాసం ఉంది. ఆయన మాట పాటల్లో అట్టడుగు ప్రజల జీవన వేదం ఉంది.
Posted in వ్యాసాలు
Leave a comment
అంబేద్కర్ ` హిందూకోడ్ బిల్లు – డా. బి.విజయభారతి
రాజ్యాంగ రచనా కార్యక్రమంలో అఖండ విజయం సాధించిన అంబేద్కర్ మరో విప్లవాత్మకమైన ప్రణాళికను చేపట్టారు. ఇది మరో సమరం. హిందూ న్యాయశాస్త్రానికి సవరణలు చేసి, దానిని సమకాలీన సమాజానికి అనుగుణంగా రూపొందించడానికి పదేళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Posted in వ్యాసాలు
Leave a comment
ఉన్నత విద్యలో తెలంగాణ మహిళల అధిక నమోదు దేశానికే ఆదర్శం – డాక్టర్ కందగట్ల శ్రవణ్ కుమార్
ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులు, వారి జీవన విధానం, మహిళా హక్కులు, అమలవుతున్న చట్టాల మీద అవగాహనతో కూడిన అర్థవంతమైన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. మహిళా సాధికారత అంటే ఆధునిక సమాజంలో మహిళలు పురుషులతో పాటు సమానంగా హోదాను, అవకాశాలను అనుభవిస్తూ నిర్ణయాత్మక స్థానంలో
Posted in వ్యాసాలు
Leave a comment
మణిపూర్ మంటలు మణిపూర్‌కే పరిమితం కాదు – మమత కొడిదెల
పవిత్ర భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఆదివాసీ మహిళల్నీ, దళిత మహిళల్నీ నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చెయ్యడం, ఆయా కుటుంబాల్లోని మగవాళ్ళనూ, పిల్లలనూ దారుణంగా హత్య చేయడం జరుగుతోంది. ఇలా జరిగిన ప్రతిసారీ దేశం నివ్వెరపోతోంది.
Posted in వ్యాసాలు
Leave a comment
తెలంగాణ దళిత స్త్రీ ఆవిష్కరణ ` రిజర్వేషన్ బోగీ కథలు – డా.ఎం.ఎం.వినోదిని
నేపథ్యం: జూపాక సుభద్ర ప్రచురించిన కొత్త కథల పుస్తకం ‘‘రిజర్వేషన్ బోగీ’’. దళితులు అనుభవిస్తున్న అంటరానితనం చుట్టూ ఉన్న అనేక సాంస్కృతిక, రాజకీయ, చారిత్రక అంశాలను గురించి సుభద్ర ఈ కథల్లో లోతైన ప్రశ్నలను లేవనెత్తింది. కవిత్వం రాసినా, కథ రాసినా, ఏదైనా వేదిక మీద మాట్లాడినా, చెప్పాల్సిన విషయాన్ని
Posted in వ్యాసాలు
Leave a comment
బెల్ హుక్స్ ఫెమినిజం అందరిదీ: ఉత్తేజపూరిత రాజకీయాలు – రేస్, జెండర్ – బెల్ హుక్స్
అనువాదం: ఎ.సునీత జాతి, జాత్యహంకార వాస్తవాన్ని, స్త్రీవాద ఆలోచనా పరులు గుర్తించాలనే డిమాండ్ అమెరికన్ స్త్రీవాద స్వరూపాన్ని సమూలంగా మార్చిన విషయాల్లో ప్రధానమైంది. మన దేశంలో తెల్ల జాతి ఆడవాళ్ళందరికీ తాము నల్ల జాతి స్త్రీలు, ఇతర రంగుల స్త్రీల కంటే భిన్నస్థాయిలో ఉంటామనే విషయం బాగానే తెలుసు. చిన్న పిల్లలుగా
Posted in వ్యాసాలు
Leave a comment
బెంగాల్ పులి నీడలో పీతల వేట – ఊర్వశీ సర్కార్
నదులలోని మత్స్యసంపద తగ్గిపోవడంతో, సుందరవనాలలోని మత్స్యకారులు నిరంతర పులుల భయంతోనే మడ అడవుల లోలోపలికి వెళ్ళవలసి వస్తోంది. ‘‘నా భయాన్ని ఏమని చెప్పేది? భీతితో నా గుండె దడదడలాడుతుంటుంది. ఎప్పుడెప్పుడు తిరిగి వెల్లడి ప్రదేశానికి వెళ్ళగలనా అనేదానిమీదే నా ఆలోచనలన్నీ
Posted in వ్యాసాలు
Leave a comment
స్వాతంత్య్రానంతర కాలంలో తెలుగు స్త్రీల పత్రికలు: అబ్బూరి ఛాయాదేవి ‘వనిత’ (ఏప్రిల్`డిసెంబర్ 1956)-డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
బ్రిటిష్ వలస పాలనాకాలంలో రూపుదిద్దుకున్న మహిళోద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ భారతీయ భాషల్లో స్త్రీల పత్రికలు వెలువడ్డాయి. దిగజారిపోయివున్న తమ పరిస్థితుల్ని మెరుగుపరచుకోవడానికీ, హక్కుల సాధనకూ
Posted in వ్యాసాలు
Leave a comment
ఆకలిని అక్షరాలతో అలంకరించిన జాషువా – రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
గుర్రం జాషువా మరణించి 50 ఏళ్ళు పూర్తయింది. అంతకు ముందు ఒక యాభై ఏళ్ళ నుంచి ఆయన కవిత్వం రాశాడు. ఈ వందేళ్ళలో మన దేశంలో చాలా మార్పులొచ్చాయి. పేదరిక నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు పాలకులు. ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినా ఇంకా పాత బతుకులు కొనసాగుతూనే ఉన్నాయి.
Posted in వ్యాసాలు
Leave a comment
ఈ బుల్డోజింగ్ ధోరణి తగ్గాలి! – డా॥ నాగసూరి వేణుగోపాల్
‘‘వామపక్ష సిద్ధాంతాన్ని నార్ల వెంకటేశ్వరరావు విబేధించి ఉండవచ్చుÑ కానీ, మౌఢ్యాన్ని వ్యతిరేకించడానికి, ఖండిరచడానికి అద్భుతమైన ఆయుధాలు ఇచ్చారనే విషయం పట్టించుకోకపోతే ఎలా?’’ అని ఓ పదేళ్ళ క్రితం ఒక మిత్రుడైన రచయిత ముఖాముఖి మాట్లాడుతూ అన్నారు! మూడేళ్ళ క్రితం కాకినాడ వెళ్ళినపుడు ఒక ప్రముఖ
Posted in వ్యాసాలు
Leave a comment
అమృత ఉద్యమానికి ముందూ వెనుకా… – నంబూరి పరిపూర్ణ
శతాబ్దంన్నరకు పైగా బ్రిటిషు పాలకుల వలసదేశమై బానిసత్వంలో మగ్గిన మన భారతదేశం, ఆగస్టు 15, 1947న స్వేచ్ఛనందుకొని స్వతంత్ర దేశమయింది.
Posted in వ్యాసాలు
Leave a comment
మారుమూల తమిళనాడులో, మానసిక ఆరోగ్య సంరక్షణకు కాపలాకాస్తున్న మహిళలు – ఎస్.సెందళిర్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
– అనువాదం: వై. క్రిష్ణజ్యోతి మానసిక వ్యాధిగ్రస్తులకు సహాయం చేసేందుకు, 30 ఏళ్ళుగా కాంచీపురం జిల్లాలోని గ్రామాల్లో పర్యటించారు శాంతి శేష. కానీ ఆమెలాంటి గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు వ్యక్తిగత ఇబ్బందులతో పాటు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
రైతు బతుకు వెతలపై సాధికారిక కథలు – గొల్లపల్లి వనజ
రాయలసీమ అగ్రశ్రేణి కథా రచయితల్లో ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ఒకరు. ఈయన రాయలసీమ, ముఖ్యంగా కడప ప్రాంత ప్రజలు కరువు వలన పడే కష్టాలను, వారి బాధలను, ఆవేదనలను తన కథల్లో చిత్రించాడు. సీమలో ప్రజలకు ప్రకృతి నుంచి వచ్చిన కష్టాలు కొన్నయితే, బలమైనవాడు బలహీనత కలిగిన వాడిని పెట్టే కష్టాలు
Posted in వ్యాసాలు
Leave a comment
