ఏప్రిల్, 2007 సంచిక

“ఫ్రెష్‌” మార్కెట్ల వెనక క్రష్‌ అవుతున్న మహిళల జీవనోపాధి

భూమిక ఏప్రిల్ 2007

పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది. ఫుడ్‌ బజార్లు ప్రవేశించి ఎన్నో సూపర్‌బజార్లను మింగేసాయి. జెయింట్‌లు, బిగ్‌ బజార్లు వచ్చి ఫుడ్‌ బజార్లను దెబ్బతీసాయి. ఇపుడు తాజా కూరగాయలు, తాజా పండ్లు అందిస్తాం అంటూ తాజాగా మార్కెట్‌లో ప్రవేశించిన “ఫ్రెష్‌” సూపర్‌ మార్కెట్లు, నగరంలో ఎక్కడెక్కడ కూరగాయలు అమ్మే స్థలాలున్నాయో, అక్కడే తమ దుకాణం తెరిచి దశాబ్దాలుగా కూరగాయలు, పండ్లు, పువ్వులు అమ్ముకుని బతికే వాళ్ళ పొట్టల మీద చావుదెబ్బ కొడుతోంది. ఈ ఫ్రెష్‌ దుకాణాల్లో ఎ.సిలు పెట్టి, తూచుడు మెషీన్లు పెట్టి తక్కువ ధరలకే కూరలు, పండ్లు అనే ప్రకటనలు గుపించడంతో మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల వారు ఈ దుకాణాల వేపు మళ్ళి పోతున్నారు. ఎంతో ఆర్భాటంగా పెట్టిన రైతు బజార్లు ఎందుకూ కొరగానివిగా తయారవ్వబోతున్నాయి. పూర్తిగా చదవండి »

ప్రతిస్పందన

భూమిక ఏప్రిల్ 2007

దీర్ఘకాలంగా జైళ్ళల్లో మగ్గుతున్న జీవిత ఖైదీల విడుదలకు గత కొన్ని నెలలుగా ఆశలు కల్పించిన ప్రభుత్వం ఎట్టకేలకు 2007 జనవరి 26న జి. ఒ. నెం. 314, 315లను జారి చేసి తిరిగి వాటిని జి.ఒను నిలుపుదల చేయడం వలన ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు, మానసిక క్షోభకు గురవుతున్నారు. మా ఈ ఆవేదనను మానవతా దృక్పథంతో తిలకించి ఖైదీల విడుదలకు సహకరించవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రచయితలు, మేధావులు, దయార్ద్ర హృదయుల్ని ప్రార్థిస్తున్నాము. మాపై కరుణ చూపి జైళ్ళలో మగ్గుతున్న మమ్నల్ని విడుదల చేయించి, మా కుటుంబాలలో వెలుగులు నింపవలసిందిగా తమరిని ప్రార్ధిస్తున్నాము.

- ‘జీవిత ఖైదీలు’ కేంద్ర కారాగారం, కడప

పూర్తిగా చదవండి »

పునరుజ్జీవనం

భూమిక ఏప్రిల్ 2007

- చల్లపల్లి స్వరూపరాణి

సునీత బియస్సీ, బియ్యీడీ చేసి హైదరాబాదులోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్‌ స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తోంది. కర్నూలు దగ్గర కోడుమూరు తన స్వగ్రామం. హైదరాబాదు నుంచి యింటికెళ్ళాలన్నా, యింటినుంచి హైదరాబాదు వెళ్ళాలన్నా మధ్యలో కర్నూల్‌లో దిగి తన ఫ్రెండ్స్‌ అరుణ, విమలలను కల్సి ఒకటీ రెండు రోజులుండి మళ్ళీ గమ్యస్థానానికి చేరడం సునీతకి అలవాటు. స్కూలుకి సంక్రాంతి సెలవులు యివ్వగానే సిటీలో తన చెల్లెళ్ళు, తమ్ముళ్ళకి బట్టలు తీసుకుని చిన్నపాటి షాపింగు ముగించుకొని వుదయం పదిగంటలకంతా హైదరాబాదు ఇమ్లీబన్‌ బస్‌స్టేషన్‌లో కర్నూలు బస్‌ ఎక్కింది. పూర్తిగా చదవండి »

సంస్కృతి, సృజనల మేళవింపు హేమలతాలవణం

భూమిక ఏప్రిల్ 2007

- శిఖామణి

హేమలతాలవణం. తెలుగు వారికి చిరపరిచితమైన పేరు. అటు సాహిత్య ప్రియులకు మహాకవి పద్మభూషణ్‌ గుర్రం జాషువా కుమార్తెగా తెలుసు. ఇటు సామాజికులకు సంఘ సంస్కర్త గోరాగారి కోడలిగా, సర్వోదయనాయకులు లవణంగారి అర్ధాంగిగా తెలుసు. సంస్కరణ, సాహితీ రంగాలలో తనదైన వ్యక్తిత్వంతో, సొంత ముద్రతో నిలిచిన హేమలతాలవణం సామాజికరంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ తో సత్కరించడం అభినందనీయం. ఇది తెలుగు నాట సంస్కరణరంగంలో పని చేస్తున్న ఎందరికో స్ఫూర్తిదాయకమైన సంఘటన.
పూర్తిగా చదవండి »

చిలుక జోస్యం

భూమిక ఏప్రిల్ 2007

- ఎల్‌. మల్లిక్‌

(అది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని అసెంబ్లీ భవన సముదాయ పరిసర ప్రాంతం. అక్కడ ఒక చోట ఇద్దరు చిలుక జోస్యం వాళ్ళు, తమ చిలుకల పంజరాలను పక్కపక్కన పెట్టి, ఆ ప్రక్కనే ఉన్న టీ బడ్డీ వద్ద టీ తాగుతున్నారు. అప్పుడు ఆ చిలుకలు రెండూ ఒకదానితో ఒకటి సంభాషించడం మొదలుపెట్టాయి.)

పెంటి చిలుక: ఏమి మామా! బాగున్నావా? మళ్ళీ ఎన్నాళ్ళకు నిన్ను చూడగలిగాను! అసలు నిన్ను చూస్తాననే అనుకోలేదు. ఇటు ఎలా వచ్చావు?

పోతు చిలుక: ఏమి బాగులే! ఎంతైనా పంజరం బ్రతుకులే కదా!
పూర్తిగా చదవండి »

నేను మనుషుల్ని ప్రేమిస్తాను

భూమిక ఏప్రిల్ 2007

- రోష్ని

పూలన్నింటినీ నేను ప్రేమిస్తాను
రంగు, వాసన, ముళ్ళు- ఇవేవీ నా ప్రేమకు అడ్డురావు
నేను ప్రేమిస్తాను నాకు తెలిసిన మనుషుల్ని
పూర్తిగా చదవండి »

నానీలు

భూమిక ఏప్రిల్ 2007

- కందేపి రాణీప్రసాద్‌

కుటుంబానికి
కేందబ్రిందువు
పేరు హౌస్‌ వైఫ్‌
గుర్తింపు లేని జాబ్‌
పూర్తిగా చదవండి »

అద్దం

భూమిక ఏప్రిల్ 2007

- సుజాతా చౌదరి

ఎవరన్నారు
సీతకి
అద్దం చాలా అవసరమని?
అద్దం లేకుండా
ఆమె బతకలేదని?
పూర్తిగా చదవండి »

దృశ్యా దృశ్యం

భూమిక ఏప్రిల్ 2007

- తమ్మెర రాధిక

సంకురుమయ్య దేనిమీదొచ్చాడు?
ఎంతో క్యాజువల్‌ పశ్న్ర
జవాబూ అంతే.. అలవోక..
ఇప్పుడో?
పూర్తిగా చదవండి »

ఎలా

భూమిక ఏప్రిల్ 2007

- సత్యభాస్కర్‌

మనలో ఒకరిని
వెలివేసి వెలయాలంటే ఎలా!?
పుట్టుకతో
అందరం శరీరాలమే!
సంఘం సృష్టించిన
చకబ్రంధంలో చిక్కి
శల్యమవుతోన్న శవాలమే!
పూర్తిగా చదవండి »

దీప భ్రమర న్యాయం

భూమిక ఏప్రిల్ 2007

- డి. కామేశ్వరి

పూలనించి రంగులడిగి, మనసనే కలం ముంచి రాస్తున్నాననను
నీ జ్ఞాపకాలలో నిద్రించాను, నీ కలలతో మేల్కొన్నానని పేమ్రలేఖలు రాయను
నిన్ను నా పేమ్ర సామాజ్య్రానికి రాణిని చేస్తానని, నీ కోసం తాజ్‌ మహల్‌ కట్టిస్తాననను
నీవంటే నాకిష్టం అది నీవు నమ్మితే నా దానివికా అంటాను
పూర్తిగా చదవండి »

చిక్కటి అడవిలో రెక్కవిప్పుతున్న చైతన్యం

కొండవీటి సత్యవతి ఏప్రిల్ 2007

- కె. సత్యవతి

లయోలా ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ చింతూరు మండలం కాటుక పల్లి వారి తరఫున వారు జరుపబోయే అంతర్జాతీయ మహిళాదినం సమావేశంలో పాల్గొన వలసిందిగా ఆహ్వానించ డానికి మోహన చంద్రగారు నా దగ్గరికి వచ్చినపుడు నేను కొంత తటపటాయించాను. అయితే ఈ సమావేశం దట్టమైన అడవిలో రెండు వేలమంది పైగా గిరిజన స్త్రీలతో జరుగుతుందని ఆయన చెప్పగానే నేను వెంటనే ఒప్పేసుకున్నాను. నాతో పాటు డాక్టర్‌ సమత రోష్ని, పంతం సుజాత, భూమికలో పనిచేసే లక్ష్మి కూడా బయలు దేరారు.
పూర్తిగా చదవండి »

ఆంధ్రప్రదేశ్‌ హెచ్‌ఐవి/ఎయిడ్స్‌

భూమిక ఏప్రిల్ 2007

అల్లిగూడెం నుండి వచ్చిన రాములమ్మ రెండో తరగతి చదివి మానేసి వ్యవసాయం చేసేది. తల్లిదండ్రులు చదివించడానికి అంగీకరించ లేదు. లిడ్స్‌లో చేరి చదువు కొనసాగిస్తోంది. ఆటలంటే ఇష్టమని చెప్పింది. నేషనల్‌ కబాడీ పోటీలకు చత్తీస్‌గడ్‌ వెళ్ళింది.జాతీయ స్థాయిలో ఆడింది రాములమ్మ.
పూర్తిగా చదవండి »

పదునెక్కిన పద శక్తి

భూమిక ఏప్రిల్ 2007

(దక్షిణాసియా దేశాల రచయిత్రుల సదస్సు)
ఓల్గా విమెన్స్‌ వరల్డ్‌ (ఇండియా)
మూడు రోజులు. ఐదు దేశాలు. అనేకానేక ఆలోచనలు అనుభవాలు, అనుభూతులు.

ఢిల్లీలో ఫిబ్రవరి 21-23 వరకు దక్షిణాసియా దేశాల రచయిత్రులు తమ జీవితానుభవాలను, వాటిలో నుంచి పుట్టిన సాహిత్య స్రవంతులను కలబోసుకున్నారు. భిన్న నేపధ్యాలలో, సంక్లిష్ట సందర్భాలలో రచనను ఒక రాజకీయ చర్యగా భావించి, ఎన్ని ఆటంకాలనో అధిగమించి, ఎన్ని నిర్భంధాలనో భరించి, ఎన్ని నిష్టూరాలనో సహించి రచనను కొనసాగిస్తున్న కలం యోధులు కొందరు. జైళ్ళు, దేశ బహిష్కారాలు, బెదిరింపులవంటి బహిరంగ నిషేధాలను ఎదుర్కునేవారు కొందరైతే, కుటుంబం, సమాజం, ప్రచురణరంగాలు సాహిత్య పీఠాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా విధించే నిషేధాలకు గురవుతున్నవారు మరి కొందరు.
పూర్తిగా చదవండి »

దీర్ఘాయువు గుట్టు చెప్పిన అక్క

భూమిక ఏప్రిల్ 2007

- రాజేశ్వరి దివాకర్ల

వచనాలను పలికిన స్త్రీ శరణులలో అక్క మహాదేవి అగ్రగణ్యురాలు. ఆమె ఆలోచనాత్మకాలైన అనేక వచనాలను పలికింది. ఆమె జీవితంలో ఎన్నో మహత్తరమైన సంఘటనలు జరిగాయి. ఆమె అపారమైన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. అక్కమహా దేవి చెన్న మల్లికార్జునుడిని వలచింది. అనంత ప్రకృతిలో అంతటా అతనిని చూచింది. అతనిని చేరుకోవాలని సకల భోగభాగ్యాలనూ, భర్తనూ వదిలి ఇల్లు విడిచి ఒంటరిగా బయలుదేరింది.
పూర్తిగా చదవండి »

నరాల్లో సుడి తిరగిన వ్యధకి అక్షర రూపం

భూమిక ఏప్రిల్ 2007

- పంతం సుజాత

ప్రతి రోజూ వెన్నెల్ని చూసి చూసి అమావాస్య వస్తే మనసు భారమవడం ఖాయం. అలాగే ఒకేసారి ఇన్ని మంచి కథలు చదివి చదివీ పుస్తకం మూసాక ఆలోచన చెమ్మగిల్లుతుంది. గొరుసు జగదీశ్వర రెడ్డి కథలు ‘గజ ఈతరాలు’ చదివితే ప్రతి పాఠకుడికీ అదే భావన కలుగుతుంది.

మూడు ప్రాంతాల భాషల మీద మంచి పట్టు ఉందని నిరూపించుకున్న రచయిత. ఓ పక్క తెలంగాణా భాష, మరో పక్క శ్రీకాకుళం యాస, కథకుడి మనసులో గోదావరి ఘోష.
పూర్తిగా చదవండి »

- Next »