Monthly Archives: December 2012

రయికముడి ఎరగని బతుకు

స.వెం.రమేశ్‌ ‘చుక్క పొడిచేసింది లెయ్యండమ్మో’ అంటూ గొంతు చించుకొనింది పుంజుకోడి. ఆ అరుపువిని ఉలిక్కిపడి లేచినాను నేను. నామీద వెచ్చంగా పండుకొని ఉండిన ఎర్రకుక్క లేచి, ఒక్క నీలుగు నీలిగి, చెవులు టపటప తాటించుకొంటూ అవతలకు పోయింది. సర్రుసర్రుమనే సద్దుతో పొరక ఒకటి నా పక్కనుంచే పోయింది.

Share
Posted in కథలు | 2 Comments

Share
Posted in Uncategorized | Leave a comment

పదహారు రోజులు కాదు… మూడొందల అరవై ఐదు రోజుల ఉద్యమం కావాలిప్పుడు

నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్‌ అగెన్‌స్ట్‌ విమెన్స్‌ డే’ అంటూ మొదలుపెట్టి అంతర్జాతీయ మానవహక్కుల దినం డిసెంబరు 10తో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

చిల్లర వర్తకంలో చొరబడ్డ ‘బడా’ దొంగలు

ఎన్‌. హేమలలిత తెలతెలవారుతుండగానే చిన్నప్పుడు అమ్మ మేలుకొలువు తర్వాత వినిపించే కేక మా రాములమ్మది. నలుపు తెలుపుల కలయిక జుట్టుని ముడివేసి, అలిసి సొలసిన శరీరానికి చీరలాంటి ఓ పొడవాటి గుడ్డముక్కను చుట్టేసి, కొంగుచాటున దాచేసిన దు:ఖాన్ని ఎవరికి కంటపడనీయక సంసారభారాన్ని గంపనెత్తుకొని ప్రతి ఇంటికివెళ్ళి తాజా కూరగాయాలు అమ్మేది. కూరలు డబ్బులకు అమ్మితే కరివేపాకు, … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

అప్పటి మధురవాణి – ఇప్పటి నళినీ జమీలా

డా|| వాడ్రేవు వీరలక్ష్మీదేవి గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకంలోని మరపురాని పాత్ర మధురవాణి. ఆమె పందొమ్మిదో శతాబ్దపు వేశ్య. నళినీ జమీలా సజీవ వ్యక్తి. ఈమె ఇరవయ్యొకటవ శతాబ్దపు వేశ్య. వేశ్య అనే పేరు చుట్టూ వున్న భావజాలాన్ని తిరస్కరించి తాము చేస్తున్న పనిని ఒక ఉద్యోగంగా భావించే సెక్స్‌వర్కర్‌.

Share
Posted in వ్యాసం | Leave a comment

అమ్మతనం ముక్కలవుతున్నది

బి.కళాగోపాల్‌ దేహంపై లేచిన పుండ్లలా మాతృత్వం చుట్టూ అల్లుకొంటున్న విషవలయాలు!

Share
Posted in కవితలు | 1 Comment

నాగరికతకి మనం ఎంత దూరంలో వున్నాం…?

కొండేపూడి నిర్మల తుపాకి గుండు శరీరంలోకి దూసుకుపోయినప్పుడు అది వెంటనే తీసేస్తేనే ప్రాణం దక్కుతుంది. ప్రమాదవశాత్తూ కాలికో చేతికో దెబ్బతగిలి గాయం విషమిస్తే ఆ భాగాన్ని కోతపెట్టడమే వైద్యం అవుతుంది. గర్భంలోనే విచ్ఛిన్నమయిన పిండాన్ని సురక్షితంగా తొలగించి తల్లి ప్రాణాన్ని రక్షించడానికి ఒక దేశమూ, మతమూ, చట్టమూ, వైద్యము నిరాకరిస్తున్నాయంటే అక్కడ మహిళలకున్న మానవహక్కుల పరిస్థితి … Continue reading

Share
Posted in మృదంగం | 2 Comments

అరుణ కవితలలో తాత్త్వికత

ఓల్గా అరుణ కవితా మౌనం వదిలి మాట్లాడటం మొదలై ఎనిమిదేళ్ళయింది. ఈ ఎనిమిదేళ్ళలో ఐదు కవితా సంకలనాలు, ఒక నానీల సంపుటి వచ్చాయి. మౌనం మాటల్లో పలికించగల నేర్పు పట్టుబడిన తర్వాత మాట్లాడటం మొదలుపెట్టింది అరుణ.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అసంఖ్యాక పాఠక ‘జనవారథి’

మల్లీశ్వరి కొండపల్లి కోటేశ్వరమ్మగారిని 2010 జనవరి 17 తేదీన మొదటిసారి కలిసాను. చాసో స్ఫూర్తి పురస్కార సభకి మేమిద్దరం కలిసి విజయనగరం వెళ్ళాం. ప్రయాణంలో ‘అమ్మమ్మా! నీ గురించి ఏవయినా చెప్పవూ? మాకు స్ఫూర్తిదాయంగా ఉంటుంది కదా!” అని అడగ్గానే, నిష్కపటంగా ఏమాత్రం రాగద్వేషాలు లేని స్వరంతో తన జీవితాన్ని తడుముకున్నారు. పలవరించారు.

Share
Posted in లోగిలి | Leave a comment

గురజాడ వారి బుచ్చమ్మ

అయ్యగారి సీతారత్నం కన్యాశుల్కంలోని బుచ్చమ్మ అనకుండా గురజాడ వారి బుచ్చమ్మ గురించి మాట్లాడమన్నారు, రాజాం సభలో రామినాయుడు గారు. బహుశా కన్యాశుల్కం అంటే ‘కన్యాశుల్కం’ సినిమాలోని బుచ్చమ్మ అనుకొంటారేమోనని అయివుంటుంది. నిజానికి గురజాడ భావజాల స్థాయిని ఏమాత్రం అందుకోలేకపోయింది తెలుగు సినిమా.

Share
Posted in వ్యాసం | Leave a comment

‘ఐయామ్‌ మలాలా’

పసుపులేటి గీత ‘రేపు మగపిల్లల బళ్ళన్నీ తెరవబోతున్నారు. కానీ తాలిబన్లు ఆడపిల్లల చదువును మాత్రం నిషేధించారు. బీరువాలో నా యూనిఫారమ్‌, పుస్తకాల సంచీ, జామెట్రీ బాక్స్‌ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది…’ – మలాలా యూసఫ్‌ జే

Share
Posted in కిటికీ | Leave a comment

నరంలేని నాలికలకు వాతలు బెట్టాల్సిందే

జూపాక సుభద్ర పత్రికలు, చానల్లు ఎవరి ప్రయోజనాలకు తగ్గట్టు వాల్లు లొల్లిలొల్లిగున్నయి. ఆ లొల్లిలో బక్రాలవుతున్నది బలైతున్నది దళిత సమూహాలు. బాపనోల్లను కించపరుస్తూ ఏదో సినిమా వచ్చిందనంటే బాపనోల్లకంటే ముందుగా ధర్నాలుచేసి, కలెక్టర్లకు మెమోరాండాలిచ్చి బ్రాహ్మణభక్తిని చాటుకున్నయి దళితసంగాలు.

Share
Posted in వ్యాసం | 1 Comment

గురజాడ సాహిత్య స్త్రీ ప్రస్థానం-జాతీయ సదస్సు

డా. సూరి సువర్ణలక్ష్మి ”దేశమని మెడుదొడ్డ వృక్షము ప్రేమలనియడి పూలెత్తలెనోయ్‌” అని విశ్వజనీనతని వికసింపచేసిన గురజాడ అప్పారావుగారి నూట యాభయ్యవ జయంతి ఉత్సవాల సందర్భంగా మిసెస్‌ ఏ.వి.యన్‌. కళాశాల, తెలుగు శాఖ, ఉమెన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌, విశాఖపట్నం సంయుక్తంగా నిర్వహించిన ”గురజాడ సాహిత్య స్త్రీ ప్రస్థానం” జాతీయ సదస్సు నవంబరు 9 వ తేదీన విశాఖపట్నంలోని … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

బచావో! బచావో!

డా. నళిని ”బచావో! బచావో! మేరీ బేటీకో బచావో!” ఏడెనిమిదేళ్ళ పాపని అడ్డంగా చేతలమీద వేసుకుని ఏడుస్తూ పరిగెత్తుకుని వచ్చింది ఓ స్త్రీ.

Share
Posted in కధానికలు | Leave a comment

నెల్లుట్ల రమాదేవి కథల్లో స్త్రీలు

టి. అన్నపూర్ణ తెలుగు కథానికను సంపద్వంతం చేసినవాళ్ళలో స్త్రీల భాగస్వామ్యం తక్కువేమి కాదు. స్త్రీలు కథలు రాయకుండా ఉండే మానవజీవితంలోని అనేక అనేక పార్శ్వాలు, చీకటికోణాలు సమాజానికి తెలిసేవికావు. మానవసంబంధాలు వ్యక్తి సున్నితస్పందనలు, మనస్తత్వాలు స్త్రీల కథల్లో విశిష్టంగా కన్పిస్తాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

వన్‌ బిలియన్‌ రైసింగ్‌

వన్‌ బిలియన్‌ రైసింగ్‌ – స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం అనేది స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా చేపట్టిన ఒక ప్రపంచ వ్యాప్త ఉద్యమం. ప్రముఖ రంగస్థలనటి రచయిత్రి మరియు సామాజిక కార్యకర్త ‘ఈవ్‌ ఎన్‌స్లర్‌’ 1985 ఫిబ్రవరి 14 నాడు న్యూయార్క్‌ నగరంలో వి.డే అనే సంస్థను స్థాపించి స్త్రీలపై హింసకు … Continue reading

Share
Posted in కరపత్రం | Leave a comment