-
Recent Posts
- “హం హైదరాబాదీ” జిలాని బానో – కె.సజయ, కె. సత్యవతి, ఎ. రజిత.
- ప్రముఖ స్త్రీవాది వసంత కన్నాబిరన్‌తో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి
- తన కష్టాలన్నింటినీ ఒక వెదురు బుట్టలో పెట్టి – కిరణ్ అడమాచే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
- సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ – అంబేడ్కర్ విశ్లేషణ – అనూరాధ. బి
- తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం – నామని సుజనాదేవి
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Monthly Archives: August 2025
నా లోపల రగులుతున్న కోపం నా మీదే – కొండవీటి సత్యవతి
ఆ రోజు పాడె మీద స్వేచ్ఛ ముఖాన్ని చివరిసారిగా చూసినప్పటి నుండి నా ప్రవర్తనలో నాకు అర్ధం కాని కొన్ని మార్పుల్ని గమనిస్తున్నాను. ఎప్పుడూ రిలాక్సెడ్‌గా, సంతోషంగా ఉండే నేను కోపంగా, అసహనంగా తయారయ్యాను. నాతో పని చేస్తున్న వాళ్ళ పట్ల కూడా కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నాను. కోపంగా ఉంటున్నాను.
Posted in సంపాదకీయం
Leave a comment
దుఃఖంలో తడిసిన అక్షరాలు స్వేచ్ఛ కవిత్వం – ఎ.కె. ప్రభాకర్
‘నా వరకు కవిత్వం అంటే నేను జీవించే వున్నాను అనే ఒక ప్రకటన.. జీవితాన్ని కొనసాగించే ఒక ప్రక్రియ అనిపిస్తుంది. కవిత్వం అనేది అంతరాత్మ.. బయట వున్న మనిషికీ లోపల వున్న మనిషికీ సంఘర్షణే కవిత్వం..’
Posted in స్వేచ్చ స్మరణలో
Leave a comment
‘మట్టిపూల గాలి’లో స్వేచ్ఛ ఒంటరి దుఃఖగానం – కుమారస్వామి కోడం
కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ రచయిత పరిచయం ఉంటే వారి రచన అర్థం చేసుకోవడం మరింత సులభమవుతుంది. ‘మట్టిపూల గాలి’ కవితా సంపుటి 22 ఫిబ్రవరి 2018న సహచర బుక్ హౌస్ శంకరన్న ఈ పుస్తకాన్ని అందజేస్తు చదవి రాయండని చేతికిచ్చారు. ‘స్వేచ్ఛ’ కవిత్వం ద్వారా నాకు పరిచయంలోకి వచ్చింది.
Posted in స్వేచ్చ స్మరణలో
Leave a comment
స్వేచ్ఛ లేని లోకంలో స్వేచ్ఛ కోసం… – కృపాకర్ మాదిగ
స్వేచ్ఛ ఇప్పుడు నామ వాచకం కాదు, సర్వనామం. స్వేచ్ఛ మానవ సమూహ జీవనేచ్ఛ. స్వేచ్ఛ అంటే వ్యక్తీ, సమూహం ఇచ్ఛాపూర్వక జీవనం సమాజానికి హానికరం కాని పద్ధతుల్లో వ్యక్తి తనకి ఇష్టం వచ్చినట్టు తాను బ్రతకడమే స్వేచ్ఛ, వ్యక్తిగత జీవన సమగ్రత, గోప్యతా హక్కు సమాజం చేత గౌరవించబడి, కాపాడబడడమే స్వేచ్ఛ. సాటి మనిషి పట్ల … Continue reading
Posted in స్వేచ్చ స్మరణలో
Leave a comment
స్వేచ్ఛ యాదిలో… – భండారు విజయ
స్వేచ్ఛ రెక్కలున్న పక్షి లాంటిది. చెంగు చెంగున చలాకీగా తిరగాడే లేడిపిల్ల లాంటిది. అమాయకంగా కనిపించే ముఖ వర్చస్సులో నవ్వుతూ పలుకరించే కళ్ళు ఆమె అందానికి మరింత ఆకర్షణీయతనిస్తాయి. అందరినీ ఎంతో ఆప్యాయంతో కూడిన ప్రేమతో పలకరించే ఆమె స్వభావం ఎందరికో ప్రీతిపాత్రం. స్వేచ్ఛ చిన్నప్పటి నుంచి నా కళ్ళముందే పెరిగి పెద్దదైంది.
Posted in స్వేచ్చ స్మరణలో
Leave a comment
ఒంటరి మేఘం కన్నీటి గానం – మందరపు హైమవతి
దుఃఖం దుఃఖం. . ఎడతెరిపిలేని దుఃఖం. ఈ విశాల విశ్వంలో గాలి కూడా తోడులేని భయంకరమైన ఒంటరితనం. మనసు లోలోపలి పొరలను కరిగించే గాఢ ప్రేమ. వీటన్నిటి కలయికే స్వేచ్ఛ కవిత్వం.
Posted in స్వేచ్చ స్మరణలో
Leave a comment
పురుటి వాసన వొదలని నవ్వు – జుగాష్ విలి
ప్రేమ యిచ్చిన ప్రేమ వచ్చును అని స్వేచ్ఛ అనుకున్నది. నిలకడైన జీవితాన్ని కోరుకున్నది. నిలకడైన జీవితం పెళ్ళి ద్వారా వస్తుందని భ్రమపడిరది. అవి సఫలం కాని వేళ ఒక ప్రేమ నుంచి మరో ప్రేమలోకి ప్రయాణించింది. ప్రేమా, మోహమూ సహజాతాలు.
Posted in స్వేచ్చ స్మరణలో
Leave a comment
జీవన ప్రవాహం – జి.లక్ష్మీనరసయ్య
ఇవ్వాళ రాస్తున్న కవిత్వం పట్ల సీనియర్ కవులకు, లబ్ద ప్రతిష్టులైన పాత కవులకు చాలా మందికి చిన్నచూపుంది. దీనికి కారణం నేటి కవుల కవిత్వాన్ని వారు చదవకుండా వుండటమన్నా అయ్యుండాలి, లేక వారికి అలవాటైన పద్ధతిలో నిర్మితమైనదే కవిత్వం అనే దురభిప్రాయం అయినా అయ్యుండాలి.
Posted in Uncategorized
Leave a comment
అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి
అనువాదం : ప్రభాకర్ మందార 1960ల మధ్య తారకం తన తండ్రి చాటు నుంచి బయటపడ్డారు. తన భార్య విజయభారతి లెక్చరర్‌గా పనిచేసే నిజామాబాద్‌లో న్యాయవాదిగా పేద ప్రజల కేసులను వాదించడం, దళితులపై, గ్రామీణ పేదలపై అత్యాచారాలు జరిగినప్పుడు నిజనిర్ధారణ కమిటీలు నిర్వహించడం వంటి పనులను మొదలుపెట్టారు.
Posted in జీవితానుభవాలు
Leave a comment
పంచాయితీ! – దినవహి సత్యవతి
ఉత్తరాంధ్ర శివార్లలోని, ఒక గ్రామం అచ్చాపురం. ఆ గ్రామంలోని, పంచాయితీ ప్రధాన కార్యాలయం బయట పెద్ద రచ్చబండపై ఐదుగురిలో నలుగురు పంచాయితీ పెద్దలు అప్పటికే అసీనులై ఉన్నారు. అందరూ సర్పంచ్ కోసం ఎదురు చూస్తున్నారు.
Posted in కథలు
Leave a comment
సోషల్ మీడియాతో పయనం ఎటు??? – వై. నాగవేణి
పదిహేడేళ్ళ మానస పోలీస్‌స్టేషన్ బయట బండ మీద కూర్చొని ఉంది. మానస తల్లిదండ్రులు వెంకటేష్, రాజమ్మలిద్దరూ ఎస్‌ఐ గారి గదిలో బల్లమీద కూర్చొని ఉన్నారు. రాజమ్మ మొహం ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వెంకటేష్ మొహంలో నెత్తురు చుక్క కనబడడం లేదు. ఎస్‌ఐ గారికి ఎదురుగా సూపర్‌వైజర్ రాధ కూర్చొని ఉంది. ‘‘ఏంటి … Continue reading
Posted in కధానికలు
Leave a comment
