బరువెక్కిన మేఘం – జి.శ్యామల

శిన్న వయసుల బొమ్మరిల్లు గట్టి ఆడుతుండంగనే లగ్గం జేషిర్రు శిన్న శిన్న సంబురాలు గోల్పోతున్న అని తెలిసి కూడా మౌనంగా బుగులు మోషిన…
ఆటలాడే వయసులనే బిడ్డలను మోషిన… తాగిన మొగుడు కొట్టిన బాధలు మోషిన… కాపాడుకుంటా అనే మాట మర్షిపోయి నమ్మకాన్ని మట్టు వెట్టిన నరకం మోషిన… Continue reading

Share
Posted in కధానికలు | Leave a comment

ఐక్యతా రాగం అనుభవం -జి. సాయి రాజ్‌

ఐక్యతా రాగం మీటింగ్‌లో చర్చించిన అన్ని అంశాలను మీతో తప్పకుండా షేర్‌ చేసుకోవాలని మీటింగ్‌లో జరిగిన విషయాల్ని నోట్‌ చేసుకున్నాను. టైం 10:10 కి మీటింగ్‌ స్టార్ట్‌ చేసుకొని మళ్ళీ ఒక్కసారి అందరం పరిచయం చేసుకున్నాము. ఐక్యతా రాగం ఫేజ్‌ 1, 2 లో Continue reading

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

ఇదంతా సుబ్బమ్మ లేకపోతే జరగదు. సుబ్బమ్మకు ఓపిక తగ్గుతున్న సమయంలో ఆమెను ఆదుకోటానికి పద్మ వచ్చింది. కోడలైనా కూతురిలా చూసుకుంటుంది. ఆమె పిల్లలు లావణ్య, రవి ఎంతో నటాషా అంతకంటే ఎక్కువ. సూర్యం సంగతి చెప్పే పనిలేదు. శారద ఏం చెప్తే అది ఆజ్ఞ వాళ్ళకు. ఇంటి పనులు, పార్టీ పనులూ అన్నీ బాధ్యతగా చేస్తుంటారు. శారదకు Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్‌’- కస్తూరి మురళీకృష్ణ

పైగా పాటలు పాడే నటీనటులు శిక్షణ పొందిన గాయనీ గాయకులు కారు. దాంతో సంగీత దర్శకులు కూడా బాణీలను తేలికగా ఉంచేవారు. నేపథ్యగానం సాధ్యమైన తరువాత పాటలు పాడే బాధ నటీనటులకు తప్పింది. లత బొంబాయిలో అడుగుపెట్టినప్పుడు నేపథ్యగానం ఇంకా అంతగా ప్రాచుర్యం పొందలేదు. సైగల్‌, సురేంద్ర, నూర్జహాన్‌, సురయ్య వంటి వారు తమ పాటలు తామే పాడుకునేవారు. శంషాద్‌ బేగం వంటి వారు రంగప్రవేశం చేసి పేరు Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

స్త్రీవాదం అందరిదీ! ఉద్వేగ భరిత రాజకీయాలు – బెల్‌ హుక్స్‌

సహోదరిత్వం ఇప్పటికీ శక్తివంతమయిందే
‘‘సహోదరిత్వం శక్తివంతమైంది’’ అన్న నినాదం మొట్టమొదట వాడినప్పుడు విన్నవాళ్ళకి ఒళ్ళు గగుర్పొడిచింది. నేను డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు నేను స్త్రీ వాద ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొనటం ప్రారంభించాను. మొదటి సంవత్సరం Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

ఎన్నో రంగుల చీకటి – స్వాతి పంతుల

మొత్తం 113 కవితలు… వీటినిండా ఎంతమంది, ఎన్ని రకాల మనుషులో… మనసులో
గాయపడిన వారు, గాయం చేసేవారు, ఆకాంక్షలు, ఆంక్షల మధ్య నలిగిపోయిన వారు, మనం నడిచే దారుల మీద ముళ్ళు పరిచేవారు, మిణుగురులై దారి చూపించిన వారు… ఇలా చాలామంది. వాటిల్లో నాకు నచ్చిన కొన్ని కొన్ని వాక్యాలు… ఇంతకన్నా విశ్లేషించలేను. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

పోతన చిత్రించిన ‘సత్యభామ’ – బి.విజయభారతి

సత్యభామ శ్రీకృష్ణుని ఎనిమిది మంది రాణులలో ఒకతె. ఈ ఎనిమిది మందినీ కవులు అష్టవిధ శృంగార నాయికలకు ప్రతీకలుగా తీర్చిదిద్దారు. పండితులూ, కవులూ, లక్షణకారులూ దిద్దిన పాత్రలు అవి. స్త్రీల సహజాతాలను ఈ సమాజం పట్టించుకున్నదెక్కడ? అయినప్పటికీ వారి సహజమైన భావావేశాలనూ కవులు దృష్టిలో ఉంచుకున్నారు. యుగ ధర్మం అంటూ మానవుల కార్యకలాపాలను… ముఖ్యంగా స్త్రీల వేషభాషలను, నడవడికను Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

కారా కథల్లో స్త్రీ పాత్రలు -డా.బి.నాగశేషు

కథకు ఒక ప్రాంతం లేదు, కథకు కులం లేదు, కథకు మతం లేదు, కథ ఫలానా వాళ్ళే రాయాలనే వాదం కూడా లేదు. సాహిత్యాకాశంలో కథల వర్షం ఎక్కడ కురిసినా కథానిలయం చేరాల్సిందే. నేడు మనం ఏదైనా ఒక విషయాన్ని కానీ, విషయాంశాన్ని కానీ, స్థలం కానీ, స్థలమహాత్యం కానీ, వ్యక్తులు గానీ, వ్యక్తుల గురించి కానీ, వస్తువుని, Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

అంగట్ల ఆగమైన గొంగడి -జూపాక సుభద్ర

గీ గ్లోబలైజేషన్‌ ఎన్ని గొల్లేలేసినా, మాడ్రనైజేషన్‌తోని ఎన్ని కొత్త వస్తువులు కోలాటమాడినా నాకు పాత వస్తువులంటేనే ఖాయిషు. నా సిన్నప్పుడూ మా సుట్టు అవుసరాలు దీర్సిన మర్రిసెంబు, యిసుర్రాయి, రోలు, కడెమేసుకుని వుండే రోకలి, కంచుతలెలు, సిర్రె Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: సావిత్రి (1904`1917) -డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

వలసాంధ్రలో స్త్రీల సంపాదకత్వంలో వెలువడిన రెండవ స్త్రీల పత్రిక ‘సావిత్రి’. జనవరి 1904లో కాకినాడ నుండి ప్రచురించబడ్డం ప్రారంభించిన ‘సావిత్రి’ మధ్యలో కొంతకాలం ఆగిపోయినా 1917 వరకూ కొనసాగినట్లు కనిపిస్తుంది. సమకాలీన మహిళోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

మా జీవితమంతా అప్పులు తీసుకోవడం, దాన్ని తిరిగి చెల్లించడంతోనే సరిపోతోంది -సంస్కృతి తల్వార్‌

అనువాదం: రవికృష్ణ
అప్పులు, అవమానాల ఊబిలో కూరుకుపోయిన హవేలియాఁ గ్రామ దళిత మహిళలు జాట్‌ సిక్కుల ఇళ్ళల్లో పశువుల శాలలను శుభ్రం చేసి, పేడను ఎత్తిపోస్తుంటారు. ముందస్తుగా డబ్బు అప్పు తీసుకోవడం వలన వారు తమ వేతనంలో కొంత భాగాన్ని కోల్పోతారు. పశువుల కొట్టంలోని ఇటుకలు పరిచిన మట్టి నేల మీద నున్న గేదె పేడను మంజీత్‌ కౌర్‌ (48) రెండు Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

దుర్గాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పిల్లలు రాసిన కథలు

పండుగ కథ
అది పండుగ నెల. మా అమ్మ ఇంటి పనులు చేయడానికి సిద్ధపడుతోంది. అప్పుడు నేను వెళ్లి, ‘‘అమ్మా ఎందుకు ఇంటి పనులు చేస్తున్నావు’’ అని అడిగాను.
‘‘ఇప్పుడు పండుగ నెల కదా అందుకే ఈ పనులు చేస్తున్నాను’’ అని అమ్మ చెప్పింది. Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

తనకేం తెలుసురా ` – డా.నీలం స్వాతి

ఇల్లంతా కేరింతలు కొడుతూ, చిరునవ్వులతో చిందులేస్తూ,
అల్లరి చేస్తూ, ఆడుకుంటూ, అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ,
అమాయకమైన ఆ పసితనంలో ఎవ్వరు పిలిచినా సరే Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

సెప్టెంబర్, 2022

సెప్టెంబర్, 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

న్యాయం కావాలి – కొండవీటి సత్యవతి

గత కొన్నిరోజులుగా యావత్తు దేశంతో పాటు నన్నూ కుదిపేసిన రెండు సంఘటనలు తలచుకున్నప్పుడల్లా దుఃఖం పొంగివస్తోంది. దుఃఖం తర్వాత పట్టలేని కోపం. కోపాన్ని తీర్చుకునే సాధనం లేక ఒక నిస్సహాయత, ఆక్రోశం మనసంతా కమ్ముకుని నిలవనీయకుండా చేస్తున్న Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

Dear Bhumika Team,

This is about the cover page of Streevada Pathrika, BHUMIKA 10th Aug 2022 copy. A mother’s bosom belongs only to her child. kindly restrict the images of motherhood in the veil of her dignity.
In our patriarchal society, and increasing cases of depression, hypocrisy, crime etc…please save the dignity of women and mothers’, by not showing the sensitive moments deliberately, like the rest of the world.
Beauty and divinity is beauty concealed and veiled. We really appreciate your contribution to our Bharath Mata through BHUMIKA. With due respect to BHUMIKA, and a subscriber of the magazine for 2 decades.
` పావని, ఇ`మెయిల్‌.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment