-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: కథలు
దేవకి- ఒడియా మూలం : ప్రతిభా రాయ్ అనువాదం : జయశ్రీ మోహన్ రాజ్
సంత ముగించుకుని అడివి బాటలో నడుస్తూంది ఝముటి గొహరా. దుఃఖాల దొంతరలతో చేసిన మెట్లపై పాదాలు మోపుతూ జీవితపు ఒడిదుడుకులపై నడుస్తున్నట్టుందామె. ఏదో అమూల్యమైన వస్తువన్నట్లు అతి జాగ్రత్తగా మూటను గుండెలకు హత్తుకుని నడుస్తూంది, లేత పసికందు ఆమె స్తనాల్లోని పాలు కుడుపుతూందా అన్నట్లు!
Posted in కథలు
Leave a comment
గ్రహణం తర్వాత ….మూలరచన : గోవింద్ ఉపాధ్యాయ అనువాదం : అనూరాధ నిప్పాణి
ఇప్పుడే నిక్కూ ఫోన్ చేసాడు : ”అమ్మా, ఎప్పుడొస్తున్నావు? నువ్వు సండే వస్తానని ప్రామిస్ చేసావుగా?” అంటూ… మోనిక వాడిని బుజ్జగించింది. ”నిక్కూ, నువ్విప్పుడు చిన్నపిల్లాడివి కావు. మమ్మీ ప్రాబ్లెమ్స్ అర్థం చేసుకోవాలి. నాకు శెలవు దొరగ్గానే వస్తానుగా”! మోనిక వాడినైతే బుజ్జగించింది కానీ – ఇప్పుడే ఏడిచేటట్లుంది ఆమె పరిస్థితి. ఈ
Posted in కథలు
Leave a comment
మౌనమా.. మార్చుకో నీ చిరునామా – భవానీ ఫణి
శ్రావణి అన్య మనస్కంగా వంట చేస్తోంది. ఇందాక శ్రీధర్ ఆఫీస్ నించి ఫోన్ చేసినప్పటి నుండీ ఆమెకి కొంచెం కంగారుగా ఉంది. హరీష్‌కి హాస్టల్‌లో ఏదో సమస్య వచ్చిందనీ రూం వెకేట్ చేసి ఇక్కడికి వస్తున్నాడనీ అతని మాటల సారాంశం.
చుక్క సావిత్రి – ఆచంట హైమవతి
”మీ దగ్గర ఇలాంటి కళాకృతులు మంచివి దొరుకుతాయని మా పేపర్లో వేస్తాం! అందువల్ల చాలామందికి తెలిసి కొనుక్కుంటారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసినందుకు మా పత్రికకీ మీలాంటివారిని ప్రోత్సహిస్తున్న పేరు లభిస్తుంది. మీకు ఆర్థికంగానూ లాభిస్తుంది” అన్నాడు సంభాషణ ప్రారంభిస్తూ పత్రికా విలేకరి. ”చుక్కమ్మ” అని చెప్పి… నాలిక్కరు చుకుని ”కాదు…కాదు”
Posted in కథలు
Leave a comment
సంకి – ఒడియా మూలం : ప్రతిభా రాయ్ అనువాదం : జయశ్రీ మోహన్ రాజ
సభ్యసమాజాన్నీ ఆదివాసుల ప్రపంచాన్నీ వేరుచేస్తున్న ట్లుగా రాళ్ళమీద రాళ్ళు పేర్చిన ప్రహారీ గోడ పొడవుగా నిలిచింది – దాని పేరే ‘రునుక బోరు’ లేక ‘బొండా గోడ’.
Posted in కథలు
Leave a comment
కనువిప్పు – పి. రాజ్యలక్ష్మి
పదిమంది పెద్దమనుషులతో పంచాయితి నడుస్తోంది. పేరుకు పంచాయితీనే గాని ప్రపంచ యుద్ధం నడుస్తున్నట్లు వుంది. యిరు వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. చర్చలు నడుస్తున్నా పరిష్కారం కనుచూపుమేరలో కనబడటం లేదు. రెండు రోజుల నుండి యిదే తంతు. యింతకీ విషయం ఏమిటంటే
తీరు మారిన తీర్పు
(భూమిక నిర్వహించినటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)- హైమా శ్రీనివాస్ న్యాయమూర్తికోర్టులోకి అడుగుపెట్టగానే అంతాలేచి నిలబడ్డారు. ఆయనతన స్థానంలో కూర్చుని, మొదలుపెట్టమన్నట్లు చూశారు.
Posted in కథలు
Leave a comment
భూమిక వార్షిక పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ
ఇదో రకం పోరాటం – ఈనాటి పోరాటం మెటర్నిటీ లీవ్ అయిపోయింది. ఆ రోజు డ్యూటీలో చేరాల్సిన రోజు శర్మిష్ఠకి చాలా ఉత్సాహంగా ఉంది. దాదాపు ఏడాది తర్వాత తన టేబుల్ దగ్గరికి వెళ్తోంది. పాత రోజులు మళ్లీ వస్తున్నాయన్న ఆనందం, తోటి ఉద్యోగులందర్నీ కలుసుకుంటానన్న ఉత్సాహంలో, బ్యాగ్‌ని పొద్దున్నే సర్దుకుంది. తొందరగా తయారయింది.
Posted in కథలు
Leave a comment
‘జిందగీ న మిలేగి దుబారా’ –
కొండవీటి సత్యవతి ”ఎడిటర్ అని బోర్డున్న రూమ్‌లోకి ఆమె ఆడుగుపెట్టింది ధాత్రి. కుర్చీ ఖాళీగా వుంది. ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది. రూమ్ నిండా పుస్తకాలు నీట్‌గా సర్దివున్నాయి. టేబుల్ మీద బోలెడు పుస్తకాలు పరిచివున్నాయి. గోపాలం తన కిష్టమైన పుసత్కఆలన్నింటిని సేకరించుకున్నాడు అనుకుంటూ నవ్వుకుంది.
Posted in కథలు
Leave a comment
సవాల్
Posted in కథలు
Leave a comment
నీల
– రాధ మండువ కొత్తచీర కట్టి కులుకుతూ వచ్చింది పనికి నీల. కొత్తచీర కొనిందంటే ఆ తర్వాత రోజే దానిని కడుతుంది. ”అదేమిటి మొన్ననేగా ఒక కొత్తచీర కట్టావు. మళ్ళీ ఇంకోటా ఎన్ని కొంటావే.” అన్నాను.
Posted in కథలు
Leave a comment
”అంతులేని క(వ్య)థ” (కథ) – విడదల సాంబశివరావు – కవిని ఇల్లంతా భీతావహంగా ఉంది. రామారావు నిప్పులు కురిపిస్తున్నాడు. కళ్ళు ఎరుపెక్కి వున్నాయి. తాగిన విస్కీ మత్తుకుతోడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 సం||రాల కొడుకు కౌషిక్ మీద కోపం కళ్ళను మరింత ఎరుపెక్కేలా చేశాయి.
Posted in కథలు
Leave a comment
–
– కోపూరి పుష్పాదేవి సైకియాట్రిస్టు డా. చంద్రిక ఎదురుగా అసహనంగా, అనాసక్తంగా కూర్చుని ఉంది సన్నిహిత. పక్కన కూర్చున్న ఆమె తల్లి అరుంధతి ఆందోళనగా డాక్టరువైపు చూస్తోంది.
Posted in కథలు
3 Comments
”…..”
డా|| మల్లెమాల వేణుగోపాలరెడ ఆటో వచ్చి ఇంటిముందు ఆగింది. గేటు తెరుచుకుని గౌరి పరిగెత్తి లోపలికి వచ్చి ”సార్! సార్… మా నాయ్న గసపోసుకుంటున్నాడు. నోట మాట రావడం లేదు…. ఆటోలో వున్నాడు… మీరు చూడండి సార్” అంది.
Posted in కథలు
Leave a comment
– గోపి భాగ్యలక్ష్మి సమయం నాలుగు అందరు.. వచ్చినట్టేనా? బస్ కండక్టరు టికెట్లు కొడుతూ అడిగిండు. అయ్యొ కొంచెం ఆగవు సారు, మా పిల్లాడు ‘చాయ్ తాగనికె పొయిండు’ ఓ నడి వయసు పెద్దమనిషి బ్రతిమిలాడాడు. బస్సెక్కినంక నే అన్నియాది కస్తయ్ కండక్టరు చిటపట లాడిండు. మీరు గట్లంటె ఎట్లసారు అన్నోడు ఓ ప్రయాణికుడు.
Posted in కథలు
Leave a comment
-ఉదయమిత్ర ”ఆమెకెవరూలేరు” చివరికావ్యాన్ని రాసి కధను పక్కన పడేశాను – విపరీతమైన అసంతృప్తి …. ఆంధోళన …. నన్నీ చివరి వాక్యం సలుపుతున్నగాయంలా తయారయింది.
Posted in కథలు
Leave a comment