-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
February 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 Meta
Tags
Daily Archives: February 3, 2024
ఆకాశం మెల్లగా నల్లబడిపోతుంది – కొండవీటి సత్యవతి
(The sky gets dark slowly… Zhou Daxin)ఈ పుస్తకం చదవమని ఎవరో సూచించారు. చదువుతుంటే చాలాసార్లు అబ్బూరి ఛాయాదేవి గారు, ఆవిడ నాకు రాసిన ఉత్తరం గుర్తు వచ్చాయి. జీవితాన్ని, మరణాన్ని ఆవిడ అద్భుతంగా ప్లాన్ చేసుకున్న తీరు కళ్ళముందు ఆవిష్కృతమైంది.
Posted in సంపాదకీయం
Leave a comment
పరస్పర స్వేచ్ఛనిచ్చే నైతికత : స్త్రీవాదం అందించే లైంగిక రాజకీయ దృక్కోణం – బెల్ హుక్స్
అనువాదం: సునీత అచ్యుత స్త్రీవాద ఉద్యమం, లైంగిక విముక్తి పోరాటం రాకముందు, అనేకమంది స్త్రీలకు తమ లైంగిక కోరికల గురించి మాట్లాడటం కష్టంగా, ఇంకా చెప్పాలంటే అసాధ్యంగా ఉండిరది. లైంగిక కోరికలు, లైంగిక ఆనందం రెండూ ఎప్పుడూ కేవలం మగవాళ్ళకు మాత్రమే కలుగుతాయని ఆడవాళ్ళకి చిన్నప్పటినుంచి చెప్పటమే కాక, అటువంటి ఆనందం కోరుకునే ఆడవాళ్ళు నీతిలేని … Continue reading
Posted in ధారావాహికలు
Leave a comment
పరదాల వెనుక…! – భండారు విజయ
ఫాతిమా! జరీనా ఆంటీ, నదియా దీదీ ‘దోనోం ఆయా, జల్దీ ఆజావ్ బేటీ’! బయట నుండి తల్లి పిలుపు రెండోసారి వినిపించింది. ‘దీదీ ఆప్ జల్దీ జావ్, మళ్ళీ అమ్మీ లోపలికొచ్చి నిన్ను బలవంతంగానైనా తీసుకొని వెళ్తుంది’ అక్కకు లిప్‌స్టిక్ సరిచేస్తూ అంది హసీనా.
Posted in కధలు
Leave a comment
మెంటల్ క్రైసిస్ రాకముందే మేల్కొనాలి – వి.శాంతి ప్రబోధ
‘అమ్మా… అసలామె కన్నతల్లేనా? తల్లి ఎన్ని తిప్పలైనా పడ్తది. కడుపున కాసిన కాయకు పానంబెట్టి సుత్తది. అసొంటిది గా తల్లి నాలుగేండ్ల కొడుకును చంపి మూట కట్టిందట. తల్లే గిట్ల జేత్తే ఇగ ఎవరికి నమ్మాలె’ అంటూ బాధపడి పోయింది యాదమ్మ.
Posted in కిటికీ
Leave a comment
చిన్న పట్టణం పెద్ద సంబరం – నాదేళ్ళ అనురాధ
సంవత్సరం పొడవునా మనం బోలెడు పండుగలు జరుపుకుంటూనే ఉంటాం. పండుగ ఏదైనా సందడంతా పిల్లలదే కదా. నవంబర్ నెలలో ఒక జాతీయ నాయకుడి పుట్టినరోజుని అచ్చంగా పిల్లల పండుగగా చేసుకునే అలవాటు మనకుంది. దానికి కారణం ఆ నాయకుడికి పిల్లల పట్ల ఉన్న ప్రేమ. అయితే ఇటీవల పిల్లల పండుగ అంటూ వివిధ తేదీల్లో మన … Continue reading
Posted in రిపోర్టులు
Leave a comment
సామాన్యంగా కనబడే అసామాన్య మహిళ ` పరకాల కాళికాంబ – కొండవీటి సత్యవతి
మా అమ్మ కాశీ అన్నపూర్ణ, పరకాల కాళికాంబ గార్లు మంచి స్నేహితులు. మా అమ్మకి నాకంటే ఎక్కువమంది స్నేహితులుండేవారు. 1960 ప్రాంతాల్లో మా నాన్న కొబ్బరికాయల వ్యాపారం చేసేవాడు. అందుకోసం నర్సాపురంలో మకాం పెట్టాడు.
Posted in నివాళి
Leave a comment
దళిత షీరోల పోరాటాల చరిత్ర మిణుగురులు – కొండవీటి సత్యవతి
చాలా సంవత్సరాల క్రితం ‘ఉమెన్ రైటింగ్ ఇన్ ఇండియా’ పుస్తకం చదివినప్పుడు చరిత్ర చీకటి కోణాల్లో తెరవెనకే ఉండిపోయిన ఎంతోమంది స్త్రీల జీవితాల గురించి, వారి పోరాటాలు, వారి వ్యక్తిత్వాల గురించి మొదటిసారి చదివినప్పుడు చెప్పలేనంత ఉద్వేగం కలిగింది.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ఆమెది సామూహిక స్వరం – వి.ప్రతిమ
ఆంక్షలు, కట్టుబాట్లు, సంకెళ్ళు వంటి అణచివేతల నుండి ఒక నిరసన, ఆగ్రహం, ధిక్కారం క్రమంగా పోరాట తత్వం తలెత్తుతుంది. అందులో నుండి ముందో, వెనకో అస్తిత్వ ఉద్యమం ప్రారంభమవుతుంది. ఆ కఠినమైన పరిస్థితుల్లో నుండి బలమైన, విలువైన సాహిత్యం పురుడు పోసుకుంటుంది.
Posted in పుస్తక పరిచయం
Leave a comment
బతకడమో, గౌరవంగా చావడమో అంతా నా చేతుల్లోనే ఉంది- కొండవీటి సత్యవతి
‘అడుగడుగునా తిరుగుబాటు’ గీతా రామస్వామి రాసిన ఆమె ఆత్మకథ చదవడం పూర్తయ్యాక ఎన్నో రకాల భావాలు మనసులో కదిలాయి. పుస్తకం చేతిలోకి తీసుకున్న తర్వాత చాలా వేగంగా అధ్యాయం తర్వాత అధ్యాయం పూర్తి చేస్తున్నప్పుడు గీత జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలు చాలా ఆశ్చర్యం కలిగించాయి.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
షీరోల గురించి మాట్లాడుకుందాం – వంగపల్లి పద్మ
సహజంగా ఈ సమాజంలో ఎక్కువగా హీరోల గురించే మాట్లాడుకుంటారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే షీరోల గురించి మాట్లాడుకుంటారు. తమ పనులతో, తమ బాధ్యతలతో, తమ వ్యక్తిత్వాలతో, తమ ధైర్య సాహసాలతో, తమ త్యాగాలతో, సమాజ గమనంలో ఒక మైలురాయిగా నిలిచినటువంటి, ఇతరులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి మహిళలను గుర్తు చేసుకోవడం చాలా తక్కువ సందర్భాల్లోనే
24వ పాత పంటల జాతర ` 2024 – డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ మహిళా సంఘాలు
మొగుడంపల్లి మండలంలోని జాడిమల్కాపూర్ గ్రామంలో జనవరి 14, 2024న 24వ పాత పంటల జాతర ప్రారంభమయింది. ఈ జాతరకు ప్రత్యేక అతిథులుగా ప్రొ.వినోద్ పావురాల, ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మొనిమయ్ సిన్హా, సి.డబ్ల్యూ.ఎస్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హైదరాబాద్, ప్రొ.అపర్ణ రాయప్రోలు, ప్రొఫెసర్, సోషియాలజీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జి.వినోద్ కుమార్, మండల
Posted in రిపోర్టులు
Leave a comment
పరకాల కాళికాంబ: ఇల్లు వాకిలీ సంఘం నుంచి అసెంబ్లీ దాకా… -కందుకూరి రమేష్ బాబు
ప్రతి వ్యక్తి రచనగా వ్యక్తమైతే ముఖ్యంగా స్త్రీలు లేదా ఒక తల్లి గనుక తన కథ తాను చెబితే కల్పిత సాహిత్యం కళ తప్పిపోతుంది. చరిత్రగా మనం చదివిన గాథ ఎంత అర్ధ సత్యమో కూడా అవగతమవుతుంది. పరకాల కాళికాంబ గారి జీవితం చదివితే ఈ మాటలు చెప్పబుద్ధి అవుతోంది.
Posted in వ్యాసాలు
Leave a comment
మా ప్రయాణాల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు – హ్యు గాంట్జర్, కొలీన్ గాంట్జర్
` తెలుగు అనువాదం: శివలక్ష్మి (హ్యు గాంట్జర్ Hugh Gantzer), కొలీన్ గాంట్జర్ (Colleen Gantzer) అనే ఇద్దరు యాత్రా రచయితలు రాసిన ‘‘women’s Bill, Through Our Travels” కు నా స్వేచ్ఛానువాదం. హ్యు, కొలీన్ దేశ, విదేశీ ప్రయాణాల ద్వారా వారు పొందిన అవగాహనతో వివిధ దేశాల్లోని మహిళల స్థితిగతుల్ని, 33 శాతం, … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఆత్రేయపురంలో పూతరేకులు చుట్టే సున్నితమైన కళ – అమృత కోసూరు
ఆత్రేయపురం పూతరేకులు గతేడాది జిఐ (జియోగ్రాఫికల్ ఇండికేటర్ ` భౌగోళిక సూచిక)ను పొందాయి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే పలుచని బియ్యపు రేకుతో చుట్టిన ఈ మిఠాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీపి గురుతు.
Posted in వ్యాసాలు
Leave a comment
నది నుంచి సముద్రం దాకా… స్వేచ్ఛా విహంగ పాలస్తీనా- మమత కొడిదెల
‘‘నా పేరు ఖలిల్. నాకు 27 ఏళ్ళు. నేను ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు ఎన్నో కలలూ, ఆశయాలూ, లక్ష్యాలూ ఉన్నాయి. ప్రేమించడం ఎలానో నాకు తెలుసు. ఎలా సంతోషంగా ఉండాలో తెలుసు. కష్టపడి పనిచేసి అనుకున్నది ఎలా సాధించాలో నాకు తెలుసు.
Posted in వ్యాసాలు
Leave a comment