Monthly Archives: July 2024

జూలై, 2024

జూలై, 2024

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

మగవాళ్ల ప్రాణాలు హరిస్తున్న మద్యపానం – కొండవీటి సత్యవతి

ఇటీవల విజయవాడ, రాజమండ్రిలో కొత్తగా పనిచేయడానికి ఎంపిక చేసుకున్న బస్తీలలో ఒక దిగ్బ్రాంతికరమైన అంశం కొట్టొచ్చినట్టు కనబడిరది. కొత్తగా పనిచేయడానికి ఏదైనా బస్తీలోకి వెళ్ళేటప్పుడు బేస్‌ లైన్‌ చేయడం అవసరం. దానిలో భాగంగా ఆయా బస్తీల సమాచారం సేకరిస్తాం. ఆ బస్తీ స్థితిగతులు, ఎలాంటి సమస్యలున్నాయి, స్త్రీ పురుషుల నిష్పత్తి, బాల బాలికల నిష్పత్తి లాంటి … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి జూన్‌ నెల భూమిక అట్ట మీద మన సాయి పద్మ నవ్వుతూ చాలా బాగుంది. తన మనసు, ఆశయాలు కూడ ఆ చిరునవ్వు లాగా వుంటాయి. నాకు తను ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయం.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార నేనీ పుస్తకాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది? నన్ను నేను పరామర్శించుకుంటూ.. పరిసర ప్రపంచంతో నాకున్న సంబంధాలేమిటి, అందులో నా స్థానం ఎక్కడని ప్రశ్నించుకుంటూ చేసిన అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం. నేను కేరళ మూలాలున్న ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ముందు చూపున్న స్త్రీవాదం – బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ. సునీత నిజమైన స్వాప్నికులం కావాలంటే మన ఊహలన్నీ వాస్తవ పరిస్థితులలో బలంగా వేళ్ళూనుకుని ఉండాలి, అలాగే ఆయా పరిస్థితుల నుండి ముందు కెళ్ళి కొత్త సంభావ్యతల గురించి కూడా ఆలోచించగలగాలి. సమకాలీన స్త్రీవాదానికున్న బలం ఏంటంటే తనని, తన మార్గాన్ని మార్చుకోగలగటం. పాతబడిపోయిన ఆలోచనలు, కార్యాచరణని పట్టుకు వేళ్ళాడే సామాజిక న్యాయ ఉద్యమాలన్నీ … Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

ఆమెను చిత్తడి చేస్తున్న చిత్తవైకల్యం – వి.శాంతి ప్రబోధ

చ్చో చ్చో .. పాపం. ఆ పెద్దవ్వకు చూత్తే పానం కలకల ఐయితాంది. ముత్యాలసొంటి ముగ్గురు కొడుకులని మురిసిన తల్లి గాచారం గిట్ల కాలబడే అంటూ లోనికి వెళ్ళిపోయింది యాదమ్మ. యాదమ్మ ఎప్పుడూ ఇంతే. చెప్పేదేదో సరిగ్గా చెప్పదు. చేట చీపురుతో వచ్చిన యాదమ్మను చూస్తూ సస్పెన్స్‌ సీరి యల్‌లా కాకుండా చెప్పేదేదో సరిగ్గా చెప్పి … Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

ఇచ్చోటనే – ఆపర్ణ తోట

మనమున్నాము కాబట్టి మరెందరో కూడా మనలానే ఉండి ఉంటారు. మనకు అవసరాలు ఉన్నాయి కాబట్టి మిగిలిన వారికి కూడా అవసరాలు ఉండే ఉంటాయి. కానీ బాధా మనదే బాధ్యతా మనదే. లొంగదీసేవారము మనమే, లొంగిపోయేవారమూ మనమే. సర్వం అద్వైతమే. కానీ ద్వైతంలో చూస్తేనే కిటుకు బోధపడేది.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

పరువు – వి. శాంతి ప్రబోధ

ఇప్పుడు బతికి ఉన్నానా.. చచ్చిపోయానా.. లేక చనిపోయి బతికానా అని చిన్నగా నవ్వుకుంటూ చేతిలో మొబైల్‌ పక్కన పెట్టింది ఆమె. కానీ, ఆమె ఆలోచనలన్నీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టర్‌ మీద, ఆ వెనుక వస్తున్న రకరకాల వ్యాఖ్యానాల పైనే ఉన్నాయి. ఎంత వద్దనుకున్నా అవి జోరీగల్లా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి.

Share
Posted in కథలు | Leave a comment

స్త్రీల కృష్ణపక్ష జీవితం….. ఒక పరిశోధన – వి. ప్రతిమ

చంటి పిల్లల్ని చంక నేసుకుని, స్త్రీలు స్వాతంత్రోద్యమంలోకి నడిచి, జైళ్లకు కూడా వెళ్లిన చరిత్ర మనది…. ఇంతటి ధైర్య సాహసాలూ, దృఢమైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నప్పటికీ భారతదేశంలో ఇప్పటికీ స్త్రీల ఆస్తిత్వాలు ప్రశ్నార్ధకాలే?…. వారి హక్కులు అవాస్తవాలే.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

సమాజాన్ని కదిలించే ‘‘హోరుగాలి’’ – సయ్యద్‌ ముజాహిద్‌ అలీ

ఆధునిక కాలం నుంచి మధ్యయుగాలకు రాజకీయ నాయకులు సమాజాన్ని తీసుకువెళ్లి సమాజంలో అరాచకాలను, ఆటవిక నీతిని అమలు చేస్తుంటే.. ఏ కవి రచయిత వ్యాసకర్త ఊరికే చేతులు కట్టుకొని ఉండరు. ఒక దీపధారిjైు హోరుగాలిలా వీస్తూ సమాజానికి దారి చూపుతూ, వర్తమానాన్ని తన కలంతో అక్షరీకరించి చరిత్రగా ముందు తరాలకు అందజేస్తారు.

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

చీకటి వెలుగుల రేఖ – అనురాధ కోవెల

నిజానికి ఇది ఒక కథ కాదు. ఒక అమ్మాయి జీవితం. రాత్రికి రాత్రే ఇంటి పెద్దరికం మీద పడి బాల్యాన్ని కోల్పోయిన ఒక ఆడపిల్ల అనుభవాల పాఠం. తళుకు బెళుకుల సామ్రాజ్యంలో ఉండే చీకటి కోణాలు తెలిసీ తప్పని పరిస్థితుల్లో అందులోకి దిగిన ఆడపిల్ల పడిన తడబాటు. సాధారణ ఆడపిల్లలా ఒక నమ్మకమైన ప్రేమ పంచే … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

చిగురంత ఆశ – పిల్లల సినిమాలు 25 – డా. పి. యస్‌. ప్రకాశరావు

ప్రత్యేకంగా పిల్లల కోసం తీసిన సినిమాలు మనకు తక్కువ. కొ.కు అన్నట్టు ‘మనం ఏ చిత్రాలైతే చూస్తున్నామో మన పిల్లలూ ఆ చిత్రాలే చూస్తున్నారు’. ఈ పుస్తకం పిల్లలకోసం తీసిన 25 ఉత్తమ చిత్రాల సమీక్ష. పెద్దల సినిమాల సమీక్ష ‘రియలిస్టిక్‌ సినిమా’ పుస్తకం రాసిన శివలక్ష్మిగారే ఇది కూడా రాశారు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

‘నేనొక రంగస్థల కళాకారిణిని కావటంవలన ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు’ – పూంగొడి మదియరసు / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

ట్రాన్స్‌జెండర్‌ కళాకారులు తమిళనాడులోని ఈ పురాతన రంగస్థలంపై తమకున్న మక్కువను కొనసాగిస్తున్నప్పుడు ఎదుర్కొంటోన్న సవాళ్ళ గురించి ఒక తెరుక్కూత్తు కళాకారిణి మాట్లాడుతున్నారు

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నెత్తురోడుతున్న పాలస్తీనాలో ప్రతిఘటనా జ్వాలలు – చైతన్య చెక్కిళ్ల

గాజాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న జాతిసంహారం (genocide) మొదలై ఎనిమిది నెలలు కావస్తున్నది. 76 ఏండ్ల క్రితం ఇజ్రాయిల్‌ స్థాపనతో పాలస్తీనీయుల జాతి ప్రక్షాళన (ethnic cleansing) మొదలయింది. 76 ఏండ్లుగా పాలస్తీనా ప్రజలను బలవంతపు వలసలకు గురి చేస్తూ, ఊర్లలో నుండి వెళ్లగొడ్తూ, జైళ్ళలో వేస్తూ, మిలిటరీ దాడులతో హత్యాకాండలు చేస్తూ ఇజ్రాయిల్‌ జాతి ప్రక్షాళన … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భూషణం కథలు – గిరిజన జీవిత చిత్రణ – సారిపల్లి నాగరాజు

అడవులలో, కొండ ప్రాంతాలలో నివసిస్తూ లేదా సంచార జీవనము గడుపుతూ ఆదిమ సంస్కృతిలో ఉండే తెగవారిని ‘గిరిజనులు’ అంటారు. ప్రపంచ దేశాలలో అన్ని జాతుల సంస్కృతుల కన్నా ఆదివాసుల సంస్కృతి భిన్నంగానూ, అపురూపంగాను ఉంటుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నీ చేతులు

స్వేచ్చానువాదం: జాని తక్కెడశిల English: Shannan Mann, Indian-Canadian నన్ను కొద్ది కొద్దిగా బూడిద చేశాయి, నీ చేతులు. బహిరంగ అగ్ని పులకింపజేసింది, నేను ఒప్పుకుంటున్నాను – నీ చేతులు

Share
Posted in కవితలు | Leave a comment