నాన్న ప్రేమ ఉత్తమమైనది
నాన్న ప్రేమ ఉత్తమమైనది
నాన్న ప్రేమ విశాలమైనది Continue reading
అతుల్ సుభాష్ అనే టేకి ఆత్మహత్య చాలా దురదృష్టకరం. మన వివాహ వ్యవస్థలో ఉన్న ఎన్నో లోపాలని ఈ సంఘటన బహిర్గతం చేసింది. మన దేశంలో గృహహింస ఏ స్థాయిలో ఉందో ప్రతి క్షణం రిపోర్ట్ అవుతున్న గృహ హింస కేసుల తీరును తీరు తెన్నులు గమనిస్తే అర్ధమౌతుంది. Continue reading
` అనువాదం: ప్రభాకర్ మందార
(గత సంచిక తరువాయి…)
మొదట్లో పార్టీ మా యువ సభ్యులను కొంత ప్రత్యేకంగా చూసుకునేది. ఇక్కడ నీలం రామచంద్రయ్య (ఎన్‌ఆర్) వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘ఎన్‌కౌంటర్’లో చనిపోయే వరకూ కూడా మా విషయాలన్నీ ఆయనే చూసుకునేవారు. తను ఎంతో హుందాగా, మాతో కాస్త వ్యూహాత్మకంగా కూడా వ్యవహరించేవారు. Continue reading
చాలా తెలివైనది తాను. మొదటిసారే మెడిసిన్ సీటు కొట్టేస్తాననుకుంది. రాలేదు. డొనేషన్లు కట్టి చదివించేంత స్థితిలో తల్లిదండ్రులు లేరు. తనకన్నా తక్కువ తెలివైన వాళ్ళు సీటు తెచ్చుకునో, డొనేషన్లు కట్టో మెడికల్ కాలేజీలో చేరితే… తాను చేరలేకపోయినందుకు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించింది. Continue reading
2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన థీవ్‌ు : 2025 వ సంవత్సరానికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవానికి లింగ సమానత్వాన్ని సాధించడానికి వేగంగా చర్యలను చేపట్టండి (Accelerate Action) అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు సమిష్టిగా పనిచేయమని ఐక్యరాజ్యసమితి నిర్ధేశించింది. Continue reading
విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు (1509-1530) ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో చాలా భాగాన్ని తిరుగు లేకుండా పాలించి, ఒరిస్సాలోని గజపతుల్ని జయించి, సామంతుల్నిగా చేసుకున్నా, బహుమనీ సుల్తానులకు పక్కలో భల్లెమై కూర్చొన్నా, ఆ సాహితీ సమరాంగణ చక్రవర్తి అధీనంలో వున్న బళ్లారి, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు మాత్రమే ‘రాయలసీమ’అన్న పేరు ప్రసిద్ధం కావటం విచిత్రం. Continue reading
కొన్ని పుస్తకాలు చదవడానికి చాలా దిటవు గుండెలుండాలి. ఇలాంటివి చదివేపుడు ఇంత విషాదమా, ఇంత బీభత్సమా? వీటికి దరీ, అంతూ లేదా అనిపిస్తుంది. అయినా ఊపిరి బిగబెట్టి చదువుతాం. మేరీ టైలర్’’ భారత దేశంలో నా జైలు జీవితం ‘‘అప్పటి పాఠకుల్ని రోజుల తరబడి ఇలానే వెంటాడి వుంటుందనుకుంటాను. సుధా భరద్వాజ గారి ‘‘ఉరి వార్డు నుండి’’ కూడా ఈ కోవకే వస్తుంది. ఇదేమీ ఆషామాషీ పుస్తకం కాదు. Continue reading
‘యోధ – మాతృత్వం: భిన్న వ్యక్తీకరణలు’ విజయ భండారు సంపాదకత్వంలో కొత్తగా వెలువడిన కథా సంకలనం! ఇందులో మొత్తంగా 53 కథలు ఉన్నాయి. అన్నీ రచయిత్రులు రాసినవే! అనేక మంది సీనియర్ రచయిత్రులు మొదలుకొని యువ రచయిత్రుల వరకు 53 మంది అనేక దృష్టి కోణాల నుండి ఈ మాతృత్వం అనే అంశాన్ని తీసుకొని వివిధ సమస్యలు చర్చిస్తూ కథలను రచించారు. Continue reading
పరిచయం
ఒక దేశం యొక్క అభివృద్ధి ప్రక్రియలో విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు వ్యక్తిగత మరియు సమాజ అభివృద్ధి కోసం కొత్త జ్ఞానం మరియు నైపుణ్యాల పెంపుదలతో మరియు చివరికి వృత్తిపరమైన మరియు సామాజిక చలనశీలతతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఒక దేశం యొక్క పురోగతిని అంచనా వేయడానికి విద్య ఉత్తమ మార్గం. Continue reading
మహిళలు, బాలికలపై హింస ప్రపంచంలో అత్యంత ప్రబలంగా, విస్తృతంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలలో ఒకటిగా మిగిలిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఔనూ) ప్రచురించిన అంచనాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా మూడో వంతు స్త్రీలు తమ జీవిత కాలంలో శారీరక లేదా లైంగిక సన్నిహిత భాగస్వామి హింస లేదా భాగస్వామి కాని లైంగిక హింసకు గురయ్యారని సూచిస్తున్నాయి. Continue reading
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో రచయిత్రులకు కొదవలేదు. అన్ని ప్రక్రియల్లోనూ తమదే పైచేయిగా చాటి చెప్పారు. అలా చాటిచెప్పిన రచయిత్రుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రచయిత్రి డా. మాలతీ చందూర్. ఈమె నవలా రచయిత్రిగా, కథా రచయిత్రిగా, శీర్షికా రచయిత్రిగా, పాఠకులను మెప్పించేలా వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించిన వ్యక్తిగా తెలుగు పాఠక లోకంలో చిరస్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. Continue reading
(బాలికా దినోత్సవ సందర్భంగా)
అమ్మాయి! నువ్విప్పుడు ఆడపిల్లవే కాదు..
ఆకాశంలో ఎగిరే స్వేచ్ఛా విహంగానివి Continue reading
మరి కాస్త స్వేచ్ఛ మాకుంటే
పుట్టక ముందే గిట్టిపొయేలా చేసే మానుష-కర్కశత్వాన్ని కాదని
జీవించే అవకాశం మాకు దక్కేది – మా బలగం మరికొంత పెరిగేది! Continue reading