ప్రత్యామ్నాయ చరిత్రకారిణి విజయభారతి – డా॥ సంగిశెట్టి శ్రీనివాస్‌

ప్రత్యామ్నాయ చరిత్రను రాయడానికి పరిశోధన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ప్రచారంలో ఉన్నటువంటి విషయాలను పక్కకుతోసి సత్యాలను నిలబెట్టడానికి గ్రంథవనరులు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇట్లా దొరికిన ఆధారాలను కన్విన్సింగ్‌గా చెప్పడం ఒక కళ. ఈ కళలో నిష్ణాతులు, ఆల్టర్నేటివ్‌ చరిత్ర నిర్మాత, సబాల్టర్న్‌ విదుషీమణి బోయి విజయభారతిగారు. Continue reading

Share
Posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి | Leave a comment

సామాజిక చింతనా మాతృమూర్తి – డా॥ గూడూరు సీతా మహాలక్ష్మి

డా. విజయభారతిగారి గురించి చెప్పాలంటే గొంతుకేదో గీరబోయినట్లు అనిపిస్తోంది. చాలా వేదనగా కూడా వుంది. నిన్న మొన్న కలిసిన మనిషి, కళ్ల ముందు సజీవంగా నిలిచిపోయిన మనిషి, ఇవాళ భౌతికంగా మనమధ్య లేరు అనేది నాకైతే వ్యక్తిగతంగా జీర్ణించుకోలేని అంశం. Continue reading

Share
Posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి | Leave a comment

మౌనంగానే ప్రభావవంతమైన ముద్రను మిగిల్చిన డా బి. విజయభారతి – డా నాగసూరి వేణుగోపాల్‌

ముఖాముఖి కన్నా ఉత్తరాల ద్వారా, టెలిఫోన్‌ ద్వారానే డా. బోయి విజయభారతి గారు పరిచయం. దశాబ్దంన్నర క్రితం తనను నేరుగా కలిసినప్పుడు ఇంత మృదువుగా, ఆప్యాయంగా వీరు ఉంటారా అని అనిపించింది! Continue reading

Share
Posted in Uncategorized | Tagged | Leave a comment

డిసెంబర్ 2024

డిసెంబర్ 2024

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ఈ ఆదివాసీల సంస్కారం అనితరసాధ్యం – కొండవీటి సత్యవతి

రంపచోడవం దగ్గరలో అదొక ఆదివాసీ గ్రామం. చుట్టూ కొండలతో, పచ్చటి చెట్లతో అడవి మధ్యలో ఉన్న గ్రామం. గత ఆరు నెలల నుండి ఈ గ్రామాల్లో పనిచేయడం మొదలు పెట్టాం. మహిళలతో తరచుగా సమావేశాలు పెడుతున్నాం. ఆ రోజు కూడా మహిళలతో మాట్లాడాలని ఉదయమే ఆ గ్రామం చేరుకున్నాం. పనులు తొందరగా పూర్తి చేసుకుని ఒక్కొక్కరూ రాసాగారు. Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

వొట్టిమాటలు కట్టిపెట్టండి – వి.శాంతి ప్రబోధ

లోపలికి వస్తున్న యాదమ్మను చూస్తూ ‘‘ఆరోగ్యం బాగోలేదా?’’ అత్తగారి ప్రశ్న.
మౌనంగా లోపలికి పోయి చేట చీపురుతో వచ్చింది యాదమ్మ. కళ్ళు బాగా ఉబ్బి, నుదుట బొప్పి కనిపిస్తున్నాయి. నడకలో కూడా తేడా ఉంది. Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

లీషాయనమః – ఆపర్ణ తోట

ఏం చెయ్యాలో చెప్పు
ఎలా ఉండాలో చెప్పు
ఏం వేసుకోవాలో చెప్పు Continue reading

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ఆదివాసీ మహిళల జనజీవనం-వర్తమానం – అనూరాధ. బి

భారత రాజ్యాంగంలోని 342 వ ఆర్టికల్‌ కింద ఇప్పటిదాకా నమోదైన ఆదివాసీ తెగలు 700కి పైన ఉన్నాయి. నమోదు కాని వాటి సంఖ్య ఇంకా చాలా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆదివాసీ జనాభా మొత్తం జనాభాలో 8.6%గా ఉంది. అంటే దాదాపు 10.4 కోట్లు. భారత దేశంలో ఉన్న తెగలన్నీ ఒకేలాగా లేవు. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గాయం – డా.మజ్జిభారతి

‘‘డాక్టరుగారూ! మీతో అర్జెంటుగా మాట్లాడాలి’’ చెప్పాడు కిరణ్‌ సైకియాట్రిస్ట్‌ శ్రీధర్‌ కు.
‘‘సార్‌! జ్యోతి మీద చెయ్యేస్తే అంతవరకు మామూలుగానే ఉన్న జ్యోతి ఏదో శక్తి ఆవహించినట్లు నన్ను విసిరి కొడుతుంది. నేను కూడా బాక్సింగ్‌ ఛాంపియన్‌ ను కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకరైతే ఈసారికి హాస్పిటల్లో అడ్మిట్‌ అవ్వాల్సి వచ్చేది.’’ Continue reading

Share
Posted in కధలు | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…)
` అనువాదం: ప్రభాకర్‌ మందార
ఈ ఎమర్జెన్సీ గందరగోళంతో మేం కాలేజీని మధ్యలోనే వదిలెయ్యాల్సి వచ్చింది, దాంతో ఇక మాకు పార్టీతో సంబంధం లేని ఇతర మిత్రులను కలిసే అవకాశమే లేకుండా పోయింది. చుట్టూ గిరి గీసినట్లు, మా ప్రపంచం చాలా చిన్నదైపోవటంతో.. క్రమంగా జీవితం నిరాసక్తంగా కూడా మారటం మొదలైంది. ఎమర్జెన్సీకి ముందు పగటి పూటైనా జనాల్ని కలుసుకునేవాళ్లం. Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

బాన్స్‌వాడాలో ఇంట్లో ఒంటరిగా… – స్వదేశ శర్మ

పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా
అనువాదం: సుధామయి సత్తెనపల్లి
బాధల వలస బాల్యాన్ని ఎప్పటికీ మారుస్తుంది. బాలల దినం సందర్భంగా ఒక కథనం.
కిరణ్‌ వంట చేస్తుంది, ఇంటిని శుభ్రం చేస్తుంది, ఇంటిని నడుపుతుంది. ముంచుకొస్తోన్న ఎండాకాలం వలన వెళ్ళాల్సిన దూరాలు పెరుగుతున్నప్పటికీ, ఆమె కట్టెలనూ నీటినీ సేకరించి, వాటిని ఇంటి వరకూ మోసుకొస్తుంది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నది నుండి సముద్రం వరకు: స్వతంత్రం అవ్వాలి పాలస్తీనా – ప్రవీణ్‌ కొల్లుగురి

కొన్ని రోజుల క్రితం ప్రొ. కంచ ఐలయ్య షెఫర్డ్‌ గారు ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధంపై సాక్షి పత్రికలో రాసిన ‘‘రెండు దేశాలుగా బతకడమే దారి’’ అనే కథనం కొన్ని కీలక విషయాలపై అవగాహన పెంచి, ఇజ్రాయెల్‌ మరియు పాలస్తీనా సమస్యను పరిష్కరించే మార్గాన్ని సూచించేందుకు చేసిన ప్రయత్నం అయినప్పటికీ, ఈ సమస్యను చూస్తున్నప్పుడు పలువిధమైన వాస్తవాలను విస్మరించడం కూడా మానవాళికి ప్రమాదకరం అని భావించి, Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పేదరిక నిర్మూలన బౌద్ధ ఆచరణలతో సాధ్యం – డా.సి.హెచ్‌. వెంకటశివసాయి

బౌద్ధ మతం మరియు ఆర్ధిక శాస్త్రానికి సంబంధించిన బుద్ధుడు బోధించినట్లు మరెవరు చెప్పలేదు. బుద్ధుని కాలంలో సమాజాలు సహజ ప్రపంచంలో వాటి స్ధానానికి మరింత లోతుగా పాతుకుపోయాయి. ఆర్ధిక వ్యవస్థలు ఇతరుల మాటలలో మరింత స్థానికీకరించబడ్డాయి. ప్రజల మధ్య మరియు సంస్కృతి మరియు ప్రకృతి మధ్య సంబంధాలు సాపేక్షంగా ఉండేవి. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వెలుగు దారుల ప్రజాస్వామ్య ప్రస్థానం – టి. అనురాధ

ఈ పుస్తకంలో రచయిత, అనిశెట్టి సాయి కుమార్‌ గారు ప్రాచీన గ్రీకు దేశం నుంచి మొదలై నేటి ఆధునిక ప్రభుత్వాల వరకు విస్తరించిన ప్రజాస్వామ్య భావన పుట్టుక పరిణామం, వివిధ దశలు అలాగే నేటి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థగా ఎలా నిలబడిరదో చక్కగా విశదీకరించారు. Continue reading

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

చిన్నోడికి ప్రేమతో – నాదెళ్ళ అనూరాధ

అక్షరానికున్న గొప్పదనం నిర్వచించలేనిది. వాటిని పొదువుకున్న పుస్తకాలు చేసే మేలు గురించి చెప్పటం అంత సులువు కాదు. పేరుకి తగినట్టే అక్షరం తన ప్రభావాన్ని చదువరి మీద గాఢంగా వేస్తూ మనసుల్లో నిలబడిపోతుంది. చదివిన విషయాలు సందర్భానుసారంగా మనల్ని ఆలోచించేలా చేసి సరైన దిశా నిర్దేశం చేస్తూండటం అనుభవంలోకి వచ్చే విషయమే. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మనిషితనంపై మమకారం – అస్తిత్వంకై ఆరాటం బిట్ల అంజనీ దేవి కవిత్వం! – సింగరాజు రమాదేవి

‘మనసెందుకో సున్నితం’ పేరుతో బిట్ల అంజనీ దేవి రచించి వెలువరించిన కవితా సంపుటిలో మొత్తం యాభై కవితలు ఉన్నాయి. ఈ కవితల్లో వైవిధ్యమైన వస్తు ఎంపిక ఉంది. మనిషితనంపై మమకారం ఉంది. వర్గ స్పృహ ఉంది. రాజకీయ చైతన్యం ఉంది. ప్రకృతి ప్రేమ ఉంది. సామాజిక స్పృహ ఉంది. స్త్రీవాద చైతన్యం ఉంది. అస్తిత్వ ప్రకటన ఉంది. అన్నిటినీ మించి నిజాయతీగా స్పందించే హృదయం ఉంది. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment