-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
కుల పితృస్వామ్యానికి వైద్యం చేసిన జ్యోతి లింగమ్మ – డా|| చల్లపల్లి స్వరూపరాణి
అవి 19వ శతాబ్దపు చివరి రోజులు. ఒకపక్క బ్రిటిష్ పాలనలో ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అర్రులు చాస్తుంటే సామాజిక అంతస్తుల్లో ఆఖరి మెట్టుపైన ఉన్న కులాలు, అంటరానితనం, వెట్టిచాకిరీ, అవిద్య చుట్టుముట్టిన చీకటి కుహరంలో దుర్భరమైన పీడనను అనుభవి స్తున్నారు. చదువంటే కేవలం అగ్రహారాలలో పుట్టి పెరిగిన వారికి తప్ప ఇతరులకు అంతగా అందుబాటులోకి … Continue reading
Posted in మిణుగురులు
Leave a comment
మనోవ్యాధికి మందుంది – శివరాజు సుబ్బలక్ష్మి
డాక్టర్ మాధవరావు ఆ ఊరొచ్చి ఐదారు నెలలే అయినా మంచి పేరు తెచ్చుకున్నాడు. పేదవాళ్ళను ఎంతో దయగా చూసేవాడు. ఆ హాస్పిటల్‌లో అతనితో కలిసి పనిచేస్తున్న లేడీ డాక్టర్ కమల మొదట్లో ఇదంతా పేరు కోసం తెచ్చిపెట్టుకున్న ప్రవర్తన అనుకున్నా, తర్వాత్తర్వాత అతని పట్ల గౌరవభావం చూపసాగింది. ఆ రోజు మధ్యాహ్నం తాను హాస్పిటల్‌కి రానని … Continue reading
Posted in కథలు
Leave a comment
మట్టిగోడల మధ్య గడ్డిపోచ – శివరాజు సుబ్బలక్ష్మి
ఆ ఏడు వేసంగి ఎండలు మండిపోతున్నాయి. పొద్దువాలినా వేడి తగ్గలేదు. పసిపిల్లలు తట్టుకోలేక కంఠం జారిపోయేలా గోలపెడుతున్నారు. ముసలి అవ్వ ఆపుకారా పక్కన పెట్టుకుని కంఠం తడుపుకుంటూ తడిబట్ట వంటికి చుట్టుకు వచ్చే పోయేవాళ్ళని ”టైం ఎంతయిందర్రా” అంటూ గడుపుతోంది.
Posted in కథలు
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
ఉదయాన్నే చల్ల చిలికే చప్పుడికి నిద్ర లేస్తుంది శారద. అప్పటికే దాసి వచ్చి ఇంటి ముందంతా ఒత్తుగా పేడ కళ్ళాపి చల్లేస్తుంది. ఈ మధ్యనే నరసమ్మ శారదకు ముగ్గులు వేయటం నేర్పింది. ధనలక్ష్మి కూడా చాలా నేర్పింది. శారదా వాళ్ళింటి ముందున్నంత చోటు ఎవరింటి ముందూ లేదు. ఆ చోటంతా ముగ్గులు పెట్టటంలో అమిత శ్రద్ధ … Continue reading
Posted in ధారావాహికలు
Leave a comment
గర్భిణీల వార్డు – అయోధ్యా రెడ్డి
డోరిస్ లెస్సింగ్ (1919-2013) పరిచయం : సుప్రసిద్ధ బ్రిటన్ రచయిత్రి, నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత డోరిస్ లెస్సింగ్, 1919 అక్టోబర్‌లో పెర్షియా (ఇరాన్)లోని కెర్మాన్ షాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ బ్రిటిష్ సంతతివాళ్ళే. చాలాకాలం రొడేషియా (ప్రస్తుత జింబాబ్వే)లో నివసించి తొలుత నర్స్ మెయిడ్‌గా, టెలిఫోన్ ఆపరేటర్‌గా పనిచేశారు. అక్కడే ఆమె సాహిత్య సృజనకు … Continue reading
Posted in అనువాదాలు
Leave a comment
సాహిత్య కళా విదుషీమణి శివరాజు సుబ్బలక్ష్మి – శీలా సుభద్రాదేవి
పన్నెండో ఏట శివరాజు వేంకట సుబ్బారావు (బుచ్చిబాబు) చిటికెనవేలు పట్టుకొని సంసార బంధంలోకి వచ్చిన సుబ్బలక్ష్మిగారు… కథకుడు, చిత్రకారుడు అయిన బుచ్చిబాబు భార్యగా మాత్రమే ఒదిగిపోలేదు. బుచ్చిబాబు గారి స్ఫూర్తితోనే కలం, కుంచె చేతిలోకి తీసుకొని ఒక చేత కథలల్లటం మొదలుపెట్టి ‘కావ్య సుందరి కథ, ఒడ్డుకు చేరిన కెరటం, మనోవ్యాధికి మందుంది, మగతజీవి చివరి … Continue reading
Posted in నివాళి
Leave a comment
నివాళి
శివరాజు సుబ్బలక్ష్మిగారికి నివాళి 2018లో నేను మొదటిసారి శివరాజు సుబ్బలక్ష్మిగారిని చూసాను. అమృతలత ప్రతి సంవత్సరం అందించే అపురూప అవార్డ్స్ ఫంక్షన్‌కి సుబ్బలక్ష్మిగారి ఆత్మీయ అతిధిగా వచ్చారు. ఆ రోజు అవార్డ్స్ ఫంక్షన్ పూర్తవ్వగానే స్టేజి మీదకి వెళ్ళి తనని కలిసాను. అప్పటికే చాలా ఆలస్యం అవ్వడం వల్ల ఎక్కువ సేపు మాట్లాడటానికి కుదరలేదు. నాకేమో … Continue reading
Posted in నివాళి
Leave a comment
మమతల మల్లెలు – శ్రీలత అలువాల
మల్లెల సువాసనలను తన కథల ద్వారా వెదజల్లాలని ఆకాంక్షిస్తూ డా||తాళ్ళపల్లి యాకమ్మ గారు కథా రచనను మొదలు పెట్టారనిపిస్తుంది. తన అనుభవాలను రంగరించి పాఠకులకు తమ జీవితంలోని సంఘటనలను గుర్తుచేసే విధంగా ఈ కథలు కొనసాగుతాయి. అణగారిన వర్గంలో పుట్టిన దళిత బిడ్డగా, ఒక సగటు మహిళగా తన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడానికి తాను పడ్డ … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
అత్యాచారం వ్యక్తిగతం కాదు… సామాజిక నేరం – షేక్ పీర్ల మహమూద్
ఓ బూర్జువా సమాజం నిర్మించే చట్టాలతో నేరాలను ఏ మేరకు కట్టడి చేయగలం? ఈ సమాజానికి ఇంకో అదనపు కోర కూడా ఉంది. అది పితృస్వామ్యం. పురుషుల ఆధీనంలో నడిచే వ్యవస్థ స్త్రీల సహజ హక్కులను కాపాడగలదా? మగాడు కేంద్రంగా తయారు చేయబడిన ఏ చట్టమూ సరిగా పనిచేయదు. వరకట్న నిషేధ చట్టం దీనికో ఉదాహరణ. … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
కార్పొరేట్ల కబంధ హస్తాల్లో వ్యవసాయం -ఎ.నర్సింహారెడ్డి
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో, ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతున్న వేల ప్రజల ప్రాణాలను ఎంత మాత్రం పట్టించుకోని మోడీ ప్రభుత్వం తన ఆశ్రితుల కోసం, స్వదేశీ విదేశీ వ్యవసాయ వాణిజ్య సంస్థల కోసం రైతులను సంక్షోభంలోకి నెట్టే అతి ప్రమాదకరమైన మూడు వ్యవసాయ చట్టాలు చేయడం దారుణం. ఆదరాబాదరా తెచ్చిన చట్టాలు … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
శివరాజు సుబ్బలక్ష్మి కథలు -పి. సత్యవతి
స్వాతంత్య్రానికి పూర్వమూ, తొలి దినాలలోనూ ఆంధ్రదేశంలో గ్రామీణ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలలో ఆడపిల్లల జీవితాలను రికార్డు చేసిన కథలు శివరాజు సుబ్బలక్ష్మి గారివి. ఆమె ఆ ఆడపిల్లలలో ప్రవేశించి వారి ఆకాంక్షలను, ఆవేదనలను అనుభవించి వ్రాసినట్లే ఉంటాయవి. 1925లో జన్మించిన సుబ్బలక్ష్మి చిన్నప్పుడు సంస్కృతం చదువుకుని తరువాత ప్రైవేటుగా మెట్రిక్ వరకూ చదివారు. ఇంట్లో … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
‘రామప్ప’ ఆలయం – నాంపల్లి సుజాత
ఏ మాటకామాటే… నామట్టుకు నేను దేవాలయాల సందర్శన కాస్తా తక్కువే…! అదీ అక్కడి సహజ సుందర దృశ్యాలను ఆస్వాదించడానికే తప్ప…
Posted in కవితలు
Leave a comment
విష సంస్కృతికి గోరీ కట్టాలి – ఎం.డి. ఖాజామొయినుద్దీన్
ఉత్తర భారతమంతా చితి మంటలు, మనువాద పాలనలో. కామాంధులు రేప్ చేసి, హత్యలతో, హీరోల్లా ఊరేగుతున్నారు. పురుషులు మహిళలను
Posted in కవితలు
Leave a comment
భూమిక – ఎల్. రాజాగణేష్
పురాణాల్లో పూజలందుకొనేది ఆదిశక్తే కానీ ఈ దేశంలో మగాడి చేతుల్లో ఈనాటికీ ఆడది ఒక పనిమనిషి! మరమనిషి!! కొందరికైతే వాడి విసిరేసే వస్తువు!!
Posted in కవితలు
Leave a comment
పిల్లల భూమిక
పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక, అరవింద స్కూల్ అసెంబ్లీలో జరిగిన చర్చ తర్వాత చిన్నారులు వ్రాసిన వారి మనోభావాలు… నేను సంతోషంగా ఉన్నానా…
Posted in పిల్లల భూమిక
Leave a comment
