-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
October 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసాలు
వలస పాలనలో (1857 వరకు) స్త్రీ విద్య : ఒక సమీక్ష – డా|| కొట్టు శేఖర్
భారత ఉపఖండంలో సంస్కరణోద్యమం మరీ ముఖ్యంగా స్త్రీ విద్య వ్యాప్తి -సాధికారతలపై విస్తృతమైన అవగాహన, విమర్శనాత్మకమైన విశ్లేషణ, లోతైన పరిశీలన జరగాలంటే వలస పాలనలో-ప్రధానంగా బెంగాల్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైన నాటి నుండి (రమారమి 1765) ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత కంపెనీ నుండి అధికారం బ్రిటిష్ రాణికి బదిలీ అయిన నాటి … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
నాలుగ్గోడల నడుమ…. దేవి
”ప్రభుత్వం వెనువెంటనే చర్యలు తీసుకోకపోతే రానున్న తరంపై విధ్వంసకర ప్రభావం పడుతుంది.” బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు లాక్‌డౌన్ జరిగిన రెండు వారాల్లోగా చేసిన ఈ వ్యాఖ్య కరోనా గురించో విద్య గురించో కాదు. పెరుగుతున్న గృహ హింసపై అతని ఆందోళన ఇది. ఏప్రిల్ మొదటి వారంలో ఒక్క లండన్ నగరంలోనే గృహ హింసకు సంబంధించి నాలుగు … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
చరిత్రకెక్కని వీర వనిత టి.ఎన్.సదాలక్ష్మి – సిలపాక వెంకటాద్రి
చరిత్ర ఎప్పుడూ త్యాగాలమీదే పురుడు పోసుకుంటుంది. ఆ త్యాగాల నేల మీద చిందిన రక్తపు ఆనవాళ్ళు ప్రతిక్షణం తిరుగుబాటు సంకేతాన్ని ఎగురవేస్తూనే ఉంటాయి. అలా దళితుల త్యాగాల మీద పునాదులు వేసుకొన్న దొరల సర్కారు దళితుల పోరాటాలు, త్యాగాలు చరిత్రకెక్కకుండా కుట్ర చేశాయి. దళితుల అభివృద్ధి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి చివరి శ్వాస వరకు … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
లింగం, లైంగికత- సాహిత్యం, సంభాషణ – పూర్ణిమ తమ్మిరెడ్డి
(భూమిక సంస్థ వారు రెండు రోజుల పాటు లింగం-లైంగికత : సాహిత్యం, సంభాషణ అనే వర్క్‌షాప్‌ని నిర్వహించారు, జులై 10-11న. పాతికమందికి పైగా LGBTQLA+ కమ్యూనిటీ వారు, పది, పదిహేను మంది ఇతరులు (for once) ఇందులో పాల్గొన్నారు. పి.సత్యవతి, వసుధేంద్ర, వి.ప్రతిమ లాంటి దిగ్గజాలు తమ అనుభవాలను పంచుకున్నారు. లైంగికత మీద, సాహిత్యం గురించి … Continue reading
Posted in Uncategorized, వ్యాసాలు
Leave a comment
తండ్రి ప్రేమ : కొన్ని ప్రశ్నలు -ఎ.సునీత
దాదాపు సంవత్సరంన్నర క్రితం గర్భవతి అయిన కూతురు అమృత, భర్తతో కలిసి ఆస్పత్రికి చెకప్‌కి వెళ్తే, ఆమె కళ్ల ముందే స్వంత అల్లుణ్ణి చంపించిన మారుతీరావు రెరడు వారాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త విని మన సమాజంలో కొంత మంది దీన్ని తండ్రి ప్రేమకి పరాకాష్టగా వర్ణించారు. సంవత్సరం నిండని పసికందుని అత్తా మామల … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
దోర్నాదుల సుబ్బమ్మ రచనలు – మహిళాభ్యుదయం – కొండయ్య కోసూరు
పరిచయం : సింహపురి పరిధిలో ఆత్మకూరు మండల వాసి దోర్నాదుల సుబ్బమ్మ ”మోడుపడిన మూడు గుండెలు” (1958) నవలతో రచనకు శ్రీకారం చుట్టి సాహిత్యంలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సుబ్బమ్మ ఇంతవరకూ కథలు, కథానికలు, కవితలు, వ్యాసాలు, పాటలు, లేఖలు, నవలలు, శతకం, జీవిత చరిత్ర రాశారు. ఈమె రచనలన్నీ మహిళా నేపథ్యాన్ని … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
నాకు నచ్చిన సావిత్రిగారి కవిత ‘బందిపోట్లు’ ‘మహిళ’పై విశ్లేషణ డా|| బండారి సుజాత
రాజమండ్రికి పదిమైళ్ళ దూరంలో ఉన్న ‘ఉండేశ్వరపురం’ లోని దంతులూరి సూర్యనారాయణ రాజు, బుచ్చి సీతాయమ్మల ఆరవ సంతానంగా మే 18, 1949 లో జన్మించిన సావిత్రి అక్టోబర్ 4, 1991లో మరణించారు.
Posted in వ్యాసాలు
Leave a comment
అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం -భండారు విజయ
ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం ప్రకటించి ఇప్పటికి 110 సంవత్సరాలు అయింది. దీనికి స్ఫూర్తిని ఇచ్చిన ఘటన 1857వ సంవత్సరంలో మార్చి 8వ తేదీన న్యూయార్క్ నగరంలో జరిగింది. చికాగో మహానగరంలోని ఒక జౌళి మిల్లులో పనిచేస్తున్న శ్రామిక మహిళలు తాము పనిచేస్తున్న (12 గంటల నుండి 18 గంటల వరకు) … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
CAA – అస్సాం పౌరసత్వ సవరణ చట్టం -రమామేల్కోటే
పౌరసత్వ సవరణ చట్టాలకు అస్సాంలో ప్రారంభమైన వ్యతిరేకత దేశవ్యాప్తంగా ఆందోళన ఊపందుకుని మరింత ఉధృతమవుతున్నది. ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో, అన్ని రాష్ట్రాలలో ఈ ఉద్యమం ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని, కొత్త హంగులతో, ఒక సాంస్కృతిక ఉద్యమంలా మొత్తం దేశాన్నే కుదిపివేస్తున్నది. ఈ ఉద్యమంలో స్త్రీలు, ముస్లిం మహిళలు ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున పాల్గొనడమే … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
యురేనియం – ‘ఉరే’ నయం -పర్చా కిషన్‌రావు
(అవును… ఇది వట్టిమాట కాదు. ప్రపంచవ్యాప్తంగా యురేనియం ఖనిజం వెలికితీత, శుద్ధి, వినియోగాలలో ఎదురైన వాస్తవానుభవాల నుంచి చెప్తున్న మాట. అణువిద్యుత్ కర్మాగారాల వల్ల ఉపయోగాల మాట ఎలా ఉన్నా, వాటినుంచి వెలువడుతున్న అణుధార్మికత కలిగిన
Posted in వ్యాసాలు
Leave a comment
నిశ్శబ్దమే పెను విస్ఫోటనం : అరుంధతీ రాయ్ -చైతన్య చెక్కిళ్ళ
(370 ఆర్టికల్ రద్దు సందర్భంగా ‘న్యూయార్క్ టైమ్స్’కు అరుంధతీ రాయ్ రాసిన వ్యాసం) భారతదేశం 73వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో, ఢిల్లీ ట్రాఫిక్‌లో చిరిగిన బట్టలతో వీథిబాలలు పెద్ద పెద్ద జాతీయ జెండాలను, ‘నా భారతదేశం గొప్పది’ అనే జ్ఞాపికలను అమ్ముతుంటారు. నిజం చెప్పాలంటే, మన ప్రభుత్వం దగుల్బాజీగా
Posted in వ్యాసాలు
Leave a comment
పారిశ్రామికీకరణ – కార్మిక స్థితిగతులు -కవిని ఆలూరి
భారత ఆర్థికాభివృద్ధికి ఎదురవుతున్న సమస్యలకు గల కారణాలను పరిశీలించి, ”సరళీకరణ మీదనే ఎక్కువ కేంద్రీకరించి మిగతా రంగాలన్నింటినీ పట్టించుకోకపోవడం వల్ల అంటే అసమాన కేంద్రీకరణ వలన భారీగా నష్టపోతున్నాము” అని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. అంటే మన దేశ ఆర్థికాభివృద్ధిలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, కుటీర
Posted in వ్యాసాలు
Leave a comment
బ్రతుకునిచ్చేది నల్లమల, ఉసురు తీసేది యురేనియం -డా. కె.బాబూరావు
తెలంగాణలో యురేనియం అలజడి మళ్ళీ మొదలయింది. 2005లో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంబాపూర్‌లలో ప్రతిపాదించిన యురేనియం తవ్వకాలనీ, మొదట మల్లాపురం, తరువాత శేరిపల్లిలలో ప్రతిపాదించిన యురేనియం శుద్ధి కర్మాగారాన్నీ, ప్రజల తీవ్ర
Posted in వ్యాసాలు
Leave a comment
మారుతున్న లైంగికత – కొత్త హక్కుల చర్చ -ఎ. సునీత
ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన వసంత లక్ష్మి, కృష్ణ గార్లకి నా కృతజ్ఞతలు. పౌర హక్కులు, మానవ హక్కుల ఉద్యమంలో రాజకీయాల గురించి నేర్చుకున్న నాకు ఇక్కడ మాట్లాడటం ఒకరకంగా స్వంత ఇంటికి రావటం వంటిది. ఈ రోజు బాలగోపాల్ ఇక్కడ ఉండి
Posted in వ్యాసాలు
Leave a comment
పురాణాలు – చరిత్ర -చల్లపల్లి స్వరూపరాణి
‘Until the lion learns how to write, every story glorifies the hunter’ – African Proverb. రామాయణ, మహాభారతాలు, పురాణాలు, భగవద్గీత, మనుస్మృతి, పద్దెనిమిది పురాణాలు బ్రాహ్మణీయ వర్గాలు తమ వాదానికి అనుకూలంగా, తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి,
Posted in వ్యాసాలు
Leave a comment
పితృస్వామ్యం ఛాయ నుండి స్వీయ వ్యక్తిత్వం దిశగా -మందరపు హైమవతి
స్త్రీ వాదం మొదలవకముందే స్త్రీల పట్ల సహానుభూతితో రచనలు చేసిన అబ్బూరి ఛాయాదేవి గారు బహుముఖ ప్రజ్ఞావంతురాలు. కథ, నవల, వ్యాసం, యాత్రాచరిత్ర, విమర్శ, కాలమ్ రచయిత్రిగా విభిన్న ప్రక్రియల్లో రచనలు చేసి తనదైన ముద్ర వేశారు.
Posted in వ్యాసాలు
Leave a comment
