-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసాలు
కార్పొరేట్లకు ప్రత్యామ్నాయం సహకార సంఘాలే – కన్నెగంటి రవి
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రైతాంగ ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతున్నది. కేంద్రం ఏకపక్షంగా రైతుల ఆకాంక్షలను, అన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలను పక్కనపెట్టి తనకున్న బండ మెజారిటీతో ఆమోదించిన 3 వ్యవసాయ రంగ చట్టాలు, దేశంలో చర్చకు పెట్టిన విద్యుత్ బిల్లు 2020 గ్రామీణ ప్రజలలో భయాందోళనలను రేకెత్తించాయి. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా, కేంద్ర ప్రభుత్వం … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
వ్యవసాయ చట్టాలు ఎవరికి చుట్టాలు – అబ్దుల్ వాహెద్
భారతీయ జనతా పార్టీపై రైతులు మండిపడుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తున్న వాస్తవం. రైతుల ఆగ్రహం ఇప్పుడు బీజేపీకి, ఎన్డీయేలో మిత్రపక్షాలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సవాలుగా మారవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లోని రైతులే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ, పంజాబ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
దేశంలో కొత్త రైతు చట్టం – దాని పరిణామాలు – ఎర్రోజు శ్రీనివాస్
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలను, వాటి పర్యవసానాలను తెలుసుకునే కంటే ముందు పాత చట్టం ఏమి చెబుతుందో కూడా పరిశీలిద్దాం. భారతదేశంలో గల భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక భిన్నత్వాన్ని రూపుు మార్చాలని, దేశాన్ని ఏకరూప రాజ్యాంగా మార్చాలని అనుకునే కుట్రలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా నూతన చట్టాలు రూపొందించబడ్డాయి. ఇది … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
విస్మృత కథారచయిత్రి – వేదుల మీనాక్షీదేవి శీలా సుభద్రాదేవి
ఆధునిక సాహిత్యరంగంలో స్వాతంత్య్రానంతరం అధిక సంఖ్యలోనే మహిళలు సాహిత్య రంగంలోకి వచ్చారు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే దానికి సమాంతరంగా స్త్రీ విద్యపై కూడా మహిళలు కొంత ఉద్యమస్ఫూర్తితో రచనలు చేయటం కావచ్చు, స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు కావటం వలన కావచ్చు, సాంస్కృతికంగా, ఆర్థికపరంగా వెసులుబాటుగల కుటుంబాలలోని స్త్రీలకు విద్యావంతులయ్యే అవకాశం లభించింది. … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
అసలు యుద్ధం దేనిపైనా?! -దేవి
”లవ్ జిహాద్” ఆర్డినెన్స్ తెచ్చేసింది యు.పి. యోగి సర్కారు. ఈ అరుపు ఇవ్వాళ కొత్తగా మొదలు కాలేదు. భాజపా ప్రభుత్వాల చేతకానితనం, అసమర్ధత, పరిపాలనలో అవకతవకలు బయటపడినప్పుడల్లా సంఘ్ పరివార్‌లోని ఏదో ఒక అంశం భజరంగ్‌దళ్ లేదా విశ్వ హిందూ పరిషత్ గొంతు చించుకొని లవ్ జిహాద్ అంటూ రంకె వేస్తుంది.
Posted in వ్యాసాలు
Leave a comment
మనకు మనమే ప్రతిధ్వనులుగా ఉండిపోవద్దు -మమత కొడిదెల
”నువ్వు బిఎల్‌ఎమ్ ను సమర్ధిస్తావు కదా. మరి రామ మందిరాన్ని ఎందుకు సమర్ధించవు?” వాట్సాప్ గ్రూప్‌లో సౌమ్యంగా అడిగింది ఇరవై ఐదేళ్ళ క్రితం కాలేజిలో పరిచయమైన స్నేహితురాలు. తల తిరిగిపోయే ఇలాంటి ఉపమానాలు ఈ మధ్య దాదాపు ప్రతిరోజూ వింటూనే ఉన్నా. విన్న ప్రతిసారీ కోసుకుపోతున్నట్లుండే నొప్పి గుండెలో. హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారని ఇన్నాళ్ళూ అనుకున్న స్నేహితుల … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
కోవిడ్-19, లాక్‌డౌన్ సమయంలో మహిళలపై పెరిగిన గృహ హింస -కందగట్ల శ్రవణ్ కుమార్
పితృస్వామ్య అధికారం ఆధారంగా ఏర్పడిన లింగ విభజనలో భాగంగా పుట్టిన గృహ హింసలో అనేక కోణాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళలలో ఒకరు వారి జీవిత కాలంలో శారీరక లేదా లైంగిక హింసను అనుభవిస్తున్నారు. వైవాహిక సంబంధాలలో ఉన్న మహిళల్లో కనీసం 30 శాతం తమ భాగస్వాములచే … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
శృంగార దేవత మార్లిన్ మన్రో -రొంపిచర్ల భార్గవి
మార్లిన్ మన్రో పేరు చెప్పగానే కలల్లో తేలిపోయి వెర్రెక్కిపోయే అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. ఆమె చనిపోయి సుమారు 58 ఏళ్ళయినా అత్యత ప్రజాదరణ పొందిన శృంగార తారగా ఆమె స్థానం చలన చిత్ర ప్రపంచంలో ఈనాటికీ చెక్కుచెదరలేదు. అంతేకాదు అది ఎప్పటికీ చెరిగిపోలేని శాశ్వత స్థానమే అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చలన … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
వ్యవసాయ రంగంపై నోట్ మరియు నిర్దిష్ట డిమాండ్లు – ప్రజా అసెంబ్లీ
తెలంగాణా ప్రజా అసెంబ్లీ – 2020 సెప్టెంబర్ 4, 5, 6 తెలంగాణ వ్యవసాయ రంగం గురించి, గ్రామీణ ప్రాంతం గురించి మాట్లాడుకోవడం అంటే రాష్ట్రంలో 65 శాతం జనాభా గురించి చర్చించడం. రాష్ట్ర ఆహార భద్రత గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుకోవడం. మొత్తంగా మెజారిటీ ప్రజల జీవనోపాధుల గురించి మాట్లాడుకోవడం. ఇంత కీలక … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ప్రజారోగ్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక శ్రద్ధ పెట్టాలి – ప్రజా అసెంబ్లీ
సరిపడినంత సురక్షితమైన పోషకాహారము, సురక్షితమైన నీరు, స్వచ్ఛమైన గాలి వంటివి లేని పరిస్థితులలో, ప్రజలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజారోగ్య వ్యవస్థ నిర్లక్ష్యానికి గురై, ప్రైవేటు కార్పొరేట్ శక్తులు వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చివేయడంతో వైద్య ఖర్చులు … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
తెలుగులో చైతన్యగీతాలు – సామాజిక అవగాహన సూరేపల్లి పద్మావతి
ఒకనాటి సామాజికి స్థితిగతులను అంచనా వేయడానికి సాహిత్యం ఎంతగానో తోడ్పడుతుంది. సమాజానికి, సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంది. సమాజంలోని స్థితిగతులు సాహిత్య ప్రక్రియల్లో ప్రతిఫలించబడతాయి. సాహిత్య ప్రక్రియలు అనగా నవల, కథ, వచన కవిత్వం మరియు గేయం ఏదైనా కావచ్చు. ఈ సాహిత్య ప్రక్రియల్లో సమకాలీన సామాజిక స్థితిగతులను అత్యంత ప్రభావవంతంగా ప్రజల ముందు
Posted in వ్యాసాలు
Leave a comment
వలస పాలనలో (1857 వరకు) స్త్రీ విద్య : ఒక సమీక్ష – డా|| కొట్టు శేఖర్
భారత ఉపఖండంలో సంస్కరణోద్యమం మరీ ముఖ్యంగా స్త్రీ విద్య వ్యాప్తి -సాధికారతలపై విస్తృతమైన అవగాహన, విమర్శనాత్మకమైన విశ్లేషణ, లోతైన పరిశీలన జరగాలంటే వలస పాలనలో-ప్రధానంగా బెంగాల్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైన నాటి నుండి (రమారమి 1765) ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత కంపెనీ నుండి అధికారం బ్రిటిష్ రాణికి బదిలీ అయిన నాటి … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
నాలుగ్గోడల నడుమ…. దేవి
”ప్రభుత్వం వెనువెంటనే చర్యలు తీసుకోకపోతే రానున్న తరంపై విధ్వంసకర ప్రభావం పడుతుంది.” బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు లాక్‌డౌన్ జరిగిన రెండు వారాల్లోగా చేసిన ఈ వ్యాఖ్య కరోనా గురించో విద్య గురించో కాదు. పెరుగుతున్న గృహ హింసపై అతని ఆందోళన ఇది. ఏప్రిల్ మొదటి వారంలో ఒక్క లండన్ నగరంలోనే గృహ హింసకు సంబంధించి నాలుగు … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
చరిత్రకెక్కని వీర వనిత టి.ఎన్.సదాలక్ష్మి – సిలపాక వెంకటాద్రి
చరిత్ర ఎప్పుడూ త్యాగాలమీదే పురుడు పోసుకుంటుంది. ఆ త్యాగాల నేల మీద చిందిన రక్తపు ఆనవాళ్ళు ప్రతిక్షణం తిరుగుబాటు సంకేతాన్ని ఎగురవేస్తూనే ఉంటాయి. అలా దళితుల త్యాగాల మీద పునాదులు వేసుకొన్న దొరల సర్కారు దళితుల పోరాటాలు, త్యాగాలు చరిత్రకెక్కకుండా కుట్ర చేశాయి. దళితుల అభివృద్ధి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి చివరి శ్వాస వరకు … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
లింగం, లైంగికత- సాహిత్యం, సంభాషణ – పూర్ణిమ తమ్మిరెడ్డి
(భూమిక సంస్థ వారు రెండు రోజుల పాటు లింగం-లైంగికత : సాహిత్యం, సంభాషణ అనే వర్క్‌షాప్‌ని నిర్వహించారు, జులై 10-11న. పాతికమందికి పైగా LGBTQLA+ కమ్యూనిటీ వారు, పది, పదిహేను మంది ఇతరులు (for once) ఇందులో పాల్గొన్నారు. పి.సత్యవతి, వసుధేంద్ర, వి.ప్రతిమ లాంటి దిగ్గజాలు తమ అనుభవాలను పంచుకున్నారు. లైంగికత మీద, సాహిత్యం గురించి … Continue reading
Posted in Uncategorized, వ్యాసాలు
Leave a comment
తండ్రి ప్రేమ : కొన్ని ప్రశ్నలు -ఎ.సునీత
దాదాపు సంవత్సరంన్నర క్రితం గర్భవతి అయిన కూతురు అమృత, భర్తతో కలిసి ఆస్పత్రికి చెకప్‌కి వెళ్తే, ఆమె కళ్ల ముందే స్వంత అల్లుణ్ణి చంపించిన మారుతీరావు రెరడు వారాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త విని మన సమాజంలో కొంత మంది దీన్ని తండ్రి ప్రేమకి పరాకాష్టగా వర్ణించారు. సంవత్సరం నిండని పసికందుని అత్తా మామల … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
