Daily Archives: November 5, 2025

నవంబర్ 2025

నవంబర్ 2025

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

లింగాధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల ప్రచారోద్యమం – కొండవీటి సత్యవతి

ప్రతి సంవత్సరం నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీల పరంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్‌ అగెన్‌స్ట్‌ విమెన్స్‌ డే’ అంటూ మొదలై అంతర్జాతీయ మానవహక్కుల దినం డిసెంబరు … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

నేనోడిపోను – డా. మజ్జి భారతి

ఒంటరితనం మనుషులను చంపెయ్యగలదని యిప్పటికే అనుభవంలోకి వచ్చింది సుమిత్రకు. అది బ్రతకడానికి కావలసిన ఆశల చమురును హరిస్తుందని, నెల్లాళ్లుగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న పద్దెనిమిదేళ్ల సుమిత్రకు తెలిసి వస్తుంది. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారని దినపత్రికలలో చదివినప్పుడు, ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం చెయ్యగలిగిన వాళ్ళు బ్రతకడానికెందుకు ధైర్యం చెయ్యలేక పోతారు? ఏది చెయ్యాలన్నా ముందు ప్రాణాలతో వుండాలి కదా! … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార (గత సంచిక తరువాయి…) 10. పని ఎక్కువ ` జీతం తక్కువ నేను ఇబ్రహీంపట్నంలో వున్నప్పుడు నా స్నేహితులకూ, రాడికల్‌ రాజకీయాలు, పుస్తకాలు, సంస్కృతి గురించి వారితో జరిపే ఎడతెరిపిలేని చర్చలకూ దూరమైపోయాను. ఇక్కడి రోజువారీ విశేషాలను వారితో ఎప్పుడెప్పుడు పంచుకోవాలా అని తహతహగా వుండేది. వారం రోజుల కంటే … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

వయసువాటం – అపర్ణ తోట

వయసును మనం పట్టించుకోక పోయినా అది మనలను పట్టించు కుంటుంది. ఎన్ని కసరత్తులు చేసినా ఈ శరీరం పుట్టి పెరిగి కొన్ని పనులు చేసి పండి, వడలి, చివరకు రాలిపోతుంది. ఇదంతా వేదాంతామని అనిపించొచ్చు, కానీ అనాదిగా సాగిపోతున్న నిజమిదే. ఎంత విర్రవీగినా వయసును తప్పించుకు తిరగడం కష్టం. ఇక ఆడవారిలో అయితే లేత తమలపాకు … Continue reading

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

అనవసరపు గర్భాశయ ఆపరేషన్లూ కానరాని హింసే – పి. ప్రశాంతి

‘‘అత్తా.. అత్తా..’’ లోగొంతుకతో పిలుస్తూ గుమ్మంలో నిలబడి లోపలికి తొంగి చూసింది అనిత. కిటికీలోంచి పడుతున్న కొద్ది వెలుతురులో మంచం మీద ముడుచుకు పడుకున్న మల్లమ్మను చూసి ‘‘ఏమైందత్తా’’ అంటూ లోపలికొచ్చింది. ‘మూడు దినాలుగా దినమంతా నిల్సొని పత్తి పీకుడయితాంది. కాళ్ళు, నడుము ఒకటే గుంజుడు, లేవనీకి కావట్లేదు. ఒకటే నీరసం.. వయసైతాన్దిగా బిడ్డా!! సరేగాని, … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

మగస్వామ్యంలో కొత్త ఆకర్షణీయ ధోరణులు: ట్రాడ్‌ వైవ్స్‌ – ఎ. సునీత

కొన్నాళ్ల క్రితం ఒక స్త్రీవాద మిత్రురాలు ట్రాడ్‌ వైవ్స్‌ గురించి ఫేస్బుక్‌లో ఆందోళన చెందే పరిణామమని పోస్టు రాస్తే వీళ్ళెవరూ అని ఈ తరం స్త్రీవాది మా అమ్మాయిని అడిగాను. ‘ఇదంతా ఇంస్టాగ్రామ్‌లో ఒక లేటెస్ట్‌ ట్రెండ్‌ అమ్మా, అంతకంటే ఏమీ లేదు’, అని తేల్చేసింది. గూగుల్‌ సహాయంతో దొరికిందంతా చదివాను. ట్రాడ్‌ వైవ్స్‌ అన్నది … Continue reading

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

‘‘చిట్టి చిలకమ్మ’’ బల్ల సరస్వతి ఇంటర్వ్యూ – గిరిజ పైడిమర్రి

‘‘చిట్టి చిలకమ్మా! / చిన్నీ చిలకమ్మా! అమ్మ కొట్టిందా?/ తోట్లోకెళ్లావా? పండు తెచ్చావా?/ పాపాయికిచ్చావా?

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

తెలుగు కథ విస్తృతి, వైవిద్యం, పరిధి – అబ్బూరి ఛాయదేవి

1998 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు భూమిక అన్వేషి కలిసి ఒక కథ వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం ప్రారంభ సభకి అబ్బూరి ఛాయాదేవి అధ్యక్షత వహించారు. డాక్టర్‌ కాత్యాయని విద్మహే తెలుగు కథ విస్తృతి, వైవిధ్యం, పరిధిపై ప్రసంగించారు. ఇప్పుడు సాహిత్య విమర్శకురాలిగా పేరుపొందిన అధ్యాపకురాలు … Continue reading

Share
Posted in వర్క్ షాప్ | Leave a comment

దేశ రాజధానిలో గడ్డి రొట్టె మీద సాగే జీవనం – సంధ్య / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం – సుధామయి సత్తెనపల్లి బీహార్‌ నుంచి వలస వచ్చిన రీతా కుటుంబం యమునా నది వరద మైదానాల్లో తాత్కాలికంగా కట్టుకున్న గుడిసెలో నివసిస్తోంది. పరీక్షలకు నిలయంగా కనిపిస్తోన్న ఈ ప్రదేశంలో వారి జీవనోపాధి ఏనుగు గడ్డిని అమ్మడం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇదా నవయుగము! ఒక అభాగిని – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

సంపాదక మహాశయా! నా యీ కష్టాలను ‘గృహలక్ష్మి’ ద్వారా ప్రచురించుకుందామనే ఆశ చాలా కాలాన్నుంచి యుండేది. దాని వెంటనే పత్రికా భాష వ్రాయనేర్వని నాబోటి వాళ్లు వ్రాసిన అవకతవక భాషను ప్రచురించుతారా అనే శంక హృదయంలో తట్టి నిరుత్సాహపడుతూ వుండేదాన్ని. ఐనా ప్రత్యేకం స్త్రీల పాలిట కల్పతరువైన ‘గృహలక్ష్మి’యే నా యధార్ధ కష్టాలను ఆలింపక నిరాకరించిన … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతదేశంలో డిజిటల్‌ సేవలలో షెడ్యూల్డ్‌ తెగలు: అడ్డంకులు మరియు పరిష్కార మార్గం – డాక్టర్‌ సి.హెచ్‌.కృష్ణరావు

పరిచయం: డిజిటల్‌ ఇండియా అనేది పౌరులందరికీ డిజిటల్‌ సేవలను అందించడం, ఇంటర్నెట్‌ కనెక్టివిటీని మెరుగుపరచడం మరియు సాంకేతిక రంగంలో దేశాన్ని డిజిటల్‌ సాధికారత సాధించడం అనే ప్రధాన లక్ష్యంతో భారత ప్రభుత్వం 2015 జూలైలో ప్రారంభించిన ప్రచారం. ప్రభుత్వ సేవలు పౌరులకు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో అందుబాటులో ఉండేలా డిజిటల్‌ ఇండియా కార్యక్రమాలు చేపడతారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నేనెవరు? – డా. సమ్మెట విజయ

నా కంటూ ఓ పేరు అమ్మా నాన్నా పెట్టినా ఇప్పుడు మారిపోయింది కాదు కాదు నన్ను మార్చేసింది

Share
Posted in కవితలు | Leave a comment

ఆమె ఎవరు ? – నిర్మలాదేవి. యన్‌

నిత్య శంకితుడు – పెనుభూతం వాడు. ఎవడితో కడుపు? అంటూ చావుదెబ్బలు పాదాలనంటి ప్రమాణం చేస్తుంది.

Share
Posted in కవితలు | Leave a comment