Author Archives: భూమిక

సరికొత్త దృశ్యం

– నంబూరి పరిపూర్ణ బి.కాం. ఫైనలియర్లో వున్న సుజాతకు చదువు తప్ప మరే లోకంతోనూ పన్లేదు. ఫస్టు క్లాసు ఓ లెక్కలోది గాదామెకు. అంతకు మించిన మెరిట్ మార్కుల్తో పాసవ్వాల్సిందే. తండ్రి రంగనాధరావు పి.డబ్ల్యులో సెక్షనాఫీసరు. సంపాదన పరిమితమే అయినా సంతానం చదువుల గూర్చిన శ్రద్ధ అపరిమితం. పిల్లలు సైతం చదువుల్లో దిట్టలు.

Share
Posted in కథలు | 5 Comments

సూర్యచందుల్న్రి మమేకం చేసిన కాంతిగోళం

ఆమె మార్గంలో నడుద్దాం- సావితిబ్రాయి ఫూలే – కత్తి పద్మారావు ప్రపంచవ్యాప్తంగా తాత్వికులకు, ఉద్యమకారులకు పోరాట వీరులకు బాసటగా నిలచిన స్త్రీలలో సావిత్రిబాయి ఫూలేది అద్వితీయ చరిత్ర. మార్క్స్కు జన్నీ ఎంతో సహకారాన్ని అందించింది. అయితే అది తాత్విక రంగంలోనే ఎక్కువగా జరిగింది. కానీ సావిత్రిబాయి ఫూలే మొత్తం పోరాటంలోనే భర్తకి అండగా నిలిచింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆగమ్మ

– ఇంటర్వ్యూ: జె. సుభద్ర (వరంగల్ జిల్లాలో సర్పంచిగా పనిచేస్తున్న దళితురాలు ఆగమ్మ. పేరుకి ఆమె సర్పంచిగాని అధికారమంతా ఆమె కొడుకుదే. ఆగమ్మతో సుభద జరిపిన ఇంటర్వ్యూ.) ప్రః చెప్పమ్మా ఎప్పుడు ఎన్నికయ్యావు నువ్వు, ఎవరు నిల్చోబెట్టారు, మీ పంచాయితీ గురించి చెప్పు…? పంచాయితీ సంగతి కొడుక్కి తెలుసు గద నాకేం దెలుత్తది నన్ను నిలబెట్టుకున్నడు … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | 2 Comments

విడి విడి ఆకులు

– ఆర్.వి.ఎం.ఆర్.రత్నా రావు, పిఠాపురం బోల్ తలాక్ తలాక్ తలాక్ ఇద్దరి విరసపు చరమాంకంలో చెరొక దారికై తలొక ఆకు బేక్ర్ ది లాక్, టు షేక్ ది లా, ఇవ్వొక షాక్ ఇది బానిస బత్రుకు నుంచి బైటకు వనిత చేసే వాక్

Share
Posted in కవితలు | Leave a comment

కళ్ళెర్రజేయవే చెల్లెమ్మా!

– డా. ఎస్వీ సత్యనారాయణ మాయమాటలు నమ్మి చెల్లెమ్మా! – నువ్వు మోసపోవద్దింక చెల్లెమ్మా! పొగుడుతున్నారనీ చెల్లెమ్మా!- నువ్వు పొంగిపోవద్దింక చెల్లెమ్మా! ||మాయ||

Share
Posted in కవితలు | Leave a comment

బాల్యం బంతాట

– పంతం సుజాత తనిఖీ కొచ్చిన తాసిల్దారులా వస్తున్న హెడ్మిసెస్ని చూసి చదువుతున్న వారపతిక్రను తిరగేసి దాచిన జాణతనం టీచరొస్తున్న అలికిడై గార్డెన్లో కోసిన ముద్దబంతిని యూనిఫాంలో దాచుకున్న గడుసుతనం ఏమైపోయిందో తెలీదు!…

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మ

– రేష్మ, డి.జి.టి మొదటి సంవత్సరం పెదవులు కలుసుకున్న పత్రిసారీ గుర్తుకొచ్చేది నువ్వే… కనురెప్పలు మూసుకున్న పత్రిసారీ వినిపించేది నీ జోలపాటలే… శ్వాసపీల్చుకున్న పత్రిసారీ శాంతతనిచ్చేది నీ కమ్మని మాటలే… నిజం తెలుసా అమ్మ!

Share
Posted in కవితలు | Leave a comment

ఆడదిక్కు

– లతాశర్మ (అనువాదం: ఆర్. శాంతసుందరి) “అమ్మా! తొమ్మిదిన్నరవుతోందే, ఇంకా ఎంతసేపిలా ఆకలితో కూర్చునుండాలి?” రమ ఎంతో సౌమ్యంగా అడిగింది. “ఇదిగో, ఐదే ఐదు నిమిషాలు!” అమ్మ చటుక్కున లేచి వెళ్ళి బాత్రూమ్ తలుపు మళ్ళీ తట్టింది.” ఒరే అమర్, త్వరగా రారా!… అక్క యింకా ఏమీ తినకుండా కూర్చునుంది!” అంది.

Share
Posted in కథలు | 4 Comments

“కథలాంటి ఒక జీవిత కథ”

– సోమంచి పద్మావతి ఒకరోజు వాసా ప్రభావతి గారినుండి ఫోను వచ్చింది. “పద్మావతిగారూ! ఇది విన్నారా? మల్లాది సుబ్బమ్మగారు, మంచం మీద నుంచి లేవటం లేదు పడిపోయారు, నేను వెళ్ళి చూసొచ్చేను” అని. నేనీమధ్య జమ్మూ-కాశ్మీర్, అమృతసర్, పాకిస్థాన్కి, భారత్కి గల “వాఘా” బోర్డర్, చంబాలోయలు, కురుక్షేత్రం మొదలైన ప్రదేశాలు చూసిరావడానికి వెళ్ళేను.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హుషారుగా జరిగిన రచయితుల్ర సమావేశం

– మంజుల భూమిక ఆధ్వర్యంలో రచయిత్రుల సమావేశం 08.02.07 తేదీన జరిగింది. షుమారు పదిహేను మంది రచయిత్రుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా రచయిత్రులు తమనుతాము పరిచయం చేసుకున్నారు.

Share
Posted in సాహిత్య వార్తలు | Leave a comment

స్నేహ సంగమం

– శివలక్ష్మి స్నేహ సౌరభాలు వెదజల్లే కలయికలు కాంతిపేటికలు వెలుగులు చిమ్ముతూ జీవిత పరీవాహకాన్ని సేదదీర్చేవాటికలు మనిషిని మనిషి కలవడం

Share
Posted in కవితలు | Leave a comment

పతిక్రల్లో స్త్రీల పేజీలు

– టి. దేవకీదేవి పూర్వకాలంలో రచ్చబండ ద్వారా ప్రజలు వార్తలను తెలుసుకునేవారు. ముద్రణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాక వార్తా పత్రికలు ప్రారంభమయ్యాయి. దాంతో ప్రపంచంలోని నలుమూలల వార్తలన్నీ ప్రజల అందుబాటులోకి వచ్చాయి. తెలుగులో మొదట మత పరంగా అటుపై సాహితీ పరంగా వార్తాపత్రికలు వెలువడ్డాయి. ఆ తర్వాత విభిన్న సమాచార విభాగాలు వార్తాపత్రికల్లోకి ప్రవేశించాయి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రియమైన అమ్మా… నాన్నా…

పుస్తకావిష్కరణ సందర్భంగా అరుణా మోహన్ గారి ప్రసంగ వ్యాసం ముఖ్యంగా ఈరోజు మనమంతా సమావేశమవడానికి కారణం ఈ విద్యా సదస్సు ఏర్పాటు చెయ్యడం. ఇక్కడ అందరం నేర్చుకుంటున్నాం. అందరం నేర్చుకొంటున్నాం అంటే అందరం మనల్ని సరిదిద్దుకొవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సరిదిద్దడం అంటే ఒకరిపట్ల ఒకరికున్న శ్రద్ధ.ముఖ్యంగా ఇక్కడ ఈ పుస్తకంలో నాకేం కన్పించిందంటే పిల్లలు, … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలా ఇరామ్

షర్మిలా ఇరామ్, 35 సంవత్సరాల మణిపూర్ ఉక్కు మహిళ నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు దాటుతోంది. మణిపూ‌ర్‌లోనే కాక మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో 48 సంవత్సరాలుగా అమలులో ఉన్న అమానుష చట్టం ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టాన్ని (ఎఎఫ్ఎస్‌పిఎ) కి వ్యతిరేకంగా షర్మిల నవంబర్ 2000 లో తన అమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టింది. … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఎడిటర్ గారికి

ఎడిటర్ గారికి, జనవరి సంచికలో ప్రచురితమైన రేణుక అయోలగారి కథ ‘డైరీ’ బాగుంది. మొదట ధోరణి కొంతవరకూ ఈనాడు అసంఖ్యాకంగా వస్తున్న స్త్రీవాద కథల మాదిరిగానే అనిపించినా చివర ఆ డైరీ పడవలసిన వారి చేతులోనే పడడం అన్న ట్విస్ట్ కథకు ఒక కొత్తదనాన్ని సంతరించింది. అయితే ఫోనుల్లో పలికే హెల్ప్‌లైనుల గురించి రచయిత్రి ఆపార్ధం … Continue reading

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

నాకెన్నడూ పూలు కానుకగా రాలేదు

-అనామిక గుండెకి పడ్డ చిల్లులకీ మాటలతో చీరుకుపోయిన గాయాలకీ నాకు నేనుగానే లేపనం రాసుకోవాలి. నాకెన్నడూ పూలు కానుకగా రాలేదు.

Share
Posted in కవితలు | 1 Comment