-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
ఏనుగంత తండ్రికన్నా యేకుల బుట్టంత తల్లి నయం – గోగు శ్యామల
మడికట్ల పొద్దుమూకిన యాల పిల్లలందరం ఊరికి బయట గుమిగూడినం. వానవడి ఎల్సిన గుర్తులుగా నీటి బిందువులు పచ్చి గడ్డిపై పువ్వెండలో జిగేల్ మంటున్నయి. మొగపిల్లలంతా ఆ పక్కకు వోయి సెడుగుడాడుతుండ్రు. నా ఈడు ఆడ్విల్లలంతా దాగిట్ల
Posted in కథలు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
శారద పెళ్ళి మద్రాసులో పార్టీ ముఖ్యుల ముందు ప్రమాణ పత్రాల మీద సంతకాలు పెట్టడంతో జరగాలని నిర్ణయమైంది. శారద, సుబ్బమ్మ వారం రోజుల ముందే మద్రాసు వెళ్ళారు.
Posted in ధారావాహికలు
Leave a comment
ఎర్రజెండా రెపరెపల్లో మెరిసిన విద్యుల్లత మల్లు స్వరాజ్యం -వేములపల్లి సత్యవతి
యుద్ధభూమిలో అరివీర భయంకరులై శత్రువులతో పోరాడి అసువులు బాసినవారిని వీరులని, వీర మరణం పొందారని అంటాము. జాతి స్వేచ్ఛ, దేశ స్వాతంత్య్రాల కొరకు కంకణం కట్టుకుని ఉద్యమాలను స్థాపించి ధన, మాన, ప్రాణాలను ఫణంగా పెట్టి సమిధలైన వారిని త్యాగధనులని, లబ్దప్రతిష్టులని, నిష్కళంక దేశభక్తులని కొనియాడతాం. పైన పేర్కొన్న ఇరు
Posted in జీవితానుభవాలు
Leave a comment
‘నిక్’ ఒక మహా అద్భుతం -బిల్ల మహేందర్
వైకల్యాన్ని అధిగమించి జీవితాన్ని సమర్ధవంతంగా నిర్మించుకున్న వారు ఈ ప్రపంచంలో మనం చాలా మందిని చూస్తూనే ఉన్నాం. హెలెన్ కెల్లర్, లూయిస్ బ్రెయిలీ, స్టీఫెన్ హాకింగ్ లాంటి వారే కాకుండా సుధా చంద్రన్, అరుణిమ సిన్హా, నేహల్ మొదలగు వారెందరో ఆత్మస్థైర్యంతో వారి అవయవ లోపాన్ని అధిగమించి విజేతలుగా నిలిచారు. ఎంతో మందికి ప్రేరణ అయ్యారు. … Continue reading
Posted in పుస్తక పరిచయం
Leave a comment
‘ఒక్కరి కోసం అందరం ` అందరి కోసం ఒక్కరం’- సామల్ల శ్వేత
నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహాయ సంఘంః సిద్ధిపేట జిల్లాలో 2006 నుంచీ గత పదహారు సంవత్సరాలుగా ‘కేరింగ్ సిటిజన్స్’ కలెక్టివ్ తరఫున రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలతో పనిచేయడం, వారి స్థితిగతుల గురించి తెలుసుకుంటూ ఆ కుటుంబాలకి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం గురించి తెలియజేస్తూ, వారి పిల్లల చదువు విషయంలో సహాయపడుతూ వస్తున్నాము. … Continue reading
Posted in రిపోర్టులు
Leave a comment
ఇప్పటికీ చర్చనీయాలే – జూపాక సుభద్ర
రత్నమాలది విప్లవతరమే, ఉద్యమాల తరమే. ఈ తరంలో తెలంగాణ నేలమీద విప్లవ సాహిత్య పత్రిక నడిపిన మొదటి తెలంగాణ మహిళ రత్నమాల. నక్సల్బరి, శ్రీకాకుళ పోరాటాల తర్వాత, జై తెలంగాణ, జై ఆంధ్ర పోరాటాల పిదప ఎమర్జెన్సీ చీకట్ల నుంచి దేశం అప్పుడప్పుడే
Posted in వ్యాసాలు
Leave a comment
సాహిత్యరంగంలో నోబెల్ బహుమతి పొందిన మహిళలు -మన్నేపల్లి లలితమ్మ
స్త్రీలను ఆకాశంలో సగం అన్నారు. అయితే అట్టి ఆకాశం సగం మేఘావృతం అయితే సగం చీకటిలో ఉండిపోతుంది. అదే విధంగా సమాజంలో స్త్రీని నిరాదరణకు గురిచేస్తే సగం సమాజం అంధకారంలో మగ్గిపోతుంది. స్త్రీ పురుషులిద్దరూ సృష్టికి మూలస్తంభాల వంటివారు.
Posted in వ్యాసాలు
Leave a comment
అమ్మ ఒక యుద్ధగీతం… -రాంపల్లి రమేష్
‘‘కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారి, సుత్తీ కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓటు’’… రాత్రి ఆ అక్షరాలు రాస్తున్నప్పుడు తెలియదు నాకు… తెల్లవారితే అవి అగ్గి రాజేస్తాయని… సూర్యునితోపాటే మా ఇంటి గోడ మీద దర్శనమిచ్చిన ఆ రాతలు పెద్ద
Posted in వ్యాసాలు
Leave a comment
హ్యాపీ ఫెమినిస్ట్స్ -చిమమండా అడిచే
– అనువాదం : ఎ. సునీత ఆ మాట పురుషులు ఎప్పుడు అంటారంటే, వాళ్ళు చెయ్యకూడని పనులు ఆపేసినప్పుడు. వాళ్ళ స్నేహితులకి, తమ మగతనాన్ని నిరూపించుకుంటూ, ముద్దుగా ఇలా చెప్పుకుంటారు. ‘‘మా ఆవిడ ప్రతి రాత్రి క్లబ్బుకెళ్ళకూడదని అంటోందోయ్. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని వీకెండ్‌లోనే వెళ్తానని ప్రామిస్ చేశాను’’.
Posted in వ్యాసాలు
Leave a comment
ఎపుడో – డా.సి. భవానీదేవి
Posted in కవితలు
Leave a comment
ఎందుకూ? ` -రమాదేవి చేలూరు
ఎందుకూ ఉడికించే ఆ అవహేళన! ఎందుకూ దిక్కులు పిక్కటిల్లే ఆ వికటాట్ట హాసం! మేధో మానవులు పరమ మూర్ఖులయ్యారనా! వాళ్ళు సృష్టించుకుంటున్న మారణహోమం చూశా!
Posted in కవితలు
Leave a comment
పిల్లల భూమిక
ఓ స్త్రీ నీకు జోహార్లు అన్ని విషయాల్లో ముందుండే పడతి వెలుగులు పంచేది నీవే ఓ ఇంతి అన్ని పనుల్లో ముందుండే కొమ్మ
Posted in పిల్లల భూమిక
Leave a comment
హిజాబ్ ఒక ఆధిపత్య లౌకికవాద సమస్య -ఎ. సునీత
మంగళూరులో అకస్మాత్తుగా ఒక కాలేజీ నిర్వాహకులు ఐదుగురు ముస్లిం అమ్మాయిలకి హిజాబ్ (జుట్టుని కప్పి ఉంచే ముసుగు) వేసుకుంటే కాలేజీకి రావొద్దని చెప్పేశారు. యూనిఫాం నియమాలకు హిజాబ్ విరుద్ధమని, కనుక ఇలా నిర్ణయం తీసకున్నామని చెప్పారు. సగానికి సగం మంది స్త్రీలని చదువు రాకుండా ఉంచే ఈ దేశంలో కాలేజీ చదువు వరకూ వచ్చే
Posted in గెస్ట్ ఎడిటోరియల్
Leave a comment
నేను ఒంటరినెట్లవుతా!?! -పి. ప్రశాంతి
కవిత రుసరుసలాడుతూ ఇంటికొచ్చింది. సంతలో ఆక్కూరలు అమ్మడానికి తీసుకెళ్ళిన తట్టని ఒక మూలకి విసిరేసింది. బొడ్లో దోపు కున్న డబ్బుల సంచీ లాగి విసురుగా బల్లమీద పెట్టింది. ఆ విసురుకి కొన్ని నాణాలు కిందపడి ఘల్లుమన్నాయి. కాళ్ళు తపతపలాడిచ్చుకుంటూ వెళ్ళి
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
