-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
స్త్రీ వాదం ఎందుకు? -ఉమా నూతక్కి
21వ శతాబ్దంలో ఇరవై యేళ్ళు గడిచాక కూడా ఇంకా మనం స్త్రీ వాదం గురించి మాట్లాడుకోవాల్సి వస్తోందంటే ఆ స్త్రీ వాదపు అవసరం ఇంకా ఉందనే కదా! ఉందను కోవడం ఏంటి… ఉంది. జెండర్ సమానత్వం గురించి చెప్పుకో వడానికి చాలా బాగుం టుంది. నిజంగా అది సాధించగలిగితే ఆనందదాయకమే. కానీ అది జరుగుతుం దన్న … Continue reading
Posted in మంకెన పువ్వు
Leave a comment
సావిత్రీబాయి రోడే -డా॥ చల్లపల్లి స్వరూపరాణి
19వ శతాబ్దంలో ప్రారంభమైన సంఘసంస్కర ణోద్యమం సమాంతరంగా రెండు భిన్న వర్గాల నాయకత్వం కింద సాగింది. పాశ్చాత్య విద్య ద్వారా ప్రభావితమైన బ్రాహ్మణీయ వర్గాల మేధావులు ఒకవైపు తమ వర్గాల స్త్రీల సమస్యలైన సతీ సహగమనం, బాల్యవివాహాలు, నిర్బంధ వైధవ్యం వంటి సమస్యలపై సంస్కరణోద్యమం ప్రారంభిస్తే బ్రాహ్మణేతర వర్గాల మేధావులు సమాజంలోని
Posted in మిణుగురులు
Leave a comment
నో రూమ్ -కాళీపట్నం రామారావు
వెన్నెల పిండి ఆరవేసినట్లు లేదు. నగరం కొత్తగా ఉంది… అత్తవారి ఇల్లులా. ‘‘రూమ్ కావాల.’’ ‘‘సింగిలా, డబులా?’’
Posted in కథలు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
‘‘రాజకీయాల గురించి రాయటానికి నువ్వింకా చదవాలి. ప్రజలను సమీకరించటానికి నీ వయసు చాలదు’’ మళ్ళీ నొక్కి చెప్పాడు. ‘‘నేనేం చెయ్యలేనంటారా?’’ ఆవేశంగా అడిగింది శారద. ‘‘జెండా ఎగరేసి జైలుకు పోవచ్చు.’’
Posted in ధారావాహికలు
Leave a comment
కథలను మనకొదిలి వెళ్ళిన కథా దీపధారి -గంటేడ గౌరునాయుడు
‘‘మాస్టారు మనల్ని వొదిలెళ్ళిపోయార్రా…’’ అప్పల్నాయుడు ఫోన్ చేసినప్పుడు మాకైతే ఆశ్చర్యం కలగలేదు. రోజూనో… రోజు విడిచి రోజో మాస్టారి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం మేమిద్దరం. 97 ఏళ్ళ పసివాణ్ణి చాలా బాగా చూసుకున్నారు కోడలు ఇందిర, కొడుకులు సుబ్బారావు, ప్రసాదు. మాస్టారు అదృష్టవంతులు, విసుక్కోకుండా పితృసేవ చేసే
Posted in నివాళి
Leave a comment
అమ్మ ఆంతర్యం -డా॥ లక్ష్మీ రాఘవ
‘‘మొండిగా వాదిస్తున్నావు అమ్మా’’ కోపంగా అన్నాడు పార్వతమ్మతో పెద్దకొడుకు రామారావు. ‘‘అమ్మ మొండితనం ఇప్పటిది కాదు. నాన్న ఎలా వేగాడో అనిపిస్తుంది…’’ అమ్మ మీద కోపం ఇంకొంచెం ముందుకు పోయింది రెండో కొడుకు సూర్యం మాటల్లో.
Posted in కధానికలు
Leave a comment
చలం ఆత్మకథ ` చలం జీవితం ఒక సామాజిక ప్రయోగం -జ్యోతి
‘‘చలం’’ ఈ పేరులో ఇప్పటికి కూడా ఒక శక్తి ఉంది. తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్నవారు, అవగాహన ఉన్నవారు రెండు వర్గాలుగా చీలిపోతారు. చలం ప్రస్తావన వస్తే, చలాన్ని విపరీతంగా ప్రేమించి పూజించే ఒక వర్గం, చలాన్ని అదే స్థాయిలో ద్వేషించే మరో వర్గం.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
వ్యాధి, విధ్వంసం, విలయం, అవి లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలు… -సుధా కిరణ్
అంటువ్యాధి ఉత్పాతాలు అనేవి సమాజాలలో హఠాత్తుగా, ఎలాంటి హెచ్చరికా లేకుండా జరిగే యాదృచ్ఛిక సంఘటనలు కావు. అందుకు విరుద్ధమైనవి. ప్రతి సమాజమూ తనవైన బలహీనతల్ని సృష్టించుకుంటుంది. వాటిని అధ్యయనం చేయడమంటే, ఆ సమాజపు సాంఘిక నిర్మాణాన్నీ, జీవన ప్రమాణాలనీ, దాని రాజకీయ ప్రాధాన్యతలనీ అర్థం చేసుకోవడమే.
Posted in వ్యాసం
Leave a comment
ఆయన కథలు నేటివి, రేపటివి కూడా! -లాంగుల్య
మాస్టారి కొన్ని కథల గురించి ఈ సందర్భంలో రేఖామాత్రపు స్పర్శగా ఇక్కడ గుర్తు చేసుకుందాం. మాస్టారి ‘యజ్ఞం’తో తొమ్మిది కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మాస్టారికి అనేక పురస్కారాలు అందడం ద్వారా వాటికి గౌరవం
Posted in వ్యాసం
Leave a comment
కరోనా పాజిటివ్ -అయోధ్యా రెడ్డి
దాదాపు ఏడు శతాబ్దాల క్రితం ` 1353లో ఇటలీని వణికించిన భయానక మహమ్మారి ప్లేగు (బ్లాక్ డెత్) లక్షలాది మంది ప్రాణాలు బలిగొంది. దీని నేపథ్యంలో ఇటాలియన్ కవి, రచయిత, పరిశోధకుడు జియోవన్ని బొకాసియో ‘‘డికామెరాన్’’ పేరుతో ఒకే ఇతివృత్తం చుట్టూ అల్లిన వంద రూపక కథలు రాశారు.
Posted in వ్యాసం
Leave a comment
పిల్లల భూమిక
బంగారు భవిష్యత్తు బడికి మేము దారిలో రాబందులు తగులుతాయని బడికి వెళ్ళె ఆమె బడి మనేసింది. పుస్తకం. పట్టవలసిన చేతులతో పలుగు, పార పట్టింది ఆ బాధలు చూడలేక భారం దింపుకోవాలని
Posted in పిల్లల భూమిక
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
ఆ తర్వాత రెండేళ్ళ వరకూ మళ్ళీ ఊరికి రావటమే కుదరలేదు శారదకు. రామారావు మద్రాసులో తీరిక లేని పనులు పెట్టుకున్నాడు. విశ్రాంతి లేకుండా పని చేస్తున్నాడు. ఆయనకు ఎన్నో విషయాల మీద ఆసక్తి. ముఖ్యంగా ఆంధ్ర జాతి చరిత్ర, తెలుగు భాషా సాహిత్యాల గురించి తలకు మించిన పనులు పెట్టుకున్నాడు.
Posted in ధారావాహికలు
Leave a comment
