Monthly Archives: July 2021

పిల్లల భూమిక

బంగారు భవిష్యత్తు బడికి మేము దారిలో రాబందులు తగులుతాయని బడికి వెళ్ళె ఆమె బడి మనేసింది. పుస్తకం. పట్టవలసిన చేతులతో పలుగు, పార పట్టింది ఆ బాధలు చూడలేక భారం దింపుకోవాలని

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

జూన్, 2021

జూన్, 2021

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

ఆ తర్వాత రెండేళ్ళ వరకూ మళ్ళీ ఊరికి రావటమే కుదరలేదు శారదకు. రామారావు మద్రాసులో తీరిక లేని పనులు పెట్టుకున్నాడు. విశ్రాంతి లేకుండా పని చేస్తున్నాడు. ఆయనకు ఎన్నో విషయాల మీద ఆసక్తి. ముఖ్యంగా ఆంధ్ర జాతి చరిత్ర, తెలుగు భాషా సాహిత్యాల గురించి తలకు మించిన పనులు పెట్టుకున్నాడు.

Share
Posted in ధారావాహికలు | Leave a comment

‘‘నాటు’’ అని వెక్కిరించి కొట్టేయడం సరికాదు – కొండవీటి సత్యవతి

చిన్నప్పుడు ఆటల్లో దెబ్బలు తగిలి రక్తం కారుతుంటే గాయపాకు పసరు వేస్తే చటుక్కున రక్తం కారడం ఆగిపోయేది. గాయం మెల్లగా మానిపోయేది. ఆ కాలానికి అది వైద్యమే. నల్లేరు కాడల చారు కడుపును చక్కగా శుభ్రపరుస్తుంది. అదీ ఒక వైద్యమే. ఇన్ని రకాల టూత్‌పేస్టులు దండెత్తని రోజుల్లో వేపపుల్ల, సరుగుడు పుల్లలు, ఉత్తరేణి పుల్లలు

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులు శ్రీమతి కె. సత్యవతి గారికి, నమస్కారం. మే మాసం భూమికలో నిజంగా జరిగిన ఒక సంఘటనకు చక్కటి పరిష్కారం రాశారు. స్పందన కథలో డా॥తాళ్ళపల్లి యాకమ్మ గారు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ -పి. ప్రశాంతి

‘అమ్మా ఒన్‌ కేజి కవర్స్‌ ఐపోయినాయి. పావు కిలో కవర్స్‌ కూడా ఐపోవస్తున్నాయి. ఒకసారి చూసుకో అమ్మా, నాకు క్లాస్‌ టైమవుతోంది’ అంటూ బుక్స్‌ తీసుకుని గబగబా కంప్యూటర్‌ ఆన్‌ చేసి కూర్చున్నాడు సిద్దు. ‘అమ్మా టమాట, ఆలుగడ్డ, కాకరకాయలు లేవు. ఆర్డర్స్‌

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

యోధ జె.ఈశ్వరీబాయి -డా॥ చల్లపల్లి స్వరూపరాణి

చట్టసభల్లోకి దళిత స్త్రీలు రావడమే అరుదు. రిజర్వ్‌డ్‌ సీట్లలో వచ్చిన దళిత స్త్రీలు అక్కడ ఉండే పెత్తందారీ కులాల సభ్యుల ముందు దాదాపు చేతులు కట్టుకుని ఉన్నట్టే కనిపిస్తారు. వారు నోరు తెరిచి తమ వర్గాల సమస్యల మీద మాట్లాడిన సందర్భాలను మన చెవులతో వినము.

Share
Posted in మిణుగురులు  | Leave a comment

ఇగో -తిరునగరి దేవకీదేవి

సాయంకాలం నాలుగు కావస్తోంది. సెలవులకు తెర పడిరది. పిల్లలకు మళ్ళీ ఉద్యోగ పర్వం… తిరుగుముఖం కాక తప్పలేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కానీ బిందుకు అలసట తెలిసి రాలేదు. నెల రోజుల తర్వాత మధ్యాహ్నం నడుం వాల్చే అవకాశం దొరికింది. సాయంత్రం

Share
Posted in కథలు | Leave a comment

సూర్యుణ్ణి మింగేసిన మబ్బులు -రమాదేవి చేలూరు

చెంగలువలు విరిసే నీటి మడుగుల కావల, పడుచుపిల్ల పరికిణీలా వెదురు పొదలున్నాయి. వాటిని దాటుకొని పోతే, ఆడపిల్ల వంకీల జుట్టులా చిన్న గుట్టలున్నాయి. వాటిని ఎక్కి దిగితే నుదుటిమీద బొట్టులా ఒద్దికైన పల్లెటూరుంది. అది సంజమ్మ ఊరు.

Share
Posted in కధానికలు | Leave a comment

‘తెలుగు సినిమా’ చెంప ఛెళ్ళుమనిపించిన ‘‘పలాస’’ – చైతన్య పింగళి

ఒక బాలా, ఒక పా.రంజిత్‌, ఒక వెట్రిమారన్‌ స్థానిక కథలకి ఇచ్చిన ప్రాధాన్యత కరుణ కుమార్‌ ఒక సినిమాతో తెలుగులోకి తీసుకురాగలిగారంటే చాలా గొప్ప విషయం. జీవితంలో కష్టాలను ‘సినిమా కష్టాలతో’ పోల్చుతారు. సినిమా తీయడానికి కూడా అంతకు మించిన కష్టాలు ఉంటాయి.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

మనసుని తాకే పిల్లల సినిమాలు : అనిల్‌ బత్తుల -స్వాతి కుమారి

మంచి పిల్లల సినిమాకి ముఖ్యమైన లక్షణాలు ` పిల్లల దృష్టి కోణంలో ప్రపంచాన్ని చూడగలగటం. చిన్నపిల్లల ప్రపంచం చాలా పెద్దది. వాళ్ళ ఆలోచనలకు హద్దులు, ఊహలకి పొలిమేరలు ఉండవు. ఫౌంటెన్‌ లాగా చిమ్మే

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

వీరయ్య చెప్పిన మరో విషాద గాథ -ఆర్‌.ఎస్‌.వెంకటేశ్వరన్‌

ఆఫ్రికా సాంప్రదాయం ప్రకారం బిడ్డ పుట్టగానే మొదటి సారిగా బిడ్డ చెవిలో మాత్రమే తన పేరు మెల్లగా చెప్పాలి ఆ తర్వాతే సమాజానికి తెలియజేయాలి. తనెవరో తనకే ముందు తెలియాలన్న పురాతన ఆఫ్రికా సాంప్రదాయాన్ని వారు ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నారు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఏకాంత ప్రయాణాలు -కొండవీటి సత్యవతి

నబనీత దేవసేన ప్రముఖ బెంగాలీ రచయిత. కలకత్తాలోని జాదవ్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌. ఆమె బెంగాలీ భాషలో రాసిన చాలా రచనలు ఇంగ్లీష్‌లోకి అనువాదమయ్యాయి. నవలలు, కథలు, కవిత్వం, నాటకాలు, ట్రావెలాడ్స్‌ వంటి ఎన్నో ప్రక్రియల్లో ఆవిడ రచనలు చేశారు. ఆమెను నేను రెండుసార్లు కలిశాను. చాలా సరదాగా, సంబరంగా ఉంటారావిడ.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

రంధి నవలలో స్త్రీ చైతన్య దృక్పథం -డా॥ మంగమార మునిలక్ష్మి

‘‘రంధి’’ నవలను ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారు రచించారు. ఇందులో ప్రధాన కథ ఊరికి పల్లెకు మధ్య జరిగే అంతర్యుద్ధం. అంటే అగ్రవర్ణాల వారికి, దళితులకు మధ్య జరిగే గొడవ. కథంతా గుంటూరు వేజెండ్ల గ్రామ నేపథ్యంలో జరిగే సంఘటనలు, అగ్రకులాల ఆధిపత్య పోరులో నలిగిపోయే దళితులు, దళిత స్త్రీ అస్థిత్వ సమస్య ప్రధాన సందర్భం. … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

కుడుంబశ్రీ : కోవిడ్‌`19 లాక్‌డౌన్‌ సమయంలో మహిళా స్వయం సహాయక బృందాల పాత్ర -కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

భారతదేశంలో లాక్‌డౌన్‌ సమస్య తీవ్రతను తగ్గించడంలో వీలైనంత తక్కువ సమయంలో ఉత్తమ పరిష్కారాలు చూపించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇక్కడి ప్రభుత్వ యంత్రాంగాలకు మహిళలు అందించిన చేయూత గొప్ప సామాజిక ప్రభావాన్ని చూపాయి. కోవిడ్‌`19 లాంటి విపత్తును ఎదుర్కోవడం కేవలం ప్రభుత్వాలకు మాత్రమే సాధ్యం కాదు.

Share
Posted in వ్యాసం | Leave a comment

కరోనా కట్టడిలో మోడీ వైఫల్యం -ఎ.నర్సింహారెడ్డి

దేశంలో కొవిడ్‌ వైరస్‌ రెండో దశలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. దవాఖానాలు ఫుల్‌, స్మశానాలు ఫుల్‌, ఊపిరాడటం లేదు. నేడు కరోనా గాఢ పరిష్వంగంలో ఎప్పుడు ఎవరు వాలిపోతారో, ఎక్కడ ఎవరు రాలిపోతారో తెలియని హృదయ విదారకరమైన పరిస్థితి. ఇంత దారుణ పరిస్థితులు… దేశం ముందెన్నడూ చూడని భయానక పరిస్థితిని చూస్తోంది.

Share
Posted in వ్యాసం | Leave a comment