Monthly Archives: April 2022

అలుపెరుగని పోరాట కెరటం మల్లు స్వరాజ్యం – కొండవీటి సత్యవతి

నిజాం రాజరికంలో… కరుడుగట్టిన భూస్వామ్య వ్యవస్థ తెలంగాణాని అతలాకుతలం చేస్తూ… గ్రామాలకు గ్రామాలే వెట్టి చాకిరీతో విలవిల్లాడుతోన్న సమయాన దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు కార్యకర్తలు చట్టపరంగా ఎన్నో సభలూ సమావేశాలూ నిర్వహిస్తూ తమ పోరాటాలను ఉధృతం చేశారు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

ప్రియమైన ఎడిటర్‌ గారికి, నమస్కారము. ఫిబ్రవరి సంచికలో శీలా సుభద్రాదేవి గారి కాలంతో పాటు మారాల్సిన ఆచారాలు వ్యాసం చాలా గొప్పగా అనిపించింది. నిజంగా ఇలాంటి సాంఘిక దురాచారాలపై ప్రజల్లో ముఖ్యంగా స్త్రీలలో చాలా మార్పు రావాలని నేను కూడా గట్టిగా కోరుకుంటున్నాను ఇంత చైతన్యపూరితమైన వ్యాసం అందించినందుకు కృతజ్ఞతలు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

విజయపథంలో విజయ -వి.శాంతి ప్రబోధ

‘‘నన్ను నేనే చెక్కుకోబడిన శిల్పాన్ని. కాలం విసిరిన ప్రతి సమస్య నా దారికి బాట అయినది కాలం గొప్పది’’ ఆ ఆత్మవిశ్వాసపు స్వరం ఎవరిది? ‘‘సమాజంలో ఆడవాళ్ళ మీద ఎంత వివక్ష

Share
Posted in కిటికి | Leave a comment

ఎక్కడమ్మా నువ్వు లేనిది -పి. ప్రశాంతి

అదో చిన్న ఆదివాసీ గ్రామం. రోడ్డుకి రెండు వైపులా మాత్రమే ఇళ్ళున్నాయి. కొండవైపున్న ఇళ్ళు రెండు వరసల్లో, ఆవరణలో పెద్ద పెద్ద చెట్లతో నిండున్నాయి. కొండ దిగువకి ఉన్న ఇళ్ళు ఒక వరసే ఉన్నాయి. ఆ ఇళ్ళ వెనగ్గా కొండల్లో పైనించి వస్తున్న జలాపాతాల్లాంటి నది.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఏనుగంత తండ్రికన్నా యేకుల బుట్టంత తల్లి నయం – గోగు శ్యామల

మడికట్ల పొద్దుమూకిన యాల పిల్లలందరం ఊరికి బయట గుమిగూడినం. వానవడి ఎల్సిన గుర్తులుగా నీటి బిందువులు పచ్చి గడ్డిపై పువ్వెండలో జిగేల్‌ మంటున్నయి. మొగపిల్లలంతా ఆ పక్కకు వోయి సెడుగుడాడుతుండ్రు. నా ఈడు ఆడ్విల్లలంతా దాగిట్ల

Share
Posted in కథలు | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

శారద పెళ్ళి మద్రాసులో పార్టీ ముఖ్యుల ముందు ప్రమాణ పత్రాల మీద సంతకాలు పెట్టడంతో జరగాలని నిర్ణయమైంది. శారద, సుబ్బమ్మ వారం రోజుల ముందే మద్రాసు వెళ్ళారు.

Share
Posted in ధారావాహికలు | Leave a comment

ఎర్రజెండా రెపరెపల్లో మెరిసిన విద్యుల్లత మల్లు స్వరాజ్యం -వేములపల్లి సత్యవతి

యుద్ధభూమిలో అరివీర భయంకరులై శత్రువులతో పోరాడి అసువులు బాసినవారిని వీరులని, వీర మరణం పొందారని అంటాము. జాతి స్వేచ్ఛ, దేశ స్వాతంత్య్రాల కొరకు కంకణం కట్టుకుని ఉద్యమాలను స్థాపించి ధన, మాన, ప్రాణాలను ఫణంగా పెట్టి సమిధలైన వారిని త్యాగధనులని, లబ్దప్రతిష్టులని, నిష్కళంక దేశభక్తులని కొనియాడతాం. పైన పేర్కొన్న ఇరు

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

‘నిక్‌’ ఒక మహా అద్భుతం -బిల్ల మహేందర్‌

వైకల్యాన్ని అధిగమించి జీవితాన్ని సమర్ధవంతంగా నిర్మించుకున్న వారు ఈ ప్రపంచంలో మనం చాలా మందిని చూస్తూనే ఉన్నాం. హెలెన్‌ కెల్లర్‌, లూయిస్‌ బ్రెయిలీ, స్టీఫెన్‌ హాకింగ్‌ లాంటి వారే కాకుండా సుధా చంద్రన్‌, అరుణిమ సిన్హా, నేహల్‌ మొదలగు వారెందరో ఆత్మస్థైర్యంతో వారి అవయవ లోపాన్ని అధిగమించి విజేతలుగా నిలిచారు. ఎంతో మందికి ప్రేరణ అయ్యారు. … Continue reading

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

‘ఒక్కరి కోసం అందరం ` అందరి కోసం ఒక్కరం’- సామల్ల శ్వేత

నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహాయ సంఘంః సిద్ధిపేట జిల్లాలో 2006 నుంచీ గత పదహారు సంవత్సరాలుగా ‘కేరింగ్‌ సిటిజన్స్‌’ కలెక్టివ్‌ తరఫున రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలతో పనిచేయడం, వారి స్థితిగతుల గురించి తెలుసుకుంటూ ఆ కుటుంబాలకి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం గురించి తెలియజేస్తూ, వారి పిల్లల చదువు విషయంలో సహాయపడుతూ వస్తున్నాము. … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ఇప్పటికీ చర్చనీయాలే – జూపాక సుభద్ర

రత్నమాలది విప్లవతరమే, ఉద్యమాల తరమే. ఈ తరంలో తెలంగాణ నేలమీద విప్లవ సాహిత్య పత్రిక నడిపిన మొదటి తెలంగాణ మహిళ రత్నమాల. నక్సల్బరి, శ్రీకాకుళ పోరాటాల తర్వాత, జై తెలంగాణ, జై ఆంధ్ర పోరాటాల పిదప ఎమర్జెన్సీ చీకట్ల నుంచి దేశం అప్పుడప్పుడే

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సాహిత్యరంగంలో నోబెల్‌ బహుమతి పొందిన మహిళలు -మన్నేపల్లి లలితమ్మ

స్త్రీలను ఆకాశంలో సగం అన్నారు. అయితే అట్టి ఆకాశం సగం మేఘావృతం అయితే సగం చీకటిలో ఉండిపోతుంది. అదే విధంగా సమాజంలో స్త్రీని నిరాదరణకు గురిచేస్తే సగం సమాజం అంధకారంలో మగ్గిపోతుంది. స్త్రీ పురుషులిద్దరూ సృష్టికి మూలస్తంభాల వంటివారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అమ్మ ఒక యుద్ధగీతం… -రాంపల్లి రమేష్‌

‘‘కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం గారి, సుత్తీ కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓటు’’… రాత్రి ఆ అక్షరాలు రాస్తున్నప్పుడు తెలియదు నాకు… తెల్లవారితే అవి అగ్గి రాజేస్తాయని… సూర్యునితోపాటే మా ఇంటి గోడ మీద దర్శనమిచ్చిన ఆ రాతలు పెద్ద

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హ్యాపీ ఫెమినిస్ట్స్‌ -చిమమండా అడిచే

– అనువాదం : ఎ. సునీత ఆ మాట పురుషులు ఎప్పుడు అంటారంటే, వాళ్ళు చెయ్యకూడని పనులు ఆపేసినప్పుడు. వాళ్ళ స్నేహితులకి, తమ మగతనాన్ని నిరూపించుకుంటూ, ముద్దుగా ఇలా చెప్పుకుంటారు. ‘‘మా ఆవిడ ప్రతి రాత్రి క్లబ్బుకెళ్ళకూడదని అంటోందోయ్‌. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని వీకెండ్‌లోనే వెళ్తానని ప్రామిస్‌ చేశాను’’.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఎపుడో – డా.సి. భవానీదేవి

ఆ అమ్మ కడుపులో ఊపిరికోసం పోరాడిన కాలం ఎంతో! ఆ పసికన్నుల పసిడి కలల్లో వసివాడని వెలుగులు ఎన్నో!

Share
Posted in కవితలు | Leave a comment

పొద్దు పొదుపు కోసమే…! – నాంపల్లి సుజాత

బొడ్డు పేగుని కత్తిరించి బిడ్డంటూ… వేరు చేస్తున్నాం కానీ… ఆమె గర్భకుహరంలో మొగ్గతొడిగిన

Share
Posted in కవితలు | Leave a comment

నువ్వే రాజంటకదనే…! -` శ్రీతరం బింగి శ్రీకాంత్‌

అన్నా ఓ రైతన్నా… నువ్వే రాజంటకదనే తలపాగా చుట్టుకున్నందుకా కిరీటమల్లే…

Share
Posted in కవితలు | Leave a comment