-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
October 2022 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Monthly Archives: October 2022
ఒంటరితనాల్లోంచి స్వతంత్ర మహిళలుగా ఎదుగుతున్న వైనం – కొండవీటి సత్యవతి – –
‘‘అప్పుల్జేసి నా మొగుడు ఉరేసుకుని సచ్చాడు. ముగ్గురు పిల్లల్తో నేను రోడ్డున పడ్డాను. పోలీసోడు వచ్చి ఏమంటడు. నీతో కొట్లాడి, నువ్వు తిడితే సచ్చాడట కదా! నేను వలవలా ఏడుస్తుంటే పక్కింటోళ్ళని ఎంక్వయిరీ చేస్తడు. ఈమె మంచిదేనా, మొగుడిని తిట్టి
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులకు, అక్క ఆర్టికల్ చాలా బావుంది. చాలా విశ్లేషణాత్మాకంగా ఉంది. ముందు నుండే ఆదివాసిలని , దళితులను ఊరికి దూరంగా ఊరి చివరన ఉంచడం. ప్రాజెక్టుల పేరుతో వాళ్ళని నిరాశ్రయులను చేయడం ప్రభుత్వాలు, దోపిడి కులాల కార్పోరేట్లు చేస్తున్నా కుట్ర ఏ అభివృద్ధి
Posted in ప్రతిస్పందన
Leave a comment
అమ్మాయిలు బూతులు మాట్లాడితే రౌడీలా…!! -పి. ప్రశాంతి
జెండర్ ట్రైనింగ్ తీసుకున్న ఒక కళాజాత టీమ్ ఆ రోజు దగ్గర్లోని గ్రామంలో సామాజిక అంశాలపై అవగాహనా కార్యక్రమాల్లో భాగంగా కళారూపాలు ప్రదర్శిస్తున్నామని రమ్మని పిలిస్తే వెళ్ళింది శాంతి. రాత్రి సుమారు 8 గంటల సమయం. గ్రామం చేరుకునేసరికి కరెంటు పోయి కళారూపాల ప్రదర్శన ప్రారంభంలోనే ఆపాల్సి వచ్చిందట. అక్కడికొచ్చిన గ్రామస్థు లందరూ గుంపులు
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
బాధ్యత – శాంతి ప్రబోధ
‘‘అమ్మా… అమ్మా… నాకంత పరేషాన్ పరేషాన్ అయితాంది. ఏమ్ సమజ్‌గాకోచ్చింది. మొన్న వనస్థలిపురం కాడ ఆడకూతురు రేపయింది కద… అది చేసినోళ్ళది తప్పుకాదట కద. అది ఆమెకు దేవుడు రాసిన రాత అట కదమ్మా…’’ అంది యాదమ్మ వచ్చీ రావడంతోనే. ‘కర్మనా… అట్లా అని ఎవరన్నారు?’ నా ప్రశ్న.
Posted in కిటికి
Leave a comment
బరువెక్కిన మేఘం – జి.శ్యామల
శిన్న వయసుల బొమ్మరిల్లు గట్టి ఆడుతుండంగనే లగ్గం జేషిర్రు శిన్న శిన్న సంబురాలు గోల్పోతున్న అని తెలిసి కూడా మౌనంగా బుగులు మోషిన… ఆటలాడే వయసులనే బిడ్డలను మోషిన… తాగిన మొగుడు కొట్టిన బాధలు మోషిన… కాపాడుకుంటా అనే మాట మర్షిపోయి నమ్మకాన్ని మట్టు వెట్టిన నరకం మోషిన…
Posted in కధానికలు
Leave a comment
ఐక్యతా రాగం అనుభవం -జి. సాయి రాజ్
ఐక్యతా రాగం మీటింగ్‌లో చర్చించిన అన్ని అంశాలను మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలని మీటింగ్‌లో జరిగిన విషయాల్ని నోట్ చేసుకున్నాను. టైం 10:10 కి మీటింగ్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి అందరం పరిచయం చేసుకున్నాము. ఐక్యతా రాగం ఫేజ్ 1, 2 లో
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
ఇదంతా సుబ్బమ్మ లేకపోతే జరగదు. సుబ్బమ్మకు ఓపిక తగ్గుతున్న సమయంలో ఆమెను ఆదుకోటానికి పద్మ వచ్చింది. కోడలైనా కూతురిలా చూసుకుంటుంది. ఆమె పిల్లలు లావణ్య, రవి ఎంతో నటాషా అంతకంటే ఎక్కువ. సూర్యం సంగతి చెప్పే పనిలేదు. శారద ఏం చెప్తే అది ఆజ్ఞ వాళ్ళకు. ఇంటి పనులు, పార్టీ పనులూ అన్నీ బాధ్యతగా చేస్తుంటారు. … Continue reading
Posted in ధారావాహికలు
Leave a comment
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్’- కస్తూరి మురళీకృష్ణ
పైగా పాటలు పాడే నటీనటులు శిక్షణ పొందిన గాయనీ గాయకులు కారు. దాంతో సంగీత దర్శకులు కూడా బాణీలను తేలికగా ఉంచేవారు. నేపథ్యగానం సాధ్యమైన తరువాత పాటలు పాడే బాధ నటీనటులకు తప్పింది. లత బొంబాయిలో అడుగుపెట్టినప్పుడు నేపథ్యగానం ఇంకా అంతగా ప్రాచుర్యం పొందలేదు. సైగల్, సురేంద్ర, నూర్జహాన్, సురయ్య వంటి వారు తమ పాటలు … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
స్త్రీవాదం అందరిదీ! ఉద్వేగ భరిత రాజకీయాలు – బెల్ హుక్స్
సహోదరిత్వం ఇప్పటికీ శక్తివంతమయిందే ‘‘సహోదరిత్వం శక్తివంతమైంది’’ అన్న నినాదం మొట్టమొదట వాడినప్పుడు విన్నవాళ్ళకి ఒళ్ళు గగుర్పొడిచింది. నేను డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు నేను స్త్రీ వాద ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొనటం ప్రారంభించాను. మొదటి సంవత్సరం
Posted in ధారావాహికలు
Leave a comment
ఎన్నో రంగుల చీకటి – స్వాతి పంతుల
మొత్తం 113 కవితలు… వీటినిండా ఎంతమంది, ఎన్ని రకాల మనుషులో… మనసులో గాయపడిన వారు, గాయం చేసేవారు, ఆకాంక్షలు, ఆంక్షల మధ్య నలిగిపోయిన వారు, మనం నడిచే దారుల మీద ముళ్ళు పరిచేవారు, మిణుగురులై దారి చూపించిన వారు… ఇలా చాలామంది. వాటిల్లో నాకు నచ్చిన కొన్ని కొన్ని వాక్యాలు… ఇంతకన్నా విశ్లేషించలేను.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
పోతన చిత్రించిన ‘సత్యభామ’ – బి.విజయభారతి
సత్యభామ శ్రీకృష్ణుని ఎనిమిది మంది రాణులలో ఒకతె. ఈ ఎనిమిది మందినీ కవులు అష్టవిధ శృంగార నాయికలకు ప్రతీకలుగా తీర్చిదిద్దారు. పండితులూ, కవులూ, లక్షణకారులూ దిద్దిన పాత్రలు అవి. స్త్రీల సహజాతాలను ఈ సమాజం పట్టించుకున్నదెక్కడ? అయినప్పటికీ వారి సహజమైన భావావేశాలనూ కవులు దృష్టిలో ఉంచుకున్నారు. యుగ ధర్మం అంటూ మానవుల కార్యకలాపాలను… ముఖ్యంగా స్త్రీల … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
కారా కథల్లో స్త్రీ పాత్రలు -డా.బి.నాగశేషు
కథకు ఒక ప్రాంతం లేదు, కథకు కులం లేదు, కథకు మతం లేదు, కథ ఫలానా వాళ్ళే రాయాలనే వాదం కూడా లేదు. సాహిత్యాకాశంలో కథల వర్షం ఎక్కడ కురిసినా కథానిలయం చేరాల్సిందే. నేడు మనం ఏదైనా ఒక విషయాన్ని కానీ, విషయాంశాన్ని కానీ, స్థలం కానీ, స్థలమహాత్యం కానీ, వ్యక్తులు గానీ, వ్యక్తుల గురించి … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
అంగట్ల ఆగమైన గొంగడి -జూపాక సుభద్ర
గీ గ్లోబలైజేషన్ ఎన్ని గొల్లేలేసినా, మాడ్రనైజేషన్‌తోని ఎన్ని కొత్త వస్తువులు కోలాటమాడినా నాకు పాత వస్తువులంటేనే ఖాయిషు. నా సిన్నప్పుడూ మా సుట్టు అవుసరాలు దీర్సిన మర్రిసెంబు, యిసుర్రాయి, రోలు, కడెమేసుకుని వుండే రోకలి, కంచుతలెలు, సిర్రె
Posted in వ్యాసం
Leave a comment
వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: సావిత్రి (1904`1917) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
వలసాంధ్రలో స్త్రీల సంపాదకత్వంలో వెలువడిన రెండవ స్త్రీల పత్రిక ‘సావిత్రి’. జనవరి 1904లో కాకినాడ నుండి ప్రచురించబడ్డం ప్రారంభించిన ‘సావిత్రి’ మధ్యలో కొంతకాలం ఆగిపోయినా 1917 వరకూ కొనసాగినట్లు కనిపిస్తుంది. సమకాలీన మహిళోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన
Posted in వ్యాసం
Leave a comment
మా జీవితమంతా అప్పులు తీసుకోవడం, దాన్ని తిరిగి చెల్లించడంతోనే సరిపోతోంది -సంస్కృతి తల్వార్
అనువాదం: రవికృష్ణ అప్పులు, అవమానాల ఊబిలో కూరుకుపోయిన హవేలియాఁ గ్రామ దళిత మహిళలు జాట్ సిక్కుల ఇళ్ళల్లో పశువుల శాలలను శుభ్రం చేసి, పేడను ఎత్తిపోస్తుంటారు. ముందస్తుగా డబ్బు అప్పు తీసుకోవడం వలన వారు తమ వేతనంలో కొంత భాగాన్ని కోల్పోతారు. పశువుల కొట్టంలోని ఇటుకలు పరిచిన మట్టి నేల మీద నున్న గేదె పేడను … Continue reading
Posted in వ్యాసం
Leave a comment